మార్కెట్లో మైక్రోసాఫ్ట్ లుమియా 535 ధర ఎంత..?

|

మైక్రోసాఫ్ట్ తన సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ విండోస్ ఫోన్ ‘లుమియా 535'ను బుధవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. లుమియా 530 స్మార్ట్‌ఫోన్‌కు సెక్ససర్ వర్షన్‌గా విడుదలైన ఈ ఫోన్ ధర ఇంకా అందుబాటుకు సంబంధించి మైక్రోసాఫ్ట్ ఏ విధమైన వివరాలను వెల్లడించలేదు. అత్యాధునిక విండోస్ ఫీచర్లతో ఆకట్టుకుంటోన్న ఈ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి గిజ్‌బాట్ ఆసక్తికర వివరాలను సేకరించింది.

మార్కెట్లో మైక్రోసాఫ్ట్ లుమియా 535 ధర ఎంత..?

విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియవచ్చిన సమాచారం మేరకు లుమియా 535 డిసెంబర్ 1 నుంచి రిటైల్ మార్కెట్లో లభ్యంకానుంది. ధర రూ.8,990. రెడ్మండ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ఓ టెక్ దిగ్గజం ఇప్పటికే లూమియా 535కు సంబంధించి ఆఫ్‌లైన్ ప్రీఆర్డర్లను స్వీకరిస్తోంది. అయితే, ఈ ఫోన్ తయారీదారు నవంబర్ 25 నుంచే ప్రీఆర్డర్‌లకు ఆహ్వానిస్తోంది. నవంబర్ 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. డిసెంబర్ 1 నుంచి భారత్‌లోని అన్ని నోకియా ప్రయారిటీ స్టోర్‌లలో లూమియా 535 లభ్యమవుతుంది.

లూమియా 535 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 960 x 540పిక్సల్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం (లుమియా డెనిమ్ అప్‌డేట్‌తో), 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్ కనెక్టువిటీ) పరిమాణం 140.2×72.4×8.8 మిల్లీ మీటర్లు, బరువు 1905 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Exclusive: Microsoft Lumia 535 Price, Availability and Offers Revealed Before Nov 26 Launch. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X