రెండు బ్యాటరీలతో చైనా ఫోన్ సంచలనం

జియోనీ M2017 మార్కెట్లో లాంచ్ అయ్యింది.

|

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ జియోనీ, M2017 పేరుతో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను అక్కడి మార్కెట్లో లాంచ్ చేసింది. 3500 mAh సామర్థ్యంతో కూడిన రెండు శక్తివంతమైన బ్యాటరీలను జియోనీ ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసింది.

Read More : 2017లో రాబోతున్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..?

శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్  ప్రాసెసర్

శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే ఈ ఫోన్‌లో 5.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేసారు. (రిసల్యూషన్ సామర్థ్యం2560x 1440పిక్సల్స్), శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ octa-core 653 ప్రాసెసర్ పై ఫోన్ రన్ అవుతుంది. ఫోన్‌లో ఏర్పాటు చేసిన 6జీబి ర్యామ్ శక్తివంతమైన పనితీరును ఆఫర్ చేస్తుంది.

డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో ..

డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో ..

డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో  వస్తోన్న జియోనీ M2017 ఫోన్ వెనుక భాగంలో 2 ఎక్స్, 8 ఎక్స్ ఆప్టికల్, డిజిటల్ జామ్ ప్రత్యేకతలతో కూడిన 12 మెగా పిక్సల్ + 13 మెగా పిక్సల్ సెన్సార్లను పొందుపరిచారు.

 4కే వీడియో రికార్డింగ్..

4కే వీడియో రికార్డింగ్..

జియోనీ M2017 కెమెరా ద్వారా 4కే రిసల్యూషన్ క్వాలిటీలో వీడియోలను క్యాప్చుర్ చేసుకోవచ్చు. ఫోన్ ముందు భాగంలో 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను జియోనీ నిక్షిప్తం చేసింది.

రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో

రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో

28జీబి, 256జీబి రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో జియోనీ M2017 అందుబాటులో ఉంటుంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను పొడిగించుకునే అవకాశం కల్పించారు.

7000 mAh బ్యాటరీ సపోర్ట్‌

7000 mAh బ్యాటరీ సపోర్ట్‌

ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్‌లో 4జీ కనెక్టువిటీతో పాటు వైఫై, బ్లుటూత్, యూఎస్బీ టైప్-సీ, యూఎస్బీ ఆన్ ద గో వంటి కనెక్టువిటీ ఫీచర్లు ఉన్నాయి. 7000 mAh బ్యాటరీ సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్ క్విక్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. గోల్డ్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

 మెటల్ ఇంకా లెదర్ కాంభినేషన్‌

మెటల్ ఇంకా లెదర్ కాంభినేషన్‌

జియోనీ M2017 బాడీ నిర్మాణం మెటల్ ఇంకా లెదర్ కాంభినేషన్‌లో ఉంటుంది. ప్రస్తుతానికి చైనా మార్కెట్లో మాత్రమే జియోనీ M2017 అందుబాటులో ఉంటుంది. 128జీబి స్టోరేజ్ వర్షన్ ధర రూ.68,240 (చైనా కరెన్సీలో), 256జీబి స్టోరేజ్ వర్షన్ ధర రూ.1,65,740 (చైనా కరెన్సీలో).

Best Mobiles in India

English summary
Gionee M2017 Launched with Dual-rear Camera and 7000mAh Lithium-ion Battery. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X