ఈ ఫోన్ ముందు మిగిలినవన్నీ బలాదూర్!

ఈ మధ్య మార్కెట్లో లాంచ్ అయిన హువావే హానర్ 8 ఫోన్ మిగలిన ఫోన్‌లకు అందనంత ఎత్తులో నిలిచింది.

|

స్మార్ట్‌ఫోన్‌లు మనందరి జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సరిగ్గా అరచేతిలో ఇమిడిపోతున్న ఈ పాకెట్ సైజ్ మార్వల్స్ ద్వారా అన్ని రకాల కమ్యూనికేషన్ అవసరాలను తీర్చుకోగలుగుతున్నాం. స్మార్ట్‌ఫోన్‌లలోని అన్ని విభాగాలతో పాటు కెమెరా విభాగం కూడా అభివృద్థి చెందుతూ వచ్చింది.

ఈ ఫోన్ ముందు మిగిలినవన్నీ బలాదూర్!

స్మార్ట్‌ఫోన్ కెమెరాల విషయానికి వచ్చేసరికి ఈ మధ్య మార్కెట్లో లాంచ్ అయిన హువావే హానర్ 8 ఫోన్ మిగలిన ఫోన్‌లకు అందనంత ఎత్తులో నిలిచింది. బేసిక్ ఫోటోగ్రఫీ ప్రిన్సిపల్స్‌కు ఇన్నోవేటివ్ సెన్సార్‌లను జోడించి అభివద్థి చేసిన ప్రత్యేక కెమెరా వ్యవస్థను హానర్ 8 ఫోన్‌లో ఏర్పాటు చేయటం జరిగింది. హానర్ 8 ఫోన్‌ను బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌గా నిలబెట్టిన ఫీచర్ల పై స్పెషల్ ఫోకస్...

12 + 12ఎంపీ డ్యుయల్ లెన్స్ కెమెరా సెటప్

12 + 12ఎంపీ డ్యుయల్ లెన్స్ కెమెరా సెటప్

హానర్ 8 ఫోన్ కెమెరా ప్రత్యేకమైన హార్డ్‌వేర్‌తో వస్తోంది. ఈ హార్డ్‌వేర్‌లో నిక్షిప్లం చేసిన ఇన్నవేటివ్ బయోనిక్ 12 మెగా పిక్సల్ డ్యుయల్ లెన్స్ సిస్టం, హైక్వాలిటీ ఫోటోగ్రఫీని మీకు చేరువచేస్తుంది. ఈ డ్యుయల్ లెన్స్ పనితీరును విశ్లేషించినట్లయితే మొదటి లెన్స్.. ఫ్రేమ్‌ను రిచ్ కలర్‌లో క్యాప్చుర్ చేసేందుకు అవసరమైన వ్యవస్థను సమకూరుస్తుంది. ఇదే సమయంలో రెండవదైన మోనోక్రోమ్ లెన్స్.. ఫోటోలకు మరింత షార్ప్‌నెస్‌ను అద్ది అవసరమైన లైట్‌ను సమకూరుస్తుంది.

హైక్వాలిటీ ఫోటోలు..

హైక్వాలిటీ ఫోటోలు..

హానర్ ఫోన్ 8లో నిక్షిప్తం చేసిన డ్యుయల్ లెన్స్ కెమెరా సెటప్ ప్రతిసారి హైక్వాలిటీ ఫోటోలను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కెమెరా ద్వారా బ్లాక్‌లైట్, లో లైట్ లాంటి కాంప్లెక్స్ కండీషన్‌లలోనూ హైక్వాలిటీ ఫోటోలను క్యాప్చుర్ చేసుకోవచ్చు. కెమెరాలో ఎక్విప్ చేయబడిన హైబ్రీడ్ ఆటో ఫోకస్ టెక్నాలజీ షార్ట్ రేంజ్ ఫోటోల కోసం లేజర్ ఫోకస్, లాంగ్ రేంజ్ ఫోటోల కోసం డెప్త్ ఫోకస్‌లను ఉపయోగించుకుంటుంది.

