యాపిల్, సామ్‌సంగ్‌లకు పోటీగా భారత్‌లోకి మోటరోలా ఖరీదైన ఫోన్‌లు

|

మోటరోలా నుంచి ఖరీదైన ఫోన్‌లుగా అభివర్ణించబడుతోన్న Moto Z series ఫోన్‌లు త్వరలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ కాబోతున్నాయి.

యాపిల్, సామ్‌సంగ్‌లకు పోటీగా భారత్‌లోకి మోటరోలా ఖరీదైన ఫోన్‌లు

Read More : వొడాఫోన్ సంచలన ఆఫర్.. 1జీబి డేటా ధరకే 10జీబి 4జీ ఇంటర్నెట్

మోటరోలా ఇండియా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ లాంచ్‌కు సంబంధించిన వివరాలను ధృవీకరించింది. అక్టోబర్ 4న ఏర్పాటు చేసిన ఈవెంట్‌కు సంబంధించి 'Block your date' పేరుతో ఇన్విటేషన్‌లను మోటరోలా ఇండియా పంపుతోంది. Moto Z series నుంచి ఇప్పటి వరకు 3 స్మార్ట్‌ఫోన్‌లను మోటరోలా అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. వాటి వివరాలు.. Moto Z, Moto Z Force, Moto Z Play. అయితే, ఈ మూడు ఫోన్‌లలో ఏఏ ఫోన్‌లు భారత్‌లో అందుబాటులో ఉంటావనే దాని పై ఇంకా స్పష్టత లేదు...

డిజైనింగ్ పరంగా చూస్తే...

డిజైనింగ్ పరంగా చూస్తే...

డిజైనింగ్ పరంగా చూస్తే Moto Z, Moto Z Force, Moto Z Play స్మార్ట్‌ఫోన్‌లు ఒకే విధంగా ఉంటాయి. గ్లాస్‌తో డిజైన్ చేసిన బ్యాక్ ప్యానల్ ఆకట్టుకుంటుంది. water repellent నానో కోటింగ్‌తో వస్తోన్న మోటో Z ప్లే స్మార్ట్‌ఫోన్‌ నీటి ప్రమాదాలను ధృడంగా ఎదుర్కొగలదు. మోటో Z, మోటో Z ఫోర్స్ స్మార్ట్‌ఫోన్‌లలో కనిపించని 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్ Moto Z Play స్మార్ట్‌ఫోన్‌‌లో కనిపిస్తుంది.

 Moto Z Play ప్రత్యేకతలు...

Moto Z Play ప్రత్యేకతలు...

Moto Z Play స్మార్ట్‌ఫోన్‌ 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. 1080 పిక్సల్ స్ర్కీన్ రిసల్యూషన్ ఆకట్టుకుంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ డిస్‌ప్లేకు రక్షణ కవచంలా నిలుస్తుంది. మోటో జీ4 ప్లస్ తరహాలోనే Moto Z Play స్మార్ట్‌ఫోన్‌ ఫ్రంట్ ఫేసింగ్ పింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్‌తో వస్తోంది. Moto Z Play స్మార్ట్‌ఫోన్‌‌లో 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాను ఏర్పాటు చేసారు. డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, లేజర్ ఆటో ఫోకస్, పీడీఏఎఫ్, f/2.0 అపెర్చుర్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలో ఉన్నాయి. 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా హైక్వాలిటీ సెల్ఫీలను చిత్రీకరించుకోవచ్చు.

ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి...

ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి...

ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి Moto Z Play స్మార్ట్‌ఫోన్‌‌లో శక్తివంతమైన octa-core Snapdragon625 ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసారు. ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి Moto Z Play స్మార్ట్‌ఫోన్‌‌లో శక్తివంతమైన octa-core Snapdragon625 ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసారు. 3జీబి ర్యామ్ సపోర్ట్‌తో వస్తోన్న Moto Z Play స్మార్ట్‌ఫోన్‌‌ రెండు స్టోరేజ్ ఆప్సన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఒకటి 32జీబి వర్షన్ , మరొకటి 64జీబి వర్షన్. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 2 TB వరకు విస్తరించుకునేు అవకాశం.

50 గంటల బ్యాటరీ బ్యాకప్‌

50 గంటల బ్యాటరీ బ్యాకప్‌

Moto Z Play స్మార్ట్‌ఫోన్‌‌లో 50 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఆఫర్ చేసే 3,510 ఎమ్ఏహెచ్ బ్యాటరీని నిక్షిప్తం చేసారు. టర్బో ఛార్జింగ్ ఫీచర్‌ను సపోర్ట్ చేయగలిగే ఈ బ్యాటరీ సింగిల్ ఛార్జ్ పై 50 బ్యాటరీ బ్యాకప్‌ను ఆఫర్ చేయగలదట

Moto Mods పేరుతో...

Moto Mods పేరుతో...

