లెనోవో వైబ్ జెడ్... 10 బ్రాండ్‌లకు కఠినమైన సవాల్!

By Sivanjaneyulu
|

ఇండియా వంటి ప్రధాన మార్కెట్లలో స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు రోజురోజుకు ఊపందుకుంటున్న నేపధ్యంలో సామ్‌సంగ్, నోకియా, యాపిల్, సోనీ వంటి అంతర్జాతీయ కంపెనీలు అత్యాధునిక స్పెసిఫికేషన్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను ఇప్పటికే మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చాయి. మరోవైపు దేశవాళి కంపెనీలైన మైక్రోమాక్స్, కార్బన్ తదితర కంపెనీలు సైతం ఆకర్షణీయమైన ధరల్లోస్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ఫోన్‌ల తయారీ కంపెనీ లెనోవో ‘వైబ్ జెడ్' (Vibe Z) పేరుతో ఆసక్తికర ఫీచర్లతో కూడిన కొత్తశ్రేణి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

 

మొబైల్ బ్రాండ్‌లకు సవాల్ విసురుతున్న లెనోవో వైబ్ జెడ్

బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌ను కలిగి ఉన్న లెనోవో వైబ్ జెడ్ అత్యాధునిక స్మార్ట్ మొబైలింగ్ స్పెసిఫికేషన్‌లతో ప్రపంచ మార్కెట్లను ఆకర్షిస్తోంది. 5.5 అంగుళాల సమర్థవంతమైన డిస్‌ప్లే వ్యవస్థ, 2.2గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన స్నాప్‌డ్రాగన్ 800 క్వాడ్‌కోర్ సాక్ ప్రాసెసర్, 84° లెన్స్ ఇంకా వైడ్ - యాంగిల్ షాట్స్ ప్రత్యేకతలతో కూడిన 5 మెగా పిక్సల్ కెమెరా వంటి ఉపయుక్తమైన స్పెసిఫికేషన్‌లను వైబ్ జెడ్ కలిగి ఉండటం చేత ఈ డివైస్ అంతర్జాతీయ మొబైల్ బ్రాండ్‌లకు సవాల్ విసురుతోంది.

లెనోవో వైబ్ జెడ్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే........

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, పటిష్టమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో, 401 పీపీఐ పిక్సల్ డెన్సిటీ. శక్తివంతమైన క్వాల్కమ్ చిప్‌సెట్, స్నాప్‌డ్రాగన్ 800 క్వాడ్‌కోర్ సాక్ (క్లాక్ వేగం 2.2గిగాహెట్జ్), అడ్రినో 330 గ్రాఫిక్ యూనిట్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా 4128 x 3096 పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటితో ( ప్రత్యేకమైన ఫీచర్లు: ఆటో ఫోకస్, ఎఫ్1.8 అపెర్చర్ లెన్స్, ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ( ప్రత్యేకతలు: వైడ్-యాంగిల్ షాట్‌లను చిత్రీకరించుకునేందుకు 84డిగ్రీల లెన్స్ అలానే వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు).

కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే: జీపీఆర్ఎస్, స్పీడ్, WLAN,బ్లూటూత్, యూఎస్బీ, 3జీ, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ. శక్తివంతమైన లై-పో 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఫోన్‌లో అమర్చారు. ఇండియన్ మార్కెట్లో లెనోవో వైబ్ జెడ్ స్మార్ట్‌ఫోన్ 16జీబి మెమెరీ వేరియంట్‌లో లభ్యమవుతుంది. ఫోన్ పరిమాణాన్ని పరిశీలించినట్లయితే 149.1 x 77 x 7.9మిల్లీ మీటర్లు. ఆవిష్కరణ సమయంలో లెనోవో వైబ్ జెడ్ ధర రూ.35,999.ప్రస్తుత మార్కెట్ ధర రూ.32,960. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

అంతర్జాతీయ మార్కెట్లోని అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లతో లెనోవో వైబ్ జెడ్ పోటీ పడుతోంది. ఆ వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూద్దాం..

లెనోవో వైబ్ జెడ్... 10 బ్రాండ్‌లకు కఠినమైన సవాల్!

లెనోవో వైబ్ జెడ్... 10 బ్రాండ్‌లకు కఠినమైన సవాల్!

