Moto C vs Redmi 4A, రూ.6000లో ఏది బెస్ట్ ఫోన్..?

మోటో సీ స్మార్ట్‌ఫోన్‌ను, ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన Redmi 4A కు పోటీగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

|

ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ మోటరోలా తన Moto C ఫోన్‌ను కొద్ది రోజల క్రితం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. కేవలం ఆఫ్‌లైన్‌లో మాత్రమే దొరుకుతోన్న ఈ ఫోన్ ధర రూ.5,999. మోటరోలా ఇప్పటి వరకు లాంచ్ చేసిన అన్ని స్మార్ట్‌ఫోన్లలో కల్లా మోటో సీ ఫోన్ చీపెస్ట్ డివైస్‌గా నిలిచింది.

 Moto C vs Redmi 4A

Moto C vs Redmi 4A

మోటో సీ స్మార్ట్‌ఫోన్‌ను, ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన Redmi 4A కు పోటీగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. Xiaomi తన Redmi 4A ఫోన్‌‌ను రూ.5,999 ధర ట్యాగ్‌తో విక్రయిస్తోంది. షియోమి Mi Home స్టోర్‌లో ఈ ఫోన్ దొరుకుతోంది. ఈ రెండు ఫోన్‌లలో ఏది బెస్ట్ అని మీరనుకుంటున్నట్లయితే...

డిజైన్

డిజైన్

డిజైన్ విషయానికి వచ్చేసరికి రెడ్మీ 4ఏ అలానే మోటో సీ స్మార్ట్‌ఫోన్‌లు పాలీకార్బోనేట్ బాడీతో వస్తున్నాయి. మోటో సీతో పోల్చిచూసినట్లయితే రెడ్మీ 4ఏ మోడల్ ప్రత్యేకమైన డిజైన్ లాంగ్వేజ్‌ను కలిగి ఉంది. ఈ రెండు డివైస్‌లు హార్డ్‌వేర్ నేవిగేషన్ కీలతో వస్తున్నాయి.

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి
 

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి

రెడ్మీ 4ఏ మోడల్  హైడెఫినిషన్ డిస్‌ప్లే ప్యానల్‌తో వస్తుండగా, మోటో సీ మాత్రం FWVGA డిస్‌ప్లేతో వస్తుంది. ఈ విభాగంలో రెడ్మీ 4ఏ క్లియర్ విన్నర్‌గా నిలిచింది.

ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి..

ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి..

ఈ రెండు ఫోన్‌లకు సంబంధించిన ప్రాసెసర్‌లను పరిశీలించినట్లయితే రెడ్మీ 4ఏ మోడల్ quad-core Snapdragon 425 చిప్‌సెట్‌తో వస్తోంది. ఇదే సమయంలో మోటో సీ మోడల్ 1.1గిగాహెట్జ్ క్వాడ్ కోర్ సీపీయూతో కూడిన మీడియాటెక్ MT6737M చిప్‌సెట్‌తో వస్తోంది.

ర్యామ్ ఇంకా స్టోరేజ్ అంశాలను పరిశీలించినట్లయితే

ర్యామ్ ఇంకా స్టోరేజ్ అంశాలను పరిశీలించినట్లయితే

రెడ్మీ 4ఏ మోడల్‌లో 2జీబి ర్యామ్‌తో పాటు 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇదే సమయంలో మోటో సీ మోడల్‌లో 1జీబి ర్యామ్‌తో పాటు 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యంతో వస్తోంది. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకోవచ్చు.

 ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్

ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్

రెడ్మీ 4ఏ ఫోన్‌కు ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్ ఫీచర్ అదనపు బెనిఫిట్ గా చెప్పుకోవచ్చు. మోటో సీ మోడల్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ సదుపాయం లేదు.

కెమెరా విషయానికొస్తే..

కెమెరా విషయానికొస్తే..

కెమెరా విషయానికి వచ్చేసరికి రెడ్మీ 4ఏ మోడల్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ అలానే 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది. ఇదే సమయంలో మోటో సీ మోడల్ 5 మెగా పిక్సల్ రేర్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాలను మాత్రమే కలిగి ఉంది.

కనెక్టువిటీ ఫీచర్లు..

కనెక్టువిటీ ఫీచర్లు..

ఈ రెండు ఫోన్‌లకు సంబంధించిన కనెక్టువిటీ ఆప్షన్స్‌ను పరిశీలించినట్లయితే.. 4జీ వోల్ట్, డ్యుయల్ సిమ్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్బీ పోర్ట్, యూఎస్బీ ఆన్ ద గో సపోర్ట్ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లు ఈ రెండు ఫోన్‌లలో కామన్ గా ఉన్నాయి.

 బ్యాటరీ కెపాసిటీ..

బ్యాటరీ కెపాసిటీ..

ఇక బ్యాటరీ విషయానికి వచ్చేసరికి రెడ్మీ 4ఏ మోడల్ శక్తివంతమైన 3120mAh బ్యాటరీతో వస్తోంది. ఇదే సమయంలో మోటో సీ మోడల్ 2350mAh బ్యాటరీ యూనిట్‌తో వస్తోంది.

ఆపరేటింగ్ సిస్టం...

ఆపరేటింగ్ సిస్టం...

ఈ రెండు ఫోన్‌లకు సంబంధించి సాఫ్ట్‌వేర్‌లను పరిశీలించినట్లయితే మోటో సీ మోడల్ ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై బూట్ అవుతుంది. ఇదే సమయంలో రెడ్మీ 4ఏ మోడల్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన MIUI 8 పై బూట్ అవుతంది.

 ముగింపు..

ముగింపు..

అటు స్పెసిఫికేషన్స్ పరంగా ఇటు పనితీరు పరంగా ఈ రెండు ఫోన్‌లను విశ్లేషించి చూసినట్లయితే రెడ్మీ 4ఏ క్లియర్ విన్నర్‌గా నిలుస్తుంది. మోటో సీ డివైస్‌ను కేవలం ఫస్ట్ టైమ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. మోటో సీ స్మార్ట్‌ఫోన్ అన్ని ప్రముఖ ఆఫ్‌లైన్ స్టో‌ర్‌లలో దొరుకుతోంది. రెడ్మీ 4ఏ మోడల్‌ను ప్రస్తుతానికి బెంగుళూరులోని Mi Home స్టోర్‌తో పాటు అమెజాన్ ఇండియాలో సేల్ చేస్తున్నారు.

మీకు తెలుసా? మీ ఆధార్ నెంబర్‌తో గవర్న‌మెంట్ హాస్పటల్‌ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చుమీకు తెలుసా? మీ ఆధార్ నెంబర్‌తో గవర్న‌మెంట్ హాస్పటల్‌ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు

Best Mobiles in India

English summary
Moto C Does Not Win the Race Against Xiaomi Redmi 4A. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X