ఫోన్ కొన్నారు సరే, మరి వాటి సంగతేంటి..?

కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే, ఆ ఫోన్ నిమిత్తం వీలైనంత త్వరగా చేయవల్సిన ముఖ్యమైన పనులు..

|

నెలనెలా దాచుకున్న డబ్బులతో మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసారా? అయితే, ఇక్కడితో పనైపోయిందిని సంబరపడిపోకండి. ఫోన్‌ను ఎంతైతే ఇష్టపడి కొన్నారో..? అంతే పర్యవేక్షణతో ఆ ఫోన్‌ను మెయింటేన్ చేస్తుండాలి. కొంత మంది కొత్త ఫోన్‌కు ఏ విధమైన ప్రొటెక్షన్‌ను కల్పించకుండా ఇష్టమొచ్చినట్లు రఫ్ అండ్ టఫ్‌‍గా వాడేస్తుంటారు. ఇలా చేయటం అనేది ఫోన్‌ను ఓపెన్ రిస్క్‌లో పడేసినట్లే. కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే, ఆ ఫోన్ నిమిత్తం వీలైనంత త్వరగా చేయవల్సిన ముఖ్యమైన పనులను ఇక్కడ సూచించటం జరుగుతోంది...

 

Tempered screen

Tempered screen

స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేకు ప్రొటెక్షన్ అనేది చాలా అవసరం కాబట్టి ఫోన్ డిస్‌ప్లే పై మంచి క్వాలిటీ గల tempered screen ప్రొటెక్షన్‌ను ఏర్పాటు చేసుకోండి. ఇలా చేయటం వల్ల చిన్నచిన్న ప్రమాదాల నుంచి మీ ఫోన్ సేఫ్‌గా ఉంచొచ్చు!

ఫోన్ వెనుక భాగాన్ని సెక్యూర్‌గా ఉంచుకునేందుకు

ఫోన్ వెనుక భాగాన్ని సెక్యూర్‌గా ఉంచుకునేందుకు

ఫోన్ వెనుక భాగాన్ని Scratch ప్రూఫ్‌గా ఉంచుకునేందుకు ట్రెండీ లుక్‌లో ఉన్న ఓ సాలిడ్ బ్యాక్ కవర్‌ను ఏర్పాటు చేసుకోండి.

ఇన్స్యూరెన్స్‌ తప్పక చేయించుకోండి...
 

ఇన్స్యూరెన్స్‌ తప్పక చేయించుకోండి...

మీకు తెలుసా! మీ స్మార్ట్‌ఫోన్‌కు ఇన్స్యూరెన్స్ చేయించు కోవచ్చని?

అనేక కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌లకు ఇన్స్యూరెన్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఫోన్‌కు సంబంధించి ఫిజికల్ అలానే లిక్విడ్ డ్యామెజీలను ఈ ఇన్స్యూరెన్స్ కవర్ చేస్తుంది. కాబట్టి మీ కొత్త స్మార్ట్‌ఫోన్ పేరుమీద ఓ ఇన్స్యూరెన్స్ పాలసీని పొందండి.

Android Device Manager

Android Device Manager

మీరు కొనుగోలు చేసిన కొత్త ఫోన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యేది అయితే వెంటనే డివైస్‌లోని గూగుల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Android Device Manager ఆప్షన్‌ను యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయటం పొరపాటున మీ ఫోన్ మిస్సైనట్లయితే గూగుల్ ద్వారా సులువుగా వెతికిపట్టుకునే ఆస్కారం ఉంటుంది. ఇదే సమయంలో మీ ఫోన్ కు Screen లాక్ అనేది కూడా తప్పనిసరి

 

 

ఓవర్ ఛార్జింగ్ వద్దు

ఓవర్ ఛార్జింగ్ వద్దు

చాలా మంది యూజర్లు తమ ఫోన్ లను ఛార్జింగ్ సాకెట్ లకు కనెక్ట్ చేసి ఉంచేస్తుంటారు. ఇలా చేయటం వల్ల ఓవర్ ఛార్జింగ్ జరిగి ఫోన్ బ్యాటరీ దెబ్బతినే ప్రమాదముంది. కాబట్టి ఫోన్ ఛార్జింగ్‌ను పరిధి మేరకే చేయండి.

యాంటీ వైరస్ తప్పనిసరి...

యాంటీ వైరస్ తప్పనిసరి...

మీ ఫోన్‌లోకి ప్రమాదకర వైరస్‌లు చొరబడకుండా శక్తవంతమైన యాంటీ మాల్వేర్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని తరచూ ఆ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తుండండి.

సరిపోయే విధంగా ఉండాలి...

సరిపోయే విధంగా ఉండాలి...

మీరు క్యారీ చేసే స్మార్ట్‌ఫోన్ పాకెట్‌లో కంఫర్ట్‌గా ఫిట్ అయ్యేలా చూసుకోండి. ఒకవేళ ఆ ప్రదేశం బాగా ఇరుకుగా ఉన్నట్లయితే ఫోన్‌కు వెంటిలేషన్ అనేది ఇబ్బందికరంగా మారతుంది.  

Best Mobiles in India

English summary
Essential tips to protect your smartphone from any serious damage. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X