ఆపిల్ ఐఫోన్ 8పై కొత్త న్యూస్

ఆపిల్ ఉత్పత్తుల గురించి ఎప్పడికప్పుడూ ప్రజలకు ఎంతో కచ్చితమైన సమాచారం అందించే కేజీఐ సెక్యురిటీస్ అనలిస్ట్ మింగ్-చి కువో ఐఫోన్ 8కి సంబంధించిన కీ ఫీచర్లు, ధరను విడుదలచేశారు.

By Hazarath
|
ఆపిల్ ఐఫోన్ 8పై రోజుకో కొత్త న్యూస్ బయటకొస్తోంది. ఆపిల్ ఉత్పత్తుల గురించి ఎప్పడికప్పుడూ ప్రజలకు ఎంతో కచ్చితమైన సమాచారం అందించే కేజీఐ సెక్యురిటీస్ అనలిస్ట్ మింగ్-చి కువో ఐఫోన్ 8కి సంబంధించిన కీ ఫీచర్లు, ధరను విడుదలచేశారు. కంపెనీ తొలిసారిగా ఐఫోన్ 8లో ఓలెడ్ డిస్ ప్లేను ప్రవేశపెట్టనుంది. దీని ప్రారంభ ధర రూ. 70వేల వరకు ఉండే అవకాశం ఉందని కువో రిపోర్ట్ చెబుతోంది. ఆపిల్ ఇన్‌సైడర్ వెబ్‌సైట్ షేర్ చేసిన వివరాలతో కువో ఈ రిపోర్టు విడుదల చేశారు.
 5.8 అంగుళాల ఓలెడ్ ప్యానెల్తో

5.8 అంగుళాల ఓలెడ్ ప్యానెల్తో

కువో ప్రకారం ఐఫోన్ 8 5.8 అంగుళాల ఓలెడ్ ప్యానెల్తో రాబోతోంది.హోమ్ బటన్ కూడా డిస్‌ప్లేలోనే కలిసి ఉండి, హోమ్ బటన్‌కు ఇంటిగ్రేటెడ్ టచ్ ఐడీని అమర్చుతుందని తెలుస్తోంది.

బ్యాటరీ పెద్దదిగా

బ్యాటరీ పెద్దదిగా

అయితే ఇప్పటివరకు వచ్చిన అన్ని ఐఫోన్ల కంటే ఈ ఐఫోన్ 8 బ్యాటరీ పెద్దదిగా ఉండబోతుందట. దీంతోపాటు ఐఫోన్7 ప్లస్ మాదిరిగా డ్యూయల్ కెమెరాను దీనికి అమర్చుతున్నారట. 3డీ లేజార్ స్కానింగ్‌ను వాడుతూ ముఖాన్ని గుర్తించే టెక్నాలజీని ఐఫోన్ 8 ఫీచర్లలో పొందుపరిచారు.

 వాటర్ ప్రూఫ్ ఫీచర్
 

వాటర్ ప్రూఫ్ ఫీచర్

ఐఫోన్ 8 వాటర్ ప్రూఫ్ ఫీచర్ తో మన ముందుకు రాబోతుంది ఆపిల్ ఐఫోన్ 8 సీరీస్ కు.. IP68 సర్టిఫికెట్ లభించబోతున్నట్టు సమాచారం. IP68 రేటింగ్ లభించిందంటే..ఆ స్మార్ట్ ఫోన్ 1.5 మీటర్ల లోతు ఉన్న నీటిలో పడిపోయినా 30 నిమిషాల వరకు ఆ ఫోన్ కు ఏమీ కాదు.

Apple A11 processor

Apple A11 processor

రిజల్యూషన్ అయితే రానున్న ఐఫోన్ 8 రిజల్యూషన్ లో ఇతర ఫోన్లకు సవాల్ విసరనున్నట్లు తెలుస్తోంది. అత్యంత ఎక్కువ రిజల్యూషన్ తో పాటు అత్యంత పవర్ పుల్ Apple A11 processor తో ఫోన్ రానున్నట్లు సమాచారం.

50 నుంచి 60 శాతం పెరిగే అవకాశం

50 నుంచి 60 శాతం పెరిగే అవకాశం

కువో చెప్పిన ప్రకారం ఈ ఫోన్ 1000 డాలర్లు అయితే ఉత్పత్తి ఖర్చులతో ఇది 50 నుంచి 60 శాతం పెరిగే అవకాశం ఉందని కువో చెబుతున్నారు.

 
Best Mobiles in India

English summary
iPhone 8 price tipped, to sport function area instead of Touch ID read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X