మోటరోలా ‘మోటో ఇ’ రివ్యూ: తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్

|

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు ఎక్కడా లేనంత గిరాకీ ఇండియన్ మార్కెట్లో ఉంది. కమ్యూనికేషన్ పరిజ్ఞానం మరింతగా అప్‌గ్రేడ్ అయిన నేపధ్యంలో భారతావనిలోని అనేక కుటంబాలు ఫీచర్ ఫోన్‌ల వినియోగం నుంచి స్మార్ట్‌ఫోన్‌ల వినియోగంలోకి మారుతున్నాయి. ఈ పోకడలను పూర్తి స్థాయిలో సమీక్షించిన మోటరోలా ముఖ్యంగా మధ్య తరగతి స్మార్ట్‌ఫోన్ యూజర్లను టార్గెట్ చేస్తూ ‘మోటో ఇ' (Moto E) పేరుతో లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. రూ.6,999 ధర ట్యాగ్ పై లభ్యమువుతున్న ఈ ఫోన్, మన్నికైన స్మార్ట్‌ఫోన్ అనుభూతులను ఆస్వాదించాలనుకునే యూజర్లకు ఉత్తమ ఎంపిక.

మోటరోలా మోటో ఇ పనితీరు

మోటరోలా మోటో ఇ క్లాసికల్ డిజైన్ తొలి లుక్‌లోనే మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ శరీర నిర్మాణంలో భాగంగా ప్లాస్టిక్ వంటి పదార్థాన్ని వినియోగించారు. డివైస్ మందం 12.3 మిల్లీమీటర్లు. ఈ పాకెట్ ఫ్రెండ్లీ ఫోన్ సరిగ్గా చేతిలో ఇమిడిపోతుంది. ఫోన్ పరిమాణం 124.8 x 64.8 x 12.3 మిల్లీమీటర్లు, బరువు 140 గ్రాములు.

ఫోన్‌లో అమర్చిన 4.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే నాణ్యమైన వీక్షణా అనుభూతులను చేరువ చేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ హ్యాండ్ సెట్‌కు రక్షణ కవచంలా వ్యవహరిస్తుంది. వాటర్ రెసిస్టెంట్ కోటింగ్ ఫోన్‌ను నీటి ప్రమాదాల నుంచి రక్షిస్తుంది. ఫోన్‌లో ఏర్పాటు చేసిన ఇయర్‌పీస్ స్పీకర్, ప్రధాన స్పీకర్ అలానే ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్లు నమ్మకమైన పనితీరును ప్రదర్శిస్తాయి. మోటరోలా మోటో ఇ అత్యుత్తమ వాయిస్ కాలింగ్‌ను అందిస్తుందని అనటంలో ఏమాత్రం సందేహం లేదు.

 మోటరోలా ‘మోటో ఇ’ రివ్యూ:  తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్

మోటరోలా ‘మోటో ఇ’ రివ్యూ: తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్

 ‘మోటో ఇ' స్మార్ట్‌ఫోన్ పటిష్టమైన నిర్మాణ శైలిని కలిగి ఉంది. 4.3 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 540x 960పిక్సల్స్, 256పీపీఐ పిక్సల్ డెన్సిటీ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రాటెక్షన్, వాటర్ నానో కోటింగ్ వంటి అంశాలు ‘మోటో ఇ' స్మార్ట్‌ఫోన్‌ను పటిష్టమైన స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌గా మార్చేసాయి. దుమ్ము ఇంకా నీటి నిరోధక సామర్ధ్యాలను మోటో ఇ స్మార్ట్‌ఫోన్ కలగి ఉండటం విశేషం.

 

 

 మోటరోలా ‘మోటో ఇ’ రివ్యూ:  తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్

మోటరోలా ‘మోటో ఇ’ రివ్యూ: తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్

 ‘మోటో ఇ' స్మార్ట్‌ఫోన్‌లో అత్యుత్తమ ఆడియో క్వాలిటీ వ్యవస్థను ఏర్పాటు చేసారు. పాటలు, యూట్యూబ్ వీడియోల అలానే ఎఫ్ఎమ్ రేడియోను అత్యుత్తమ ఆడియో అనుభూతులతో యూజర్ ఆస్వాదించవచ్చు.