Moto Mods పేరుతో పలు రకాల మాడ్యులర్ యాక్సెసరీస్‌ను Moto Z Play స్మార్ట్‌ఫోన్‌‌ కోసం మోటరోలా ఆఫర్ చేస్తుంది. వీటితో ఫోన్‌ను కావల్సిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. 2,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఆఫరింగ్‌తో వస్తోన్న Incipico offGRID Power Pack.ఈ Mod మోటో జెడ్ ప్లే స్మార్ట్‌ఫోన్‌ను బ్యాటరీ పవర్‌హౌజ్‌లాగా మార్చేస్తుంది. జేబీఎల్ సౌండ్ బూస్టర్ అనే మరో Mod మోటో జెడ్ ప్లే స్మార్ట్‌ఫోన్‌ను బ్యాటరీ పవర్‌హౌజ్‌లాగా మార్చేస్తుంది. InstaShare Projector సహాయంతో ఫోన్‌ను పోర్టబుల్ ప్రొజెక్టర్ లా మార్చేసుకోవచ్చు. జేబీఎల్ సౌండ్ బూస్టర్ అనే మరో Mod మోటో జెడ్ ప్లే స్మార్ట్‌ఫోన్‌ను బ్యాటరీ పవర్‌హౌజ్‌లాగా మార్చేస్తుంది. InstaShare Projector సహాయంతో ఫోన్‌ను పోర్టబుల్ ప్రొజెక్టర్‌లా మార్చేసుకోవచ్చు.

Moto Z ప్రత్యేకతలు...

Moto Z ప్రత్యేకతలు...

ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యుమినియమ్ అలానే స్టెయిన్‌లెస్ స్టీల్ లోహాలతో రూపొందించబడిన ఈ స్మార్ట్‌ఫోన్ 5.2 మిల్లీమీటర్ల మందంతో మన్నికకు మారుపేరుగా నిలుస్తుంది. మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ అమోల్డ్ 1440 పిక్సల్ డిస్‌ప్లేతో వస్తోంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ డిస్‌‍ప్లేకు రక్షణ కవచంలా నిలుస్తుంది. డిస్‌ప్లేలో పొందుపరిచిన 535 పీపీఐ హై పిక్సల్ డెన్సిటీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

శక్తివంతమైన క్వాల్కమ్ ప్రాసెసర్‌తో..

శక్తివంతమైన క్వాల్కమ్ ప్రాసెసర్‌తో..

మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన 2.2గిగాహెర్ట్జ్ సామర్థ్యం గల క్వాల్కమ్ క్వాడ్‌కోర్ స్నాప్ డ్రాగన్820 ప్రాసెసర్‌ను పొందుపరిచారు. అడ్రినో 530 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని బలోపేతం చేస్తుంది. 4జీబి ర్యామ్ ఫోన్ మల్టీ టాస్కింగ్ సామర్థ్యాలను రెట్టింపు చేస్తుంది. మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్ Android 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.

ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికొస్తే

ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికొస్తే

ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికొస్తే రెండు స్టోరేజ్ వర్షన్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. మొదటి వర్షన్ 32జీబి, రెండవ వర్షన్ 64జీబి. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 2 TB వరకు విస్తరించుకునే అవకాశం. మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. (కెమెరా ప్రత్యేకతలు : డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, లేజర్ ఆటో ఫోకస్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎఫ్.8 అపెర్చుర్), ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా ద్వారా తక్కువ వెళుతురులోనూ సెల్ఫీలను చిత్రీకరించుకోవచ్చు. (కెమెరా ప్రత్యేకతలు : వైడ్ యాంగిల్ లెన్స్, f/2.2 అపెర్చుర్).

వాటర్ రిపెల్లెంట్ నానో కోటింగ్‌..

వాటర్ రిపెల్లెంట్ నానో కోటింగ్‌..

వాటర్ రిపెల్లెంట్ నానో కోటింగ్‌తో వస్తోన్నఈ ఫోన్ నీటిలో తడిచినప్పటికి ఎటువంటి ప్రమాదం వాటిల్లదు. మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్‌కు Moto Mods పేరుతో పలు రకాల మాడ్యులర్ యాక్సెసరీస్‌ను మోటరోలా అందిస్తోంది. వీటితో మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్‌ను కావల్సిన విధంగా మార్చుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన మాడ్యులర్ కేసెస్‌తో ఫోన్‌ను ఇన్‌స్టెంట్ పవర్ బ్యాంక్‌లా, సౌండ్ బూస్టర్‌లా, ప్రొజెక్టర్‌లా, అధిక ఫ్లాషెస్‌తో కూడిన కెమెరా లెన్స్‌లా మార్చేసుకోవచ్చు. మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్ హై సెక్యూర్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తోంది. ఈ స్కానర్ ద్వారా జస్ట్ సింగిల్ టచ్‌తో ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.

టర్బో ఛార్జింగ్ ఫెసిలిటీతో..

టర్బో ఛార్జింగ్ ఫెసిలిటీతో..

మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. టర్బో ఛార్జింగ్ ఫెసిలిటీతో వస్తోన్న ఈ ఫోన్‌ను 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు 8 గంటల బ్యాకప్‌ను పొందవచ్చు. 4జీ ఎల్టీఈ, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్ సీ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లను మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్‌లో మోటరోలా అందిస్తోంది. ఫోన్ ముందు భాగంలో ఫ్రంట్ ఫేసింగ్ లౌడ్ స్పీకర్స్ ఆకట్టుకుంటాయి.

Best Mobiles in India

English summary
Moto Z Series India Launch Set for October 4. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X