4జిబి ర్యామ్‌తో మోటో జీ5 ప్లస్ వస్తోంది

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో మోటోరోలా కంపెనీ ఈ ఫోన్‌ని లాంచ్ చేసే అవకాశం

By Hazarath
|

మోటోరోలా లెనోవా కాంబినేషన్ లో వచ్చిన మోటో జీ4 ప్లస్ ఫోన్ మార్కెట్ లో విజయవంతమయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఊపులో మోటోరోలా నుంచి మరో సరికొత్త ఫోన్ మోటోజీ5 ప్లస్ దూసుకొస్తోంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో మోటోరోలా కంపెనీ ఈ ఫోన్‌ని లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆన్ లైన్ లో మోటో జీ 5 ప్లస్ కి సంబంధించిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి.

రూ.14కే అన్‌లిమిటెడ్ 3జీ డేటా

5.5 ఇంచ్ డిస్ ప్లే

5.5 ఇంచ్ డిస్ ప్లే

లేటెస్ట్ గా లీకయిన రిపోర్ట్ ప్రకారం మోటోజీ 5 ప్లస్ 5.5 ఇంచ్ డిస్ ప్లే తో రానున్నట్లు తెలుస్తోంది. 1920 x 1080 ఫిక్సల్ రిజల్యూషన్ కలిగి ఉంది. 430 డాట్స్ ఫర్ ఇంచ్‌లో అవుట్ పుట్ రిజల్యూషన్ ఉంటుంది.

ప్రాసెసర్

ప్రాసెసర్

ఈ ఫోన్ ఆక్టాకోర్ క్వాల్ కామ్ MSM8953 స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్ తో రానుంది. అడెర్నో 506 GPU గ్రాఫిక్స్ కార్డ్ ఉంది. దీంతో పాటు CPU-Z అనే కొత్త ఆప్సన్ తీసుకొస్తోంది. దీని ద్వారా ప్రాసెసర్ చాలా వేగవంతంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.

ర్యామ్
 

ర్యామ్

ర్యామ్ విషయానికొస్తే 4జిబి ర్యామ్ తో పాటు ఇంటర్నల్ స్టోరేజి 32 జిబి వరకు ఉంది. అయితే కష్టమర్లకు కేవలం 21 జిబి వరకు మాత్రమే వాడుకోగలుగుతారు.

కెమెరా

కెమెరా

కెమెరా విషయానికొస్తే 13 ఎంపీ కెమెరా, 5 ఎంపీ సెల్పీ షూటర్ తో ఫోన్ రానుందని లీకయిన రిపోర్టులు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా లీకయిన వివరాలు కూడా అదే కెమెరాను చూపిస్తున్నాయి.

బ్యాటరీ, ధర

బ్యాటరీ, ధర

బ్యాటరీ విషయానికొస్తే 3080 mAh బ్యాటరీతో ఈ ఫోన్ రానుంది. ఆండ్రాయిడ్ సౌగత్ సాఫ్ట్ వేర్ మీద ఫోన్ ఆపరేట్ అవుతుంది. కంపెనీ ఈ ఫోన్ ధరను ప్రకటించనప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ లో 300 డాలర్లు ఉండే అవకాశం ఉంది. ఇండియన్ మార్కెట్ లో దీని ధర దాదాపు రూ. 15,600 ఉండే అవకాశం ఉంది.

వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్ లో

వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్ లో

కంపెనీ ఫిబ్రవరిలో జరగనున్న వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్ లో ఈ ఫోన్ తో పాటు మరికొన్ని డివైస్ లను లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మోటో జీ 4 ప్లస్ సక్సెస్ అయిన నేపథ్యంలో దీన్ని అమెజాన్ ద్వారా తీసుకురావాలని కంపెనీ భావిసున్నట్లుగా తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
Moto G5 Plus Specs Leaked Ahead Of MWC 2017 read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X