లెనోవో వైబ్ కే5, 4 లక్షల బుకింగ్స్!

|

లెనోవో బడ్జెట్ ప్రెండ్లీ స్మార్ట్‌పోన్ Vibe K5కు సంబంధించిన మొదటి ఫ్లాష్ సేల్ Amazon Indiaలో బుధవారం జరిగింది. ఈ ఫోన్‌ను బుక్ చేసుకునేందుకు మొత్తం 4,00,000 మంది రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. రూ.6,999రద రెడ్మీ‌ నోట్ 3, లీ 1ఎస్ ఇకో ఫోన్‌లకు పోటీగా బరిలోకి దిగిన ఈ ఫోన్ 1.4గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 415 ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్స్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 32జీబి ఎక్స్‌టర్నల్ స్టోరేజ్.

లెనోవో వైబ్ కే5, 4 లక్షల బుకింగ్స్!

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 2750 ఎమ్ఏమెచ్ బ్యాటరీ వంటి ప్రధాన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ పై మరింత గ్రిప్ సంపాదించేకు 12 ప్రత్యేకమైన టిప్స్ అండ్ ట్రిక్స్‌ను మీ ముందుకు తీసుకురావటం జరుగుతోంది.

Read More : షాకింగ్.. మొబైల్స్ పై రూ.10,000 తగ్గింపు!

లెనోవో వైబ్ కే5 టిప్స్ అండ్ ట్రిక్స్

లెనోవో వైబ్ కే5 టిప్స్ అండ్ ట్రిక్స్

వైబ్ కే5 ఫోన్‌లో అందుబాటులో ఉంచిన వీఆర్ Split Screen మోడ్‌ను డిస్‌ప్లే సెట్టింగ్స్ ద్వారానే కాకుండా పవర్ బటన్‌ను లాంగ్ ప్రెస్ చేయటం ద్వారా ఎనేబుల్ చేసుకోవచ్చు. సాధారణ 2డీ కంటెంట్‌ను వీఆర్‌హెడ్ సెట్ ద్వారా వీక్సించవచ్చు.

 

లెనోవో వైబ్ కే5 టిప్స్ అండ్ ట్రిక్స్

లెనోవో వైబ్ కే5 టిప్స్ అండ్ ట్రిక్స్

వైబ్ కే5 ఫోన్‌లోని బ్యాటరీ సేవర్ ఆప్షన్‌ను బ్యాటరీ సెట్టింగ్స్ ద్వారా ఎనేబుల్ చేసుకోవాలంటే స్ర్కీన్ టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే toggleను టర్న్ ఆన్ చేసుకుంటే చాలు.

లెనోవో వైబ్ కే5 టిప్స్ అండ్ ట్రిక్స్
 

లెనోవో వైబ్ కే5 టిప్స్ అండ్ ట్రిక్స్

వైబ్ కే5 ఫోన్‌ సెట్టింగ్స్‌లోని Schedule Power on & Off ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా ఓ షెడ్యూల్ ప్రకారం ఫోన్ పవర్‌ను ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు.

 

లెనోవో వైబ్ కే5 టిప్స్ అండ్ ట్రిక్స్

లెనోవో వైబ్ కే5 టిప్స్ అండ్ ట్రిక్స్

వైబ్ కే5 ఫోన్‌ సెట్టింగ్స్ మెనూ క్రింద Accessibility option అందుబాటులో ఉంటుంది. పవర్ బటన్ నుంచి ఎండ్ కాల్స్, కలర్ ఇన్వర్షన్, కరక్షన్ అండ్ హై కాంట్రాస్ట్ టెక్స్ట్ వంటి అనేక ఫీచర్లు ఈ యాక్సిసబిలిటీ సెట్టింగ్స్‌లో ఉంటాయి. వీటిని ఉపయోగించుకోవటం ద్వారా బెటర్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆస్వాదించవచ్చు.

