రెడ్మీ నోట్ 4కు అసలుసిసలైన సవాల్

ఇతర ఫోన్‌ల మాదిరిగా హానర్ 6ఎక్స్ ఫోన్‌లలో హీటింగ్ సమస్యలు ఉండవు.

|

రెండు సంవత్సరాల క్రితం 2జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ కెమెరాను కలిగిన ఫోన్‌ను కొనుగోలు చేయాలంటే దాదాపుగా రూ.15000 వరకు బడ్జెట్‌ను కేటాయించాల్సి వచ్చేది. చైనా స్మార్ట్‌‌‌ఫోన్ బ్రాండ్‌ల రాకతో ఈ పరిస్థితి కాస్తా మారిపోయింది. హువావే, షియోమీ, కూల్‌ప్యాడ్, లీఇకో, లెనోవో వంటి చైనా బ్రాండ్‌లు రూ.7,000 నుంచి రూ.10,000 రేంజ్‌లో బెస్ట్ కెమెరా క్వాలిటీతో 2జీబి ర్యామ్ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చేసాయి.

రెడ్మీ నోట్ 4కు అసలుసిసలైన సవాల్

ఇండియా మార్కెట్లో కంటిన్యూస్‌గా ఫోన్‌లోను లాంచ్ చేస్తూ వస్తోన్న నమ్మకమైన బ్రాండ్‌లలో Huawei ఒకటి. ఈ బ్రాండ్ నుంచి తాజాగా Honor 6X పేరుతో సరికొత్త ఫోన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. అటు ధర పరంగా, ఇటు స్పెసిఫికేషన్స్ పరంగా రెడ్మీ నోట్ 4 ఫోన్‌కు దగ్గర పోలికులను కలిగి ఉన్న ఈ ఫోన్ షియోమీకి ప్రధాన కంపిటీటర్‌గా అవతరించింది. మార్కెట్లో హోరాహోరీగా తలపడుతోన్న ఈ రెండు ఫోన్‌లకు సంబంధించి విశ్లేషణను ఇప్పుడు చూద్దాం..

డిజైన్

డిజైన్

డిజైన్ విషయానికి వచ్చే‌సరికి ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు యుని మెటల్ బాడీలతో వస్తున్నాయి. చేతిలో సౌకర్యవంతగా ఇమిడిపోతాయి. ముందు వైపు నుంచి ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఒకేలా అనిపిస్తాయి. ఈ రెండు ఫోన్‌లకు సంబంధించి బటన్స్ కూడా సేమ్ లోకేషన్స్‌లో ఉంటాయి. వెనుక వైపు భాగాలను పరిశీలించినట్లయితే హానర్ 6ఎక్స్ డ్యుయల్ కెమెరా క్యాప్స్యుల్‌ను కలిగి ఉంటుంది. కెమెరా మాడ్యుల్ క్రింద ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేయటం జరిగింది. రెడ్మీ నోట్ 4 విషయానికి వచ్చేసరికి సింగిల్ కెమెరా మాడ్యుల్‌తో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను వెనుక భాగంలో చూడొచ్చు.

 డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 5.5 అంగుళాల డిస్‌ప్లే సపోర్ట్‌తో వస్తున్నాయి. 2.5డి కర్వుడ్ గ్లాస్‌ను కూడా ఈ డిస్‌ప్లేల పై చూడొచ్చు. అయితే, షియమో రెడ్మీ నోట్ 4తో పోలిస్తే హానర్ 6ఎక్స్ చేతిలో కంఫర్టబుల్ ఫీలింగ్‌ను కలిగిస్తుంది.

 

 హార్డ్‌వేర్ విషయానికి వచ్చేసరికి..

హార్డ్‌వేర్ విషయానికి వచ్చేసరికి..

హార్డ్‌వేర్ విషయానికి వచ్చేసరికి హువావే హానర్ 6ఎక్స్ ఫోన్ సొంతంగా తయారు చేసుకున్న హైసిలికాన్ కైరిన్ 665 చిప్‌సెట్‌తో వస్తోంది. 3జీబి అలానే 4జీబి ర్యామ్‌లను ఈ సాక్ సపోర్ట్ చేస్తుంది. మరోవైపు, రెడ్మీ నోట్ 4 కూడా హానర్ 6ఎక్స్ ఫోన్‌తో సమానమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 చిప్‌సెట్‌తో వస్తోంది. 2జీబి, 3జీబి, 4జీబి ర్యామ్‌లను ఈ సాక్ సపోర్ట్ చేస్తుంది.

 

 క్లాక్ స్పీడ్‌లను పరిశీలించినట్లయితే ..

క్లాక్ స్పీడ్‌లను పరిశీలించినట్లయితే ..