లెనోవో వైబ్ జెడ్‌ Vs ఎల్‌జి జీ2 ( Lenovo Vibe Z Vs LG G2) లెనోవో వైబ్ జెడ్‌తో ఎల్‌జి జీ2 స్మార్ట్‌ఫోన్‌ను పోల్చిచూసినట్లయితే... ఎల్‌జి జీ2 1920×1080పిక్సల్ రిసల్యూషన్‌తో కూడిన 5.2 అంగుళాల  హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌‍ప్లేను కలిగిఉంటుంది. అదే సమయంలో లెనోవో వైబ్ జెడ్ 5.5 అంగుళాల సమర్థవంతమైన డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉంది. కెమెరా ఫీచర్ విషయానికొస్తే 84° లెన్స్ ఇంకా వైడ్ - యాంగిల్ షాట్స్ ప్రత్యేకతలతో కూడిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కలిగి ఉండగా, ఎల్‌జి జీ2 కేవలం 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా షూటర్‌ను మాత్రమే సపోర్ట్ చేస్తుంది.

 

లెనోవో వైబ్ జెడ్... 10 బ్రాండ్‌లకు కఠినమైన సవాల్!
 

లెనోవో వైబ్ జెడ్... 10 బ్రాండ్‌లకు కఠినమైన సవాల్!

లెనోవో వైబ్ జెడ్‌ Vs బ్లాక్‌బెర్రీ జెడ్ 30 ( Lenovo Vibe Z Vs BlackBerry Z30)

బ్లాక్‌బెర్రీ జెడ్30 స్మార్ట్‌ఫోన్ 5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అదే సమయంలో లెనోవో వైబ్ జెడ్ 5.5 అంగుళాల సమర్థవంతమైన డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉంది. 1.7గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ క్రెయిట్ ప్రాసెసర్‌ను బ్లాక్‌బెర్రీ జెడ్30లో నిక్షిప్తం చేసారు. అదే సమయంలో వైబ్ జెడ్ 2.2గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన స్నాప్‌డ్రాగన్ 800 క్వాడ్‌కోర్ సాక్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. కెమెరా ఫీచర్ విషయానికొస్తే... లెనోవో వైబ్ జెడ్ 13 రేర్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. ఈ కెమెరా ద్వారా ఫోటోలను 4128 x 3096పిక్సల్ క్వాలిటీతో చిత్రీకరించుకోవచ్చు. ఆటో ఫోకస్, ఎఫ్1.8 ఆపర్చర్ లెన్స్, ఎల్ఈడి ఫ్లాష్ వంటి సౌకర్యాలు ఈ కెమెరాలో ఉన్నాయి. ఇదే సమయంలో బ్లాక్‌బెర్రీ జెడ్30 కేవలం 8 మెగా పిక్సల్ రేర్ కెమెరాను మాత్రమే కలిగి ఉంది. బ్యాటరీ విషయానికొస్తే.... 2880 ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని బ్లాక్‌బెర్రీ జెడ్30లో నిక్షిప్తం చేసారు. అదే సమయంలో లెనోవో వైబ్ జెడ్ 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

 

లెనోవో వైబ్ జెడ్... 10 బ్రాండ్‌లకు కఠినమైన సవాల్!

లెనోవో వైబ్ జెడ్... 10 బ్రాండ్‌లకు కఠినమైన సవాల్!

లెనోవో వైబ్ జెడ్‌ Vs హెచ్‌టీసీ వన్ మినీ (Lenovo Vibe Z Vs HTC One Mini)

హెచ్‌టీసీ వన్ మినీ స్మార్ట్‌ఫోన్ 4.3 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండగా. లెనోవో వైబ్ జెడ్ 5.5 అంగుళాల సమర్థవంతమైన డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉంది. ప్రాసెసర్ విషయంలోనూ హెచ్‌టీసీ వన్ మినీ వెనుకంజలో ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 సాక్ శక్తితో కూడిన 1.4గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్‌ను హెచ్‌టీసీ వన్ మినీలో పొందుపరిచారు. అదే సమయంలో వైబ్ జెడ్ స్నాప్‌డ్రాగన్ 800 క్వాడ్‌కోర్ సాక్ శక్తితో కూడిన 2.2గిగాహెట్జ్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ల మధ్య కెమెరా ఫీచర్లను విశ్లేషించినట్లయితే... హెచ్‌టీసీ వన్ మినీ 4 మెగా పిక్సల్ అల్ట్రా పిక్సల్ రేర్ కెమెరా అలానే 1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. అదే సమయంలో లెనోవో వైబ్ జెడ్ 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ఫీచర్‌ను కలిగి ఉంది. బ్యటరీ విషయానికొస్తే 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో లెనోవో వైబ్ ముందంజలో ఉండగా, 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీతో హెచ్‌టీసీ వన్ మినీ తరువాతీ స్థానంలో నిలిచింది.

