హెచ్‌టీసీ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు, రూ.39,990 నంచి ప్రారంభం

హెచ్‌టీసీ యూ అల్ట్రా వేరియంట్ ధర రూ.59,990, యూ ప్లే వేరియంట్ ధర రూ.39,990.

|

తైవాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ హెచ్‌టీసీ (HTC) రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. హెచ్‌టీసీ యూ అల్ట్రా , హెచ్‌టీసీ యూ ప్లే మోడల్స్‌లో ఈ ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. హెచ్‌టీసీ యూ అల్ట్రా వేరియంట్ ధర రూ.59,990, యూ ప్లే వేరియంట్ ధర రూ.39,990. మార్చి రెండవ వారం నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.

Read More : రూ.303కే 30జీబి డేటా, మార్చి 31 తరువాత ప్లాన్స్

హెచ్‌టీసీ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు, రూ.39,990 నంచి ప్రారంభం

స్పెసిఫికేషన్స్ పరంగా చూస్తే హెచ్‌టీసీ యూ అల్ట్రా వేరియంట్ డ్యుయల్ డిస్‌ప్లే సపోర్ట్‌తో వస్తోంది. ఈ డివైస్‌కు సంబంధించి ప్రైమరీ డిస్‌ప్లే 5.7 అంగుళాల పరిమాణాన్ని కలిగి ఉంటుంది (రిసల్యూషన్ కెపాసిటీ 2560x 1440పిక్సల్స్). సెకండరీ డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి 2 అంగుళాల పరిమాణాన్ని కలిగి ఉంటుంది (రిసల్యూషన్ కెపాసిటీ 160x 1040పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ హెచ్‌టీసీ సెన్స్ యూజర్ ఇంటర్‌ఫేస్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్, అడ్రినో 530 జీపీయూ, 4జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (64జీబి, 128జీబి), 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 12 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 టెక్నాలజీ, యూఎస్బీ టైప్-సీ సపోర్ట్, హెచ్‌టీసీ అల్ట్రా సోనిక్ సెన్సార్.

Read More : కరప్ట్ అయిన పెన్‌డ్రైవ్ నుంచి డేటాను రికవర్ చేయటం ఎలా..?

హెచ్‌టీసీ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు, రూ.39,990 నంచి ప్రారంభం

హెచ్‌టీసీ యూ అల్ట్రా ప్లే స్సెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి... 5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 1920x1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో పీ10 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, జీపీఎస్, బ్లుటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ సపోర్ట్). హెచ్‌టీసీ తన యూ సిరీస్ ఫోన్‌ల ద్వారా 'Sense Companion' పేరుతో విప్లవాత్మక స్మార్ట్ టెక్నాలజీని పరిచయం చేసింది. ఫోన్‌లోని అన్ని యాప్‌లలో నిక్షిప్తమై ఉండే ఈ ఫీచర్ వ్యక్తిగత అసిస్టెంట్‌లా వ్యవహరిస్తుంది.

Read More : నోకియా 8 బుకింగ్స్ ప్రారంభం, ధర ఎంతంటే..?

Best Mobiles in India

English summary
HTC launches U Ultra and U Play smartphones in India, price starts at Rs 39,990. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X