4జీబి ర్యామ్‌తో హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రో, ధర రూ.26,490

64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 20 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం

|

తైవాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ హెచ్‌టీసీ తన సరికొత్త స్మార్ట్‌‌ఫోన్‌ను గురువారం మార్కెట్లో లాంచ్ చేసింది. హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రో పేరుతో విడుదలైన అయిన ఈ ఫోన్ ధర రూ.26,490.

4జీబి ర్యామ్‌తో హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రో, ధర రూ.26,490

Read More : ఇంటర్నెట్‌లో నోకియా కొత్త ఫోన్ హల్‌చల్

డిసెంబర్ 15 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇదే కార్యక్రమంలో భాగంగా హెచ్‌టీసీ 10 ఇవో పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను కూడా హెచ్‌టీసీ లాంచ్ చేసింది. భారీ అంచనాల మధ్య హైఎండ్ స్పెసిఫికేషన్‌లతో లాంచ్ అయిన హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రో ప్రత్యేకతలు ఈ విధంగా ఉన్నాయి.

 ప్రీమియమ్ క్వాలిటీ డిజైన్‌..

ప్రీమియమ్ క్వాలిటీ డిజైన్‌..

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రో ఫోన్ ప్రీమియమ్ క్వాలిటీ డిజైన్‌తో మొదటి చూపులోనే మిమ్మల్ని కట్టిపడేస్తుంది. మాటీ ఫినిషన్‌ను కలిగి పూర్తిస్థాయి మెటల్ యునిబాడీతో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్ స్టోన్ బ్లాక్ ఇంకా పోలార్ వైట్‌కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

హైడెఫినిషన్ డిస్‌ప్లే..

హైడెఫినిషన్ డిస్‌ప్లే..

హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రో ఫోన్ 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. ఏర్పాటు చేసిన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ డిస్‌ప్లేకు మరింత రక్షణనిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 మీడియాటెక్ హీలియో పీ10 ప్రాసెసర్..
 

మీడియాటెక్ హీలియో పీ10 ప్రాసెసర్..

హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌కు 1.8గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో పీ10 ప్రాసెసర్ ఆయువుపట్టుగా చెప్పుకోవాలి. ఈ ప్రాసెసర్‌తో కంబైన్ చేసిన మాలీ టీ860 జీపీయూ ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని చూసుకుంటుంది.

4జీబి ర్యామ్‌‌, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్...

4జీబి ర్యామ్‌‌, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్...

ర్యామ్ విషయానికి వచ్చేసరికి హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 4జీబి ర్యామ్‌‌తో వస్తోంది. 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ యూజర్‌కు అందుబాటులో ఉంటుంది. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 2TB వరకు విస్తరించుకున అవకాశాన్ని కల్పించారు.

ఫింగర్ ప్రింట్ సెన్సార్‌..

ఫింగర్ ప్రింట్ సెన్సార్‌..

సెక్యూరిటీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ వెనుక భాగంలో నిక్షిప్తం చేసారు. ఫోన్‌లో పొందుపరిచిన హెచ్‌టీసీ బూమ్ సౌండ్ టెక్నాలజీ అత్యుత్తమ మీడీయా ప్లేబ్యాక్ ఎక్స్‌పీరియన్స్‌ను చేరువచేస్తుంది. శక్తివంతమైన 3000 mAh బ్యాటరీని ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసారు.

20 ఎంపీ కెమెరా, 13 ఎంపీ సెల్ఫీ షూటర్..

20 ఎంపీ కెమెరా, 13 ఎంపీ సెల్ఫీ షూటర్..

కెమెరా విషయానికి వచ్చేసరికి హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 20 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 13 మెగా పిక్సల్ సెల్ఫీ షూటర్‌ను ఏర్పాటు చేయటం జరిగింది. f/2.2 అపెర్చుర్‌తో వస్తోన్న ఈ కెమెరాలలో డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, లేజర్ ఆటోఫోకస్, ఎలక్ట్రిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం

ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం

ఆపరేటింగ్ సిస్టం విషయానికి వచ్చేసరికి హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఈ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా రూపొందించిన హెచ్‌టీసీ సెన్స్ యూజర్ ఇంటర్‌ఫేస్ ద్వారా సౌకర్యవంతమైన స్మార్ట్ మొబైలింగ్‌ను ఆస్వాదించే వీలుంటుంది. ఫోన్ కనెక్టువిటీ ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై 802.11 a/b/g/n, బ్లుటూత్ 4.1, జీపీఎస్).

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
HTC Desire 10 Pro Launched in India at Rs.26,490: 5 Interesting Things You Should Know. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X