లెనోవో వైబ్ కే5 టిప్స్ అండ్ ట్రిక్స్

లెనోవో వైబ్ కే5 టిప్స్ అండ్ ట్రిక్స్

వైబ్ కే5 ఫోన్‌‌లోని Magnification gesture ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకున్నట్లయితే స్ర్కీన్ పై ట్రిపుల్ ట్యాప్ ఇవ్వటం ద్వారా ఇమేజ్‌ను జూమ్ చేసుకోవచ్చు. అలానే ఒకే వేలి సహాయంతో పేజీల మధ్య స్వైప్ కావచ్చు. settingsలోని Accessibility విభాగంలోకి వెళ్లటం ద్వారా Magnification gesture ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు.

లెనోవో వైబ్ కే5 టిప్స్ అండ్ ట్రిక్స్

లెనోవో వైబ్ కే5 టిప్స్ అండ్ ట్రిక్స్

వైబ్ కే5 ఫోన్‌‌లో నిక్షిప్తం చేసిన Google Now launcher ద్వారా స్టాక్ ఆండ్రాయిడ్ తరహా ఎక్స్‌పీరియన్స్‌‍ను పొందవచ్చు.

లెనోవో వైబ్ కే5 టిప్స్ అండ్ ట్రిక్స్

లెనోవో వైబ్ కే5 టిప్స్ అండ్ ట్రిక్స్

వైబ్ కే5 ఫోన్‌‌ ద్వారా స్ర్కీన్ షాట్‌లను తీసుకోవాలనుకంటే quick toggles మెనూలో ప్రత్యేకమైన షార్ట్‌కట్‌ను అందుబాటులో ఉంటుంది. ఇలా కాకుండా, ఫోన్ పవర్ లాక్ బటన్ అలానే వాల్యుమ్ డౌన్ బటన్‌లను ఒకేసారి కొద్ది సెకన్ల పాటు ప్రెస్ చేసి ఉంచినట్లయితే స్ర్కీన్ షార్ క్యాప్చర్ కాబడుతుంది.

లెనోవో వైబ్ కే5 టిప్స్ అండ్ ట్రిక్స్

లెనోవో వైబ్ కే5 టిప్స్ అండ్ ట్రిక్స్

వైబ్ కే5 ఫోన్‌‌లో ఫాంట్ సైజును అడ్జస్ట్ చేసుకోవాలంటే డిస్‌ప్లే సెట్టింగ్స్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది.

లెనోవో వైబ్ కే5 టిప్స్ అండ్ ట్రిక్స్

లెనోవో వైబ్ కే5 టిప్స్ అండ్ ట్రిక్స్

వైబ్ కే5 ఫోన్‌‌లోని కంటెంట్‌ను పెద్ద తెర డివైసెస్‌లో cast చేయాలనుకుంటే డిస్‌ప్లే సెట్టింగ్స్‌లోకి వెళ్లి cast Screen ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది.

లెనోవో వైబ్ కే5 టిప్స్ అండ్ ట్రిక్స్

లెనోవో వైబ్ కే5 టిప్స్ అండ్ ట్రిక్స్

యాప్ నోటిఫికేషన్స్ పొందాలనుకుంటే సెట్టింగ్స్‌లోని నోటిఫికేషన్ సెంటర్‌లోకి వెళ్లి అవసరమైన యాప్స్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌లు డి‌స్‌ప్లే పై కనిపించే విధంగా ఆప్షన్స్ సెట్ చేసుకోవచ్చు.

లెనోవో వైబ్ కే5 టిప్స్ అండ్ ట్రిక్స్

లెనోవో వైబ్ కే5 టిప్స్ అండ్ ట్రిక్స్

ఫోన్ డేటాతో పాటు బ్యాటరీ లైఫ్‌ను ఎక్కువగా ఖర్చు చేస్తున్న బ్యాక్ గ్రౌండ్ యాప్స్‌ను సెట్టింగ్స్‌లోని బ్యాక్‌గ్రౌండ్ మేనేజ్‌మెంట్ సెట్టింగ్స్ ద్వారా మేనేజ్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Lenovo Vibe K5: 12 Tips & Tricks You Should Know to Get the Best Experience. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X