 

లెనోవో వైబ్ జెడ్... 10 బ్రాండ్‌లకు కఠినమైన సవాల్!

లెనోవో వైబ్ జెడ్... 10 బ్రాండ్‌లకు కఠినమైన సవాల్!

లెనోవో వైబ్ జెడ్ Vs సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 (Lenovo Vibe Z Vs Sony Xperia Z1)

5.5 అంగుళాల సమర్థవంతమైన డిస్‌ప్లే వ్యవస్థతో కూడిన లెనోవో వైబ్ జెడ్, సోనీ ఎక్స్‌పీరియా జెడ్1ను అధిగమించగలిగింది. 5 అంగుళాల డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉన్న సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 కేవలం 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాను మాత్రమే కలిగి ఉంది. ఇదే సమయంలో లెనోవో వైబ్ జెడ్ 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాతో ముందంజలో ఉంది.

 

లెనోవో వైబ్ జెడ్... 10 బ్రాండ్‌లకు కఠినమైన సవాల్!

లెనోవో వైబ్ జెడ్... 10 బ్రాండ్‌లకు కఠినమైన సవాల్!

లెనోవో వైబ్ జెడ్ Vs నోకియా లూమియా 1520 ( Lenovo Vibe Z Vs Nokia Lumia 1520)

నోకియా లూమియా 1520 స్మార్ట్‌ఫోన్‌కు లెనోవో వైబ్ జెడ్ పలు విభాగాల్లో గట్టి పోటినిచ్చింది. ముఖ్యంగా ఆధునిక వర్షన్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ లెనోవో వైబ్ జెడ్ పనితీరును మరింత అర్థవంతం చేస్తుంది. అలానే లెనోవో వైబ్ జెడ్‌లో నిక్షిప్తం చేసిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా అత్యుత్తమ వీడియో కాలింగ్‌కు దోహదపడుతుంది.

 

లెనోవో వైబ్ జెడ్... 10 బ్రాండ్‌లకు కఠినమైన సవాల్!

లెనోవో వైబ్ జెడ్... 10 బ్రాండ్‌లకు కఠినమైన సవాల్!

లెనోవో వైబ్ జెడ్ Vs యాపిల్ ఐఫోన్ 5సీ (Lenovo Vibe Z vs iPhone 5c)

డిస్‌ప్లే, ప్రాసెసర్, కెమెరా ఇంకా బ్యాటరీ విభాగాల్లో లెనోవో వైబ్ జెడ్ యాపిల్ ఐఫోన్ 5సీని అధిగమించగలిగింది. డిస్‌ప్లే విషయానికొస్తే యాపిల్ ఐఫోన్ 5సీ 4 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండగా, లెనోవో వైబ్ జెడ్ 5.5 అంగుళాల డిస్‌ప్లే ఫీచర్‌ను కలిగి ఉంది. ప్రాసెసర్ విషయానికొస్తే లెనోవో వైబ్ జెడ్ స్నాప్‌డ్రాగన్ 800 క్వాడ్‌కోర్ సాక్ శక్తితో కూడిన 2.2గిగాహెట్జ్ ప్రాసెసర్ పై రన్ అవుతోంది. ఇదే సమయంలో ఐఫోన్ 5సీ 1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతోంది. కెమెరా విషయానికొస్తే లెనోవో వైబ్ జెడ్ శక్తివంతమైన 13 మెగా పిక్సల్ రేర్ కెమెరాతోపాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇదే సమయంలో ఐఫోన్ 5సీ 8 మెగా పిక్సల్ రేర్ ఇంకా 1.2 మెగా పిక్సల్ పిక్సల్ ఫ్రంట్ కెమెరా షూటర్‌లను కలిగి ఉంది. బ్యాటరీ విషయానికొస్తే యాపిల్ ఐఫోన్ 5సీ 1510 ఎమ్ఏహెచ్ బ్యాటరీ పై రన్ అవుతుంది. అదే సమయంలో లెనోవో వైబ్ జెడ్ 3000 ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ పై రన్ అవుతుంది.

 

లెనోవో వైబ్ జెడ్... 10 బ్రాండ్‌లకు కఠినమైన సవాల్!

లెనోవో వైబ్ జెడ్... 10 బ్రాండ్‌లకు కఠినమైన సవాల్!

లెనోవో వైబ్ జెడ్ Vs సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 (Lenovo Vibe Z Vs Samsung Galaxy S4)

డిస్‌ప్లే ఇంకా కెమెరా విభాగాల్లో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 పై లెనోవో వైబ్ జెడ్ ఆధిపత్యాన్ని చెలాయించగలిగింది. గెలాక్సీ ఎస్4 ఐదు అంగుళాల తెరను కలిగి ఉండగా, లెనోవో వైబ్ జెడ్ 5.5 అంగుళాల స్ర్కీన్‌ను మాత్రమే కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే లెనోవో వైబ్ జెడ్ 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాతో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4లోని 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాలను అధిగమించింది.

