4జీబి ర్యామ్, 64జీబి స్టోరేజ్‌తో Moto M మార్కెట్లో లాంచ్ అయ్యింది

డిసెంబర్ 14 నుంచి ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో దొరుకుతుంది.

|

మోటరోలా మొట్టమొదటి మెటల్ బాడీ స్మార్ట్‌ఫోన్ Moto M మంగళవారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ధర రూ.15,999. డిసెంబర్ 14 నుంచి ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో దొరుకుతుంది. ఫోన్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే..

 4జీబి ర్యామ్, 64జీబి స్టోరేజ్‌తో Moto M మార్కెట్లో లాంచ్ అయ్యింది

Read More : ఇంటర్నెట్ కనెక్షన్ అవసరంలేని 10 ఆండ్రాయిడ్ గేమ్స్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, మీడియాటెక్ హీలియో పీ15 సాక్ విత్ ఆక్టా కోర్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రో ఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, పీడీఏఎఫ్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. పూర్తి మెటల్ బాడీతో పాటు రేర్ ఫేసెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్‌ క్లాసీ లుక్‌తో అలరిస్తోంది.

ఆకట్టుకునే అమోల్డ్ డిస్‌ప్లే

ఆకట్టుకునే అమోల్డ్ డిస్‌ప్లే

మోటరోలా మోటో ఎమ్ స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసిన 5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే ఆకట్టుకుంటుంది. డిస్‌ప్లే పై భాగంలో ఏర్పాటు 2.5డి కర్వుడ్ గ్లాస్ ఆకట్టుకుంటుంది. చూపుడు వేలుకు అందే విధంగా ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్‌ను ఏర్పాటు చేసారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శక్తివంతమైన ప్రాసెసర్..

శక్తివంతమైన ప్రాసెసర్..

2.2GHz ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో కూడిన మీడియాటెక్ హీలియో పీ15 చిప్‌సెట్ పై మోటో ఎమ్ స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది. ఈ చిప్‌సెట్‌తో పాటుగా వచ్చే Mali T860 MP2 GPU ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని చూసుకుంటుంది.

సూపర్బ్ కెమెరా క్వాలిటీ..

సూపర్బ్ కెమెరా క్వాలిటీ..

మోటరోలా మోటో ఎమ్ స్మార్ట్‌ఫోన్ 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది. పీడీఏఎఫ్, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 85 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలలో చూడొచ్చు.

ఆపరేటింగ్ సిస్టం..

ఆపరేటింగ్ సిస్టం..

మోటో ఎమ్ స్మార్ట్‌ఫోన్, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన లెనోవో వైబ్ యూజర్ ఇంటర్ ఫేస్ పై రన్ అవుతుంది.

శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్..

శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్..

రోజంతా బ్యాటరీ బ్యాకప్‌ను ఆఫర్ చేసే విధంగా శక్తివంతమైన 3050 ఎమ్ఏహెచ్ బ్యాటరీని మోటో ఎమ్ స్మార్ట్‌ఫోన్ లో ఏర్పాటు చేయటం జరిగింది. రెండు డాల్బీ అటామస్ స్టీరియో స్పీకర్లను కూడా లెనోవో ఈ ఫోన్‌లో అమర్చింది. 4జీ వోల్ట్, జీపీఎస్, బ్లుటూత్, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ వంటి కనెక్టువిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Moto M launched in India with AMOLED display, 64 GB storage starting at Rs.15999. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X