ఈ ఫోన్‌లలో ఉపయోగించిన రెండు రకాల చిప్‌సెట్‌లను లేటెస్ట్ 14nm ప్రాసెస్ పై తయారు చేయటం జరిగింది. ఈ ప్రాసెసర్‌కు సంబంధించి క్లాక్ స్పీడ్‌లను పరిశీలించినట్లయితే రెడ్మీ నోట్ 4లోని స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్‌తో పోలిస్తే, హానర్ 6ఎక్స్‌లోని కైరిన్ 665 చిప్ స్వల్పంగా ఎక్కువ వేగాన్ని కలిగి ఉంది. 4జీ ఎల్టీఈ, VoLTE, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను ఈ రెండు ఫోన్‌లలో కామన్‌గా చూడొచ్చు. ఇదే సమయంలో రెడ్మీ నో4లో లేని కనెక్టువిటీ ఫీచర్ ఒకటి హానర్ 4ఎక్స్ ఫోన్‌లో ఉంది. వై-ఫై రిపీటర్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను హానర్ 6ఎక్స్ ఫోన్‌లో అదనంగా మనం చూడొచ్చు. ఈ ఫీచర్, ఫోన్‌ను Wi-Fi modemలా మార్చివేయగలదు.

ఆపరేటింగ్ సిస్టం విషయానికి వచ్చేసరికి...

ఆపరేటింగ్ సిస్టం విషయానికి వచ్చేసరికి...

సాఫ్ట్‌వేర్ పరంగా చూస్తే హానర్ 6ఎక్స్ ఫోన్ ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన EMUI 4.1 యూజర్ ఇంటర్‌ఫేస్ పై రన్ అవుతుంది. త్వరలోనే ఈ ఫోన్‌కు ఆండ్రాయిడ్ నౌగట్ అప్‌డేట్ లభించే అవకాశం ఉంది.ఇదే సమయంలో రెడ్మీ నోట్ 4 ఫోన్ ఆండ్రాయిడ్ ఆధారంగా డిజైన్ చేసిన MIUI 8 యూజర్ ఇంటర్‌ఫేస్ పై రన్ అవుతుంది.

కెమెరా విషయానికి వచ్చేసరికి..

కెమెరా విషయానికి వచ్చేసరికి..

కెమెరా విషయానికి వచ్చేసరికి, హానర్ 6ఎక్స్ ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 12 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ కెమెరా DSLR తరహాలో రియల్ టైమ్ క్వాలిటీ ఫోటోగ్రఫీని ఆఫర్ చేస్తుంది. ఇన్‌డోర్ షాట్స్, అవుట్‌డోర్ షాట్స్, క్లోజప్ షాట్స్ ఇంకా లో-లైట్ షాట్స్ హానర్ 6ఎక్స్ కెమెరాతో కేక పుట్టిస్తాయి. ఇదే సమయంలో రెడ్మీ నోట్ 4 ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. హానర్ 6ఎక్స్ ప్రైమరీ కెమెరా ముందు ఈ కెమెరా పూర్తిగా తేలిపోతుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చేసరికి హానర్ 6ఎక్స్ ఫోన్ 8 మెగా పిక్సల్, రెడ్మీ నోట్ 4 ఫోన్ 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తున్నాయి.

బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చేసరికి...

బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చేసరికి...

బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చేసరికి రెడ్మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్ 4100mAh బ్యాటరీతో వస్తోంది. ఇదే సమయంలో హానర్ 6ఎక్స్ 3340mAh బ్యాటరీ వస్తోంది.

 ఫైనల్ రిజల్ట్స్..

ఫైనల్ రిజల్ట్స్..

కెమెరా, డిజైనింగ్, యూజర్ ఇంటర్‌ఫేస్ విభాగాల్లో రెడ్మీ నోట్ 4కు మించిన పనితీరును హానర్ 6ఎక్స్ చేరువ చేస్తుంది. హై-గ్రాఫికల్ 3డీ గేమ్స్‌ను హానర్ 6ఎక్స్ సునాయాశంగా హ్యాండిల్ చేస్తుంది. ఈ గేమ్స్ ఆడుతున్న సమయంలో ఫ్రేమ్స్ డ్రాప్ అవటం, ఫోన్ పనితీరు నెమ్మదించటం, బ్యాటరీ హీటెక్కటం వంటి సమస్యలు కనిపించవు. ఇతర ఫోన్‌ల మాదిరిగా హానర్ 6ఎక్స్ ఫోన్‌లలో హీటింగ్ సమస్యలు ఉండవు.

Best Mobiles in India

English summary
Huawei Honor 6X vs Xiaomi Redmi Note 4: the battle for the best budget phone. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X