గ్లోబల్ మార్కెట్లోకి తనదైన శైలిలో అరంగ్రేటం చేసిన ఫుజిట్సు సరికొత్త ఫార్ములాతో ముందుకు రాబోతుంది. పటిష్టమైన వాటర్ ప్రూఫ్ వ్యవస్థను ఉపయోగించి స్మార్ట్ ఫోన్స్ అదేవిధంగా టాబ్లట్ పీసీలను వ్ళద్ధి చేస్తుంది. సమర్ధవంతమైన వాటర్ ప్రూఫ్ శరీరాక్ళతితో రూపుదిద్దుకున్న ఈ గ్యాడ్జెట్‌లు 5 అడుగులో నీటిలో అరగంట పాటు నానినప్పటికి చెక్కుచెదరకుండా పని చేస్తాయి.
స్మార్ట్ ఫోన్ ఫీచర్లు:
* ఈ స్మార్ట్ ఫోన్ పూర్తిగా స్ర్కాన్ రెసిస్టెంట్ కోటింగ్ తో కప్పబడి ఉంటుంది,
* ఫోన్ మందం 6.7mm,
* 4.6 అంగుళాల హై డెఫినిషన్ AMOLED డిస్ ప్లే,
* 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
* క్వాడ్ కోర్ ప్రాసెసర్,
* ఆండ్రాయిడ్ v 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం.
టాబ్లెట్ ఫీచర్లు:
* 10 అంగుళాల డిస్‌ప్లే,
* LTE సపోర్ట్,
* చేతి సంజ్ఞ నియంత్రణలు ( హ్యాండ్ గెస్ట్యుర్ కంట్రోల్స్).
అగష్టునాటికి ఈ డివైజ్ లు పూర్తి స్ధాయిలో అందుబాటులోకి వస్తాయి. ధర ఇతర స్పెసిఫికేషన్‌ల వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.













