మోటరోలా కొత్త ఫోన్‌లు వచ్చేసాయ్.. మోటో జీ5, జీ5 ప్లస్

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతోన్న ఈ 5వ తరం మోటో జీ హ్యాండ్‌సెట్‌‌లు ఆధునీకరించబడిన డిజైనింగ్‌తో పాటు బెటర్ క్వాలిటీ హార్డ్‌వేర్ ఫీచర్లను కలిగి ఉన్నాయి.

|

బార్సిలోనాలో ప్రారంభమైన MWC 2017ను పురస్కరించుకుని మోటరోలా తన మోటో జీ5, మోటో జీ5 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లను అనౌన్స్ చేసింది.

మోటరోలా కొత్త ఫోన్‌లు వచ్చేసాయ్.. మోటో జీ5, జీ5 ప్లస్

ఆండ్రాయిడ్, 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతోన్న ఈ 5వ తరం మోటో జీ హ్యాండ్‌సెట్‌‌లు ఆధునీకరించబడిన డిజైనింగ్‌తో పాటు బెటర్ క్వాలిటీ హార్డ్‌వేర్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. మోటో జీ4 హ్యాండ్‌సెట్‌కు సక్సెసర్ వర్షన్‌గా లాంచ్ అయిన ఈ ఫోన్ రెండు మోడల్స్‌లో అందుబాటులో ఉంటుంది. వాటి వివరాలు.. మోటో జీ5, మోటో జీ5 ప్లస్.

నోకియా కొత్త ఫోన్లు వచ్చేసాయ్, ఫీచర్లు, ధర, మరిన్ని వివరాలను ఇక్కడ క్లిక్ చేయండి.

ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే

ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే

మోటో జీ5 అలానే జీ5 ప్లస్ వర్షన్‌లు ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేలతో వస్తున్నాయి. మోటో జీ5 మోడల్ 5 అంగుళాల (1080x1920పిక్సల్స్) డిస్‌ప్లేతో వస్తోండగా, మోటో జీ5 ప్లస్ మోడల్ 5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ స్ర్కీన్‌తో వస్తోంది. ఫోన్ డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి మెటల్ ఫ్రేమ్స్ అలానే జెంటిల్ కర్వుస్ ఆకట్టుకుంటాయి.

కెమెరా క్వాలిటీ...

కెమెరా క్వాలిటీ...

ఫోటోగ్రఫీ విషయానికి వచ్చేసరికి, మోటో జీ5 ఫోన్.. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ అలానే 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది. ఇదే సమయంలో మోటో జీ5 ప్లస్.. 12 మెగా పిక్సల్ డ్యుయల్ కెమెరా సెటప్‌తో పాటు, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది. మోటో జీ5 ప్లస్ కెమెరా ద్వారా 4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

ప్రాసెసర్ ఇంకా ర్యామ్

ప్రాసెసర్ ఇంకా ర్యామ్

మోటో జీ5 ఫోన్ 1.4GHz స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ఇదే సమయంలో మోటో జీ5 ప్లస్ మోడల్ 2GHz ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ర్యామ్ విషయానికి వచ్చేసరికి మోటో జీ5 ఫోన్ 2జీబి అలానే 3జీబి ర్యామ్ వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది. ఇదే సమయంలో మోటో జీ5 ప్లస్ 3జీబి అలానే 4 జీబి ర్యామ్ వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది.

స్టోరేజ్ కెపాసిటీ..

స్టోరేజ్ కెపాసిటీ..

స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి.. మోటో జీ5, మోటో జీ5 ప్లస్ మోడల్స్ 16జీబి, 32జీబి, 64జీబి స్టోరేజ్ వేరియంట్ లలో అందుబాటులో ఉంటాయి. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు.

 బ్యాటరీ

బ్యాటరీ

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి.. మోటో జీ5 మోడల్ 2,800mAh బ్యాటరీ యూనిట్‌తో వస్తోంది. ఇదే సమయంలో మోటో జీ5 ప్లస్ మోడల్ 3,000mAh బ్యాటరీ యూనిట్‌తో వస్తోంది. టర్బో ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తోన్న ఈ రెండు ఫోన్‌లలో బ్యాటరీ వేగవంతంగా ఛార్జ్ అవుతుంది. ఈ రెండు ఫోన్‌లు 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తాయి.

ధర ఇంకా అందుబాటు..

ధర ఇంకా అందుబాటు..

ఇండియన్ మార్కెట్లో మోటో జీ5 ధర రూ.14,000లోపు ఉండొచ్చు. ఇదే సమయంలో మోటో జీ5 ప్లస్ ప్రారంభ వేరియంట్ ధర రూ.15,300 వరకు ఉండొచ్చు. మార్చిలో అమ్మకాలు ప్రారంభమైయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇవిగోండి నోకియా కొత్త ఫోన్‌లు.. పూర్తి వివరాలుఇవిగోండి నోకియా కొత్త ఫోన్‌లు.. పూర్తి వివరాలు

Best Mobiles in India

English summary
Motorola announces Moto G5 and G5 Plus at MWC 2017. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X