హెచ్‌టీసీ నుంచి మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు

|

తైవాన్‌‍‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ హెచ్‌టీసీ భారత్‌లోని తమ అభిమానులను మరింతగా ఉత్సాహపరుస్తూ మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను సోమవారం కొత్త ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆవిష్కరించింది. వీటిలో హెచ్‌టీసీ వన్ ఎమ్8 స్మార్ట్‌ఫోన్ అధిక ముగింపు వర్షన్ కాగా, హెచ్‌టీసీ డిజైర్ 210, డిజైర్ 816 మోడళ్లు బడ్జెట్ ఫ్ఱెండ్లీ ధర ట్యాగ్‌ను కలిగి ఉన్నాయి. రూ.49,900 ధర ట్యాగ్ తో హెచ్‌టీసీ వన్ ఎమ్8 మే మొదటి వారం నుంచి ఇండియన్ మార్కెట్లో విక్రయించనున్నారు. మరోవైపు హెచ్‌టీసీ డిజైర్ 816 రూ.23,990, హెచ్‌టీసీ డిజైర్ 210 మోడల్ రూ.8,700 ధర ట్యాగ్‌లతో మార్కెట్లో లభ్యమవుతాయి.

హెచ్‌టీసీ డిజైర్ 210 కీలక స్పెసిఫికేషన్లు:

డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్, 4 అంగుళాల WVGA డిస్‌ప్లే, 1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ మీడియాటెక్ ఎంటీ6572ఎమ్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం. ధర రూ.8,700

హెచ్‌టీసీ డిజైర్ 816 కీలక స్పెసిఫికేషన్లు:

డ్యుయల్ సిమ్ కార్డ్‌స్లాట్, 5.5 అంగుళాల తాకే తెర (720 పిక్సల్ డిస్ ప్లే), స్నాప్‌డ్రాగన్ 400 క్వాడ్-కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.6గిగాహెట్జ్), 512ఎంబి ర్యామ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, 2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు (3జీ సపోర్ట్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్), ధర రూ.23,990.

హెచ్‌టీసీ వన్ ఎమ్8 కీలక స్పెసిఫికేషన్లు:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ హైడెఫినిషన్ తాకే తెర (రిసల్యూషన్1080 x 1920పిక్సల్స్, 441 పీపీఐ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ 6.0 యూజర్ ఇంటర్‌ఫేస్, 2.3గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత. ధర రూ.49.990.

హెచ్‌టీసీ ఎఫెక్ట్.. గెలాక్సీ ఎస్5 ధర తగ్గింపు

హెచ్‌టీసీ ఎఫెక్ట్.. గెలాక్సీ ఎస్5 ధర తగ్గింపు

హెచ్‌టీసీ వన్ ఎమ్8 విడుదల నేపధ్యంలో సామ్‌సంగ్ తన ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్5 పై రూ.3,000 వరకు ధర తగ్గింపును ప్రకటించింది. తాజా ధర తగ్గింపు భాగంగా గెలాక్సీ ఎస్5 వైట్ కలర్ వైరియంట్‌ను రూ.46,881 (మునుపటి ధర రూ.52,500)కు, గెలాక్సీ ఎస్5 బ్లాక్ కలర్ వేరియంట్ ను రూ50,499 (మునుపటి ధర రూ.51,999)కు సొంతం చేసుకునే అవకాశాన్ని ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ కల్పిస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X