ఐఎఫ్ఎ 2014... కొత్త స్మార్ట్‌ఫోన్‌లతో నోకియా కనువిందు

|
ఐఎఫ్ఎ 2014 లూమియా 830

ఐఎఫ్ఎ 2014... కొత్త స్మార్ట్‌ఫోన్‌లతో నోకియా కనువిందు ఈ నెల 5వ తేదీ నుంచి బెర్లిన్‌లో ప్రారంభంకానున్న ఐఎఫ్ఎ 2014 టెక్నాలజీ ప్రదర్శనను పురస్కరించుకుని గురువారం ఏర్పాటు చేసిన ఐఎఫ్ఎ 2014 ప్రీ ఈవెంట్‌లో భాగంగా సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ మొబైల్ డివిజన్‌లో భాగమైన నోకియా నుంచి మూడు సరికొత్త లూమియా శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. లూమియా 830, లూమియా 730, లూమియా 735 మోడల్స్‌లో మైక్రోసాఫ్ట్ ఈ ఫోన్‌లను ప్రదర్శించింది. వీటిలో లూమియా 830 మోడల్ ధర 330 యూరోలు (భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.26,200). కేవలం 8.5 మిల్లీమీటర్ల మందంతో రూపుదిద్దుకున్న ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను ఈ సెప్టంబర్‌లోనే మార్కెట్లోకి తీసుకురానున్నారు. లూమియా 830, లూమియా 730 స్మార్ట్‌ఫోన్‌లు శక్తివంతమైన ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్‌లలో ప్రత్యేకమైన సెల్ఫీ అప్లికేషన్‌లను మైక్రోసాఫ్ట్ నిక్షిప్తం చేసింది.

 
ఐఎఫ్ఎ 2014 లూమియా 830

లూమియా 830 ప్రత్యేకతలు... లూమియా డెనిమ్ అప్‌డేట్‌తో కూడిన విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం , 5 అంగుళాల క్లియర్ బ్లాక్ డిస్‌ప్లే (కర్వుడ్ గొరిల్లా 3.0 గ్లాస్‌తో), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 15జీబి ఉచిత వన్‌డ్రైవ్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 10 మెగా పిక్సల్ ప్యూర్‌వ్యూ రేర్ కెమెరా (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎల్ఈడి ఫ్లాష్, జిస్ ఆప్టిక్స్), 1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (720 పిక్సల్ వీడియో రికార్డింగ్ సౌలభ్యతతో), 2200 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ, క్యూఐ వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర అంచనా రూ.26,200.

 
ఐఎఫ్ఎ 2014 లూమియా 830

నోకియా లూమియా 735 ప్రత్యేకతలు... 4జీ ఎల్టీఈ కనెక్టువిటీతో ఈ ఫోన్ లభ్యం కానుంది. ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే, ఫోన్ పరిమాణం 134.70 x 68.50 x 8.90 మిల్లీమీటర్లు, బరువు 134 గ్రాములు, 4.7 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 720x1280 పిక్సల్స్, 316 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 6.7 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (సింగిల్ సిమ్ (జీఎస్ఎమ్ నెట్‌వర్క్), 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, ఎఫ్ఎమ్ రేడియో, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ), సెన్సార్లు (మాగ్నెటో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్), 2220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర అంచనా రూ.17,520.

ఐఎఫ్ఎ 2014 లూమియా 830

నోకియా లూమియా 730 డ్యూయల్ సిమ్ ప్రత్యేకతలు... ఫోన్ పరిమాణం 134.70 x 68.50 x 8.70 మిల్లీమీటర్లు, బరువు 130 గ్రాములు, డ్యూయల్ సిమ్ 3జీ వాయిస్ కాలింగ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 4.7 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 720x1280 పిక్సల్స్, 316 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 6.7 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు ( సింగిల్ సిమ్ (జీఎస్ఎమ్ నెట్‌వర్క్), 3యై, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, ఎఫ్ఎమ్ రేడియో, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ), సెన్సార్లు (మాగ్నెటో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్), 2220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర అంచనా రూ.15,920.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
IFA 2014: Microsoft Launches Nokia Lumia 830, Nokia Lumia 730 ‘Selfie’ Smartphone Launched Along With Lumia 735. Read more in Telugu Gizbot.....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X