 డీఎస్ఎల్ఆర్ స్థాయి Bokeh ఎఫెక్ట్స్
 

డీఎస్ఎల్ఆర్ స్థాయి Bokeh ఎఫెక్ట్స్

హానర్ 8 ఫోన్‌లో నిక్షిప్తం చేసిన డ్యుయల్ లెన్స్ కెమెరా సెటప్ వైడ్ అపెర్చుర్ మోడ్‌ను కలిగి ఉంటుంది. ఈ మోడ్‌ను ఎనేబుల్ చేసుకున్నట్లయితే ఫోటో బ్యాక్‌‌గ్రౌండ్‌లను కావల్సిన విధంగా బ్లర్ చేసుకోవచ్చు. ఈ ఎఫెక్టివ్ కెమెరా మోడ్, మీరు చిత్రీకరించే ఫోటోల పై పూర్తి నియంత్రణను అందిస్తుంది.

మాన్యువల్‌గా చిత్రీకరించుకోవాలనుకునే వారి కోసం..

మాన్యువల్‌గా చిత్రీకరించుకోవాలనుకునే వారి కోసం..

ఫోటోస్ ఇంకా వీడియోలను మాన్యువల్‌గా చిత్రీకరించుకోవాలనుకునే వారి కోసం హానర్ 8 ఫోన్ ప్రో మోడ్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ ప్రో మోడ్‌లో అందుబాటులో ఉండే మాన్యువల్ కంట్రోల్ మోడ్స్‌తో ప్రొఫెషనల్ స్థాయి పనితీరును కనబరుస్తాయి. ఈ మోడ్‌లో నిక్షిప్తం చేసిన ఐఎస్ఓ, షట్టర్ స్పీడర్, వైట్ బ్యాలన్స్ వంటి ఫీచర్స్ మీ నైపుణ్యాలకు మరింత పొదునుపెడతాయి.

లైట్ పెయింటింగ్ మోడ్..

లైట్ పెయింటింగ్ మోడ్..

లైట్ పెయింటింగ్ మోడ్ పేరుతో ప్రత్యేకమైన మోడ్‌ను హానర్ 8 ఫోన్ ఆఫర్ చేస్తుంది. ఈ డెడికేటెడ్ మోడ్ సహాయంతో లాంగ్ ఎక్స్‌పోజర్ షాట్‌లను నాలుగు రకాల ప్రీ-డిఫైనుడ్ మోడ్స్ (టెయిల్ లైట్స్, లైట్స్ గ్రాఫిటీ, సిల్కీ వాటర్, స్టార్ ట్రెక్)లో క్యాప్చుర్ చేసుకోవచ్చు. వాస్తవానికి ఇలాంటి లాంగ్ ఎక్స్‌పోజర్ ఇమేజెస్ హై-ఎండ్ డీఎల్ఎల్ఆర్ కెమెరాల ద్వారానే సాధ్యమవుతాయి.

 క్లీన్, మినిమల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌

క్లీన్, మినిమల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌

హానర్ 8 ఫోన్‌లో ఏర్పాటు చేసిన సుప్రీమ్ క్వాలిటీ కెమెరా హార్డ్‌వేర్ అలానే విప్లవాత్మక కెమెరా యాప్ తమ క్లీన్, మినిమల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీకి పూర్తి న్యాయం చేకూరుస్తాయి.

సహజసిద్ధమైన రీతిలో..

సహజసిద్ధమైన రీతిలో..

హానర్ 8 ఫోన్‌లో పొందుపరిచన డ్యుయల్ కెమెరా సెటప్ ఫోటోలను సహజసిద్ధమైన రీతిలో క్యాప్చుర్ చేస్తుంది. 

శక్తివంతమైన కాంట్రాస్ట్ లెవల్స్‌..

శక్తివంతమైన కాంట్రాస్ట్ లెవల్స్‌..

హానర్ 8 ఫోన్ ద్వారా చిత్రీకరించిన ఫోటోలు శక్తివంతమైన కాంట్రాస్ట్ లెవల్స్‌తో ఫోన్‌లోనే కాకుండా ల్యాప్‌టాప్స్ అలానే పెద్ద స్ర్కీన్ ఎల్ఈడీ టీవీలలోనూ అద్బుతమైన క్వాలిటీతో కనిపిస్తాయి. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఎటువంటి షేక్ లేని స్థిరమైన ఫోటోస్ అలానే వీడియోలను అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Honor 8 Camera is miles ahead of the competition. Read More in Telugu Gizbot..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X