పేరు మార్చుకుని వచ్చేస్తోన్న లెనోవో

|

అంతర్జాతీయ మార్కెట్లలో Zuk Z2గా పిలవబడుతోన్న తన అప్‌కమింగ్ మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను Zuk Z2 Plus పేరుతో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసేందుకు లెనోవో సన్నాహాలు చేసుకుంటోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలను లెనోవో ఇండియా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

Read More : కొత్త ఫోన్‌ల పైనా భారీగా డిస్కౌంట్‌లు

 పేరు మార్చుకుని వచ్చేస్తోన్న లెనోవో

ఈ ఫోన్‌కు మందు వర్షన్ అయిన Lenovo Zuk Z1 ఐదు నెలల క్రితమే ఇండియన్ మార్కెట్లో విడుదలై సంచలనం రేపింది. షియోమీ రెడ్మీ నోట్ 3కి రైవల్‌గా లాంచ్ అయిన ఈ ఫోన్ ఆకట్టుకునే స్పెక్స్‌తో పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది.

 పేరు మార్చుకుని వచ్చేస్తోన్న లెనోవో

Read More : సెప్టంబర్ 7న iPhone 7, ప్రపంచంతో పోటీ పడగలదా..?

లెనెవో ZUK Z1 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, మెటల్ ఫ్రేమ్ బాడీ, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2.5గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, 13 మెగా పిక్సల్ రేరే్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 4,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఉత్తేజకర పోటీవాతావరణం నడుమ త్వరలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ కాబోతోన్న Zuk Z2 Plus ఫోన్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం....

#1

#1

లెనోవో Zuk Z2 ఫోన్ 5 అంగుళాల 1080 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో పాటు 2.5డీ కర్వుడ్ గ్లాస్‌తో వస్తుంది.

#2

#2

ఫోన్ ప్రాసెసర్ ఇంకా ర్యామ్ విషయానికి వచ్చేసరికి లెనోవో Zuk Z2 ఫోన్‌లో క్వాల్కమ్ అభివృద్థి చేసిన 64 బిట్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్‌తో పాటు 4జీబి ర్యామ్‌ను నిక్షిప్తం చేసారు. అడ్రినో 530 జీపీయూ ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని హ్యాండిల్ చేస్తుంది. ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి 64జీబి.

#3

#3

కెమెరా విషయానికి వచ్చేసరికి లెనోవో Zuk Z2 ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ ఆటో ఫోకస్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది.

#4

#4

లెనోవో Zuk Z2 ఫోన్ శక్తివంతమైన 3,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో రాబోతోంది.

#5

#5

లెనోవో Zuk Z2 ఫోన్ 4G LTE నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా 3జీ, వై-ఫై, బ్లుటూత్ 4.1, యూఎస్టీ టైప్ సీ పోర్ట్, యూఎస్బీ ఆన్ ద గో వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లను ఈ డివైస్‌లో పొందుపరిపచారు.

#6

#6

చైనా మార్కెట్లో Zuk Z2 ఫోన్ ధర CNY 1,799గా ఉంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.18,000.

#7

#7

Zuk Z2 Plusగా ఇండియన్ మార్కెట్లో మెరవబోతోన్న ఇదే ఫోన్ ధర రూ.15,000 నుంచి రూ.20,000 మధ్య ఉండొచ్చని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Best Mobiles in India

English summary
Lenovo Zuk Z2 Plus Teased to be Coming Soon to India: Everything We Know About It. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X