 

 మోటరోలా ‘మోటో ఇ’ రివ్యూ:  తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్

మోటరోలా ‘మోటో ఇ’ రివ్యూ: తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్

 ‘మోటో ఇ' స్మార్ట్‌ఫోన్ 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. ఈ కెమెరా ఫీచర్ ద్వారా యూజర్ ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీని ఆశించవచ్చు. ఎల్ఈడి ఫ్లాష్ ఫీచర్ ఈ కెమెరాలో లోపించినప్పటికి హెచ్‌డిఆర్, పానోరమా వంటి ప్రత్యేకతలు కెమెరా పనితీరు పై మరింత ప్రభావం చూపుతాయి.

Read more at: https://telugu.gizbot.com/mobile/10-worthy-reasons-you-grab-moto-e-right-now-009752.html#slide678261

 

 మోటరోలా ‘మోటో ఇ’ రివ్యూ:  తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్

మోటరోలా ‘మోటో ఇ’ రివ్యూ: తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్

ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ ఫోన్: ఆండ్రాయిడ్ ఆధునిక వర్షన్ కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం‌ను మోటో ఇ స్మార్ట్‌ఫోన్‌లో లోడ్ చేసారు. ఈ సౌలభ్యతతో లెటేస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్ మొబైలింగ్‌ను యూజర్లు ఆస్వాదించవచ్చు.

 

 

 మోటరోలా ‘మోటో ఇ’ రివ్యూ:  తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్

మోటరోలా ‘మోటో ఇ’ రివ్యూ: తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్

1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ సామర్ధ్యం గల క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్‌తో పాటు అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్‌ను మోటో ఇ స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. 1జీబి ర్యామ్ ఫోన్ పనితీరును మరింత వేగవంతం చేస్తుంది. కాండీ క్రష్, టెంపుల్ రన్, మినియన్ రష్ వంటి గేమ్‌లను అత్యుత్తమ గ్రాఫిక్ అనుభూతులతో ఆస్వాదించవచ్చు.

 

 

మోటరోలా మోటో ఇ ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. భవిష్యత్‌లో ఈ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌ను మరో వర్షన్‌కు అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫోన్‌లో నిక్షిప్తం చేసిన మోటో అసిస్ట్, మోటో మైగ్రేట్, మోటో అలర్ట్ వంటి ఫీచర్లు యూజర్‌కు మరింతగా దోహదపడతాయి. మోటో ఇ స్మార్ట్‌ఫోన్‌లో ముందుగానే 5 హోమ్‌స్ర్కీన్‌లను లోడ్ చేసారు వాటిలో నచ్చిన హోమ్‌స్ర్కీన్‌‌ను ఉపయోగించుకోవచ్చు.

మోటరోలా మోటో ఇ 1.2గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. నిక్షిప్తం చేసిన అడ్రినో 302 400 మెగాహెట్జ్ సింగిల్ కోర్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తుంది. 1జీబి ర్యామ్ వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌కు దోహదపడుతుంది. 4జీబి ఇంటర్నల్ మెమరీ, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ, ఫోన్ వెనుక భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఫ్రంట్ కెమెరా లేదు.మోటో ఇ స్మార్ట్‌ఫోన్ బలోపేతమైన 1980ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉంది. బ్యాటరీ పూర్తి చార్జ్ పై సూదూర టాక్ టైమ్‌ను యూజర్ పొందవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘మోటో ఇ' ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను యూజర్ ఆస్వాదించవచ్చు.

గిజ్‌బాట్ బృందం నిర్వహించిన అన్ని బెంచ్‌మార్క్ పరీక్షలను మోటో ఇ స్మార్ట్‌ఫోన్ సమర్థవంతంగా ఎదుర్కొంది. ఫోన్‌ను రోజంతా ఉపయోగించినప్పటికి ఫోన్ బ్యాక్ ప్యానల్ ఏమాత్రం వేడెక్కలేదు ఇది ఒక మంచి పరిణామంగా భావించవచ్చు. మోటో ఇ స్మార్ట్‌ఫోన్‍‌ను రూ.6,999 ధర ట్యాగ్ పై ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ (flipkart)ప్రత్యేకంగా విక్రయిస్తోంది. మోటరోలా మోటో ఇ పనితీరుకు సంబంధించిన పూర్తి విశ్లేషణాత్మక రివ్యూను క్రింది వీడియోలో చూడొచ్చు..

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/WcLsXKnTK5s?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X