మార్చి 10న భారత్‌లోకి మోటో ఇ (సెకండ్ జనరేషన్)

|
మార్చి 10న  భారత్‌లోకి మోటో ఇ (సెకండ్ జనరేషన్)

భారత్ లో మోటో ఇ (సెకండ్ జనరేషన్) ఆవిష్కరణకు సంబంధించిన ప్రెస్ నోట్‌లను మోటరోలా విడుదల చేసింది. మార్చి 10, న్యూఢిల్లీలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. మోటో ఇ (మొదటి జనరేషన్)తో పోల్చుకుంటే భారీ అప్‌డేట్‌లతో వస్తోన్న మోటో ఇ (సెకండ జనరేషన్) పై మార్కెట్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకున్నాయి. 3జీ ఇంకా 4జీ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యంకానుంది. మార్కెట్లో 3జీ మోడల్ ధర రూ.6,999 వరకు ఉండొచ్చని తెలుస్తోంది. 4జీ వేరియంట్ ధరకు సంబంధించి వివరాలు వెలువడాల్సి ఉంది. భారత్‌లో మోటో ఇ (సెకండ్ జనరేషన్) ఫోన్‌లను ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది.

 
మార్చి 10న  భారత్‌లోకి మోటో ఇ (సెకండ్ జనరేషన్)

మోటో ఇ (సెకండ జనరేషన్) 4జీ ఎల్టీఈ వర్షన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. 4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, 400 మెగాహెర్ట్జ్ అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఆండ్రాయిడ్ 5.0లాలీపాప్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు 4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై 80.11 బీ/జీ/ఎన్, బ్లూటూత్ 4.0, జీపీఎస్, 2390 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బరువు 145 గ్రాములు, చుట్టుకొలతలు 66.8×129.9×5.2 - 12.3 మిల్లీ మీటర్లు, అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఫోన్ ధర 149.99 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.9,300).

 
మార్చి 10న  భారత్‌లోకి మోటో ఇ (సెకండ్ జనరేషన్)

మోటో ఇ (సెకండ జనరేషన్) 3జీ వర్షన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. 4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్, 400 మెగాహెర్ట్జ్ అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఆండ్రాయిడ్ 5.0లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు 3జీ, వై-ఫై 80.11 బీ/జీ/ఎన్, బ్లూటూత్ 4.0, జీపీఎస్, 2390 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బరువు 145 గ్రాములు, చుట్టుకొలతలు 66.8×129.9×5.2 - 12.3 మిల్లీ మీటర్లు, అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఫోన్ ధర 119.99 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.7,430).

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

Best Mobiles in India

English summary
Motorola to launch Moto E (2nd Gen) on March 10 in India. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X