గూగుల్ కొత్త ఫోన్లకు రేపే ముహర్తం

By Hazarath
|

గూగుల్ ప్రతిష్టాత్మకంగా విడుదల చేయనున్న పిక్సల్ ,ఫిక్సల్ ఎక్స్ఎల్ ఫోన్లకు ముహర్తం కుదిరింది. గూగుల్ గ్రాండ్ ఈవెంట్ రేపు ప్రారంభం కానుంది. కాలిఫోర్నియాలో జరగనున్న ఈవెంట్ లో గూగుల్ తన తరువాతి ఫోన్లను లాంచ్ చేయనుంది. ఆ ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు అప్పుడే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. లీకయిన ఫీచర్స్ పై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యమవుతున్న ఫోన్లు

అక్టోబర్ 4న శాన్ ప్రాన్సిస్కోలో

అక్టోబర్ 4న శాన్ ప్రాన్సిస్కోలో

అక్టోబర్ 4న శాన్ ప్రాన్సిస్కోలో జరగనున్న గ్రాండ్ ఈ వెంట్ లో గూగుల్ తన కొత్త ఫోన్లు Pixel, Pixel XLలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫీచర్స్ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

గూగుల్ తన యాప్స్ అల్లో అలాగే డ్యుయో

గూగుల్ తన యాప్స్ అల్లో అలాగే డ్యుయో

ఈ ఫోన్లలో గూగుల్ తన యాప్స్ అల్లో అలాగే డ్యుయో యాప్ లను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ ఫిక్సల్ ఫోన్లలో అన్ లిమిటెడ్ ఫోటో బ్యాకప్ ఇస్తామని ప్రామిస్ చేసింది. మాగ్జిమమ్ రిజల్యూషన్ తో మీరు అన్ లిమిటెడ్ ఫోటోలను ఇందులో భద్రపరుచుకోవచ్చు.

Google Pixel XL

Google Pixel XL

స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే Google Pixel XL 5.5 ఇంచ్ QHD అమోల్డ్ డిస్ ప్లే తో రానుంది. దీంతో పాటు 534ppi గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. 2.15GHz స్నాప్ డ్రాగన్ 821 క్వాడ్ కోర్ చిప్ సెట్ మీ ద రన్ అవుతుంది. 2560×1440 pixels రిజల్యూషన్ కలిగి ఉంది.

 ర్యామ్, కెమెరా

ర్యామ్, కెమెరా

4జిబి ర్యామ్ తో పాటు 256 జిబి ఇంటర్నల్ మెమొరీతో ఈ ఫోన్లు రానున్నాయి. అయితే విస్తరణ సామర్థ్యం ఉందాలేదా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కెమెరా విషయానికొస్తే 12 ఎంపీ రేర్ కెమెరాతో ఫోటోలు షూట్ చేయవచ్చు. సెల్ఫీ విషయానికొస్తే 8 ఎంపీ సెల్ఫీ కెమెరానిపొందుపరిచారు.

3,450mAh బ్యాటరీ

3,450mAh బ్యాటరీ

3,450mAh బ్యాటరీతో ఈ ఫోన్ రానుంది. 26 గంటల పాటు టాక్ టైం అలాగే 456 గంటలు స్టాండ్ బై మోడ్ లో ఫోన్ ఉంటుందని లీకయిన వివరాలు తెలియజేస్తున్నాయి. ఫింగర్ ప్రింట్ స్కానర్ తో పాటు 4G support, Wi-Fi, Bluetooth, and NFC అదనపు ఆకర్షణలు.ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఫ్లాట్ ఫాం నౌగట్ మీద రన్ అవుతుంది.

Google Pixel స్పెసిఫికేషన్స్

Google Pixel స్పెసిఫికేషన్స్

Google Pixel స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే 5 ఇంచ్ QHD డిస్ ప్లే తో రానుంది. ఇక మిగిలినవన్నీ సేమ్ పీచర్లే ఉంటాయి. బ్యాటరీ మాత్రం 2,770mAhతో రానుంది. టాక్ టైం విషయానికొస్తే 32 గంటలు వరకు ఉంటుంది. స్టాండ్ బై టైం 552 గంటలు.

 గూగుల్ తన ఇతర డివైస్ లను

గూగుల్ తన ఇతర డివైస్ లను

వీటితో పాటు గూగుల్ తన ఇతర డివైస్ లను కూడా ఈ ఈవెంట్ లో లాంచ్ చేసే అవకాశం ఉంది.డే డ్రీమ్ డివైస్ తో పాటు గూగుల్ హోమ్ వైఫై రూటర్ ,ట్యాబ్లెట్లు ఇంకా కొన్ని రకాల గాడ్జెట్లు లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్

అయితే రేపు జరగబోయో ఈవెంట్ లో గూగుల్ తన కొత్త ఫ్లాట్ పాం ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ని కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 

Best Mobiles in India

English summary
Google Pixel, Pixel XL photos, specifications, features leaked ahead of October 4 launch read more gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X