 

లెనోవో వైబ్ జెడ్... 10 బ్రాండ్‌లకు కఠినమైన సవాల్!

లెనోవో వైబ్ జెడ్... 10 బ్రాండ్‌లకు కఠినమైన సవాల్!

లెనోవో వైబ్ జెడ్ Vs నోకియా లూమియా 1320 (Lenovo Vibe Z Vs Nokia Lumia 1320)

కెమెరా విభాగంలో నోకియా లూమియా 1320 పై లెనోవో వైబ్ జెడ్ స్పష్టమైన ఆధిపత్యాన్ని పదర్శించగలిగింది. లూమియా 1320 కెమెరా స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. ఇదే సమయంలో లెనోవో వైబ్ జెడ్ కెమెరా స్పెసిఫికేషన్‌లను విశ్లేషించినట్లయితే... 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

 

లెనోవో వైబ్ జెడ్... 10 బ్రాండ్‌లకు కఠినమైన సవాల్!

లెనోవో వైబ్ జెడ్... 10 బ్రాండ్‌లకు కఠినమైన సవాల్!

లెనోవో వైబ్ జెడ్ Vs సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2 (Lenovo Vibe Z Vs Samsung Galaxy Grand 2)

డిస్‌ప్లే, ప్రాసెసర్ ఇంకా కెమెరా విభాగాల్లో సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2పై లెనోవో వైబ్ జెడ్ పైచేయిగా నిలిచింది. వైబ్ జెడ్ 5.5 అంగుళాల డిస్‌ప్లేను ఆఫర్ చేస్తుండగా, గెలాక్సీ గ్రాండ్ 2 5.25అంగుళాల డిస్‌ప్లేను మాత్రమే ఆఫర్ చేస్తోంది. ప్రాసెసర్ విషయానికొస్తే గెలాక్సీ గ్రాండ్ 2, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇదే సమయంలో వైబ్ జెడ్ స్నాప్‌డ్రాగన్ 800 క్వాడ్‌కోర్ సాక్ శక్తితో కూడిన 2.2గిగాహెట్జ్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. గెలాక్సీ గ్రాండ్ 2 కెమెరా స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... ఫో్న్ వెనుక భాగంలో 13 మెగా పిక్సల్ రేర్ కెమెరాను ముందు భాగంలో 1.9 మెగా పిక్సల్ కెమెరాను నిక్షిప్తం చసారు. ఇదే సమయంలో లెనోవో వైబ్ జెడ్ వెనుక భాగంలో 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా వ్యవస్థను, ముందు భాగంలో 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ఫీచర్ ను దోహదం చేుసారు.

 

లెనోవో వైబ్ జెడ్... 10 బ్రాండ్‌లకు కఠినమైన సవాల్!

లెనోవో వైబ్ జెడ్... 10 బ్రాండ్‌లకు కఠినమైన సవాల్!

లెనోవో వైబ్ జెడ్ Vs నెక్సూస్ 5 (Lenovo Vibe Z Vs Nexus 5)

ఎల్‌జి కంపెనీ రూపొందించిన గూగుల్ నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్ పై అనేక విభాగాల్లో లెనోవో వైబ్ జెడ్ పై చేయిని సాధించగలిగింది. 5.5 అంగుళాల డిస్ప్లే సామర్థ్యం గల లెనోవో వైబ్ జెడ్,  5 అంగుళాల డిస్ ప్లేతో కూడిన గూగుల్ నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్ పై ముందంజలో నిలిచింది. కెమెరా ఫీచర్ విషయానికొస్తే... వైబ్ జెడ్ వెనుక భాగంలో 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా వ్యవస్థను, ముందు భాగంలో 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ఫీచర్‌ను నిక్షిప్తం చేసారు. అదే సమయంలో నెక్సూస్ 5 కెమెరా స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... ఫోన్ వెనుక భాగంలో 8 మెగా పిక్సల్ కెమెరాను ముందు భాగంలో 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాను దోహదం

చేసారు. బ్యాటరీ ఫీచర్ విషయానికొస్తే నెక్సూస్ 5, 2300ఎమ్ఏహెచ్ బ్యాటరీతో రెండవ స్థానంలో నిలవగా, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీతో లెనోవో వైబ్ జెడ్ మొదటి స్థానంలో నిలిచింది.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X