మైక్రోమాక్స్ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ కిట్‌క్యాట్ ఫోన్

|

మార్కెట్ డిమాండ్ నేపథ్యంలో ఇటీవల వివిధ మోడళ్లలో ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేసిన మైక్రోమాక్స్ తాజాగా తన కాన్వాస్ సిరీస్ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది. ‘మైక్రోమాక్స్ కాన్వాస్ ఫైర్ ఎ104' మోడల్‌లో రూపకల్పన చేయబడిన ఈ ఫోన్ ధర రూ.6,999. క్వాడ్‌కోర్ ప్రాసెసింగ్ యూనిట్‌ను డివైస్‌లో అమర్చినట్లు కంపెనీ తెలిపింది. బ్లాక్ అండ్ గోల్డ్, వైట్ అండ్ గోల్డ్ ఇంకా వైట్ అండ్ సిల్వర్ కలర్ వేరియంట్‌లలో ఈ హ్యాండ్‌సెట్‌లను మైక్రోమాక్స్ విక్రయించనుంది.

 
 మైక్రోమాక్స్ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ కిట్‌క్యాట్ ఫోన్

మైక్రోమాక్స్ కాన్వాస్ ఫైర్ ఎ104 కీలక ఫీచర్లను పరిశీలించినట్లయితే:

 

4.5 అంగుళాల FWVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ మీడియాటెక్ ఎంటీ6582ఎమ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.2 ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం. కనెక్టువిటీ ఫీచర్లు (డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, డ్యూయల్ ఫ్రంట్ స్పీకర్లు), 1900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఫోన్‌లో ముందుగానే లోడ్ చేసిన అప్లికేషన్‌లు:

M! గేమ్స్, M! ఇన్స్యూరెన్స్, M! సెక్యూరిటీ, M! లైవ్, M! యాడ్, ఒపెరా మినీ, బుక్‌మై షో, క్లీన్ మాస్టర్, గెటింగ్ కింగ్‌సాఫ్ట్ ఆఫీస్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X