నోకియా నుంచి 7 స్మార్ట్‌ఫోన్‌లు దూసుకొస్తున్నాయి!

|

మరికొద్ది నెలల్లో మార్కెట్లో లాంచ్ కాబోతున్న నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి రోజుకో కొత్త న్యూస్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. గతంలో విడుదలైన రిపోర్ట్స్ ప్రకారం HMD Global నుంచి 2017లో 5 నోకియా బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లోకి రాబోతున్నట్లు చెప్పటం జరిగింది.

 నోకియా నుంచి 7 స్మార్ట్‌ఫోన్‌లు దూసుకొస్తున్నాయి!

Read More : Ransomware అంటే ఏంటి..?

తాజాగా వెలుగులోకి వచ్చిన మరో రిపోర్ట్ ప్రకారం నోకియా నుంచి కనీసం 6 లేదా 7 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు ఈ ఏడాది మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. నోకియా స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి మలేషియన్ పంపిణిదారైన 'Avaxx'ఈ సమాచారాన్ని బహిర్గతం చేసింది.

అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా..

అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా..

లో-ఎండ్, మిడ్ - రేంజ్, హై -ఎండ్ ఇలా వర్గాలను టార్గెట్ చేసే విధంగా ఈ నోకియా ఫోన్‌లు ఉంటాయని తెలుస్తోంది. వీటితో పాటు నోకియా ఫీచర్ ఫోన్‌లు కూడా మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశముందని ఈ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

3సీ సర్టిఫికేషన్‌ పూర్తి చేసుకుని....

3సీ సర్టిఫికేషన్‌ పూర్తి చేసుకుని....

గతవారమే 'TA-1000' మోడల్ నెంబర్‌తో ఉన్న నోకియా బ్రాండెడ్ ఫోన్ ఒకటి చైనాలో 3సీ సర్టిఫికేషన్‌ను పొందింది. నోకియా ఇ1 పేరుతో రాబోతున్న ఈ ఫోన్ బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసేదిగా ఉండొచ్చని తెలుస్తోంది.

వెబ్ మీడియాలో ఆసక్తికర రూమర్స్..
 

వెబ్ మీడియాలో ఆసక్తికర రూమర్స్..

నోకియా నుంచి రాబోతున్న మరో మిడ్ రేంజ్ ఫోన్ నోకియా డీ1సీకి సంబంధించి ఆసక్తికర రూమర్స్ వెబ్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. నోకియా డీ1సీ పేరుతో రాబోతున్న మొదటి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

మొదటి వేరియంట్ వచ్చేసరికి

మొదటి వేరియంట్ వచ్చేసరికి

5 ఇంచ్ హైడెఫినిషన్ 1080 డిస్‌ప్లే, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా వంటి ప్రధానమైన ఫీచర్లు కలిగి ఉంటంది. ఈ ఫోన్ ధర 150 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.10,000).

రెండవ వేరియంట్ వచ్చేసరికి..

రెండవ వేరియంట్ వచ్చేసరికి..

5.5 ఇంచ్ హైడెఫినిషన్ 1080 డిస్‌ప్లే, 3జీబి ర్యామ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా వంటి ప్రధానమైన ఫీచర్లు కలిగి ఉంటంది. ఈ ఫోన్ ధర 150 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.15,000).

ఇతర స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే...

ఇతర స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే...

నోకియా డీ1సీ ఫోన్‌కు సంబంధించి ఇతర స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే... క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్(క్లాక్ వేగం 1.4గిగాహెర్ట్జ్), అడ్రినో 505 జీపీయూ, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 ఆపరేటింగ్ సిస్టం.

 HMD గ్లోబల్

HMD గ్లోబల్

నోకియా బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లను HMD గ్లోబల్ మార్కెట్లో ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తుంది. నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఫిబ్రవరిలో బార్సిలోనా వేదికగా MWC 2017 ఈవెంట్‌లో లాంచ్ చేసే అవకాశముంది.

 శక్తివంతమైన ఫీచర్లతో..

శక్తివంతమైన ఫీచర్లతో..

ఇటు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లను కూడా నోకియా మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. రూ.30,000 రేంజ్‌లో అందుబాటులో ఉండే ఈ ఫోన్‌లు క్వాడ్ హైడెఫినిషన్ రిసల్యూషన్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 820 క్వాడ్-కోర్ ప్రాసెసర్, 22.6 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 4కే వీడియో రికార్డింగ్, 4జీ ఎల్టీఈ, ఆండ్రాయిడ్ నౌగట్ ఆవుట్-ఆఫ్-ద-బాక్స్ వంటి శక్తివంతమైన ఫీచర్లను కలిగి ఉండే అవకాశముందని తెలుస్తోంది.

రూ.10,000లోపు ధర ట్యాగ్‌లో

రూ.10,000లోపు ధర ట్యాగ్‌లో

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి నోకియా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో నోకియా అభిమానుల అంచనాలు అంబరాన్ని తాకాయి. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం నోకియా నుంచి రాబోతున్న మూడు సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు రూ.10,000లోపు ధర ట్యాగ్‌లో లభమయ్యే అవకాశముందని తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
HMD Global to launch 6-7 Nokia Android smartphones this year, New Report. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X