ఆ ఫోన్ దెబ్బకు Moto G4 Play మార్కెట్లో నిలబడుతుందా?

|

మోటో జీ4, జీ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణల తరువాత చాలా రోజులు గ్యాప్ తీసుకుని మోటరోలా లాంచ్ చేసిన ఫోన్ Moto G4 Play. లెనోవో నేతృత్వంలోని మోటరోలా తన సరికొత్త మోటో జీ4 ప్లే స్మార్ట్‌ఫోన్‌‌ను మంగళవారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది.

Read More : ఏపీ విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌లు!

ఆ ఫోన్ దెబ్బకు Moto G4 Play మార్కెట్లో నిలబడుతుందా?

రూ.8,999 ధర ట్యాగ్‌తో అందుబాటులో ఉన్న ఈ 4G VoLTE స్మార్ట్‌ఫోన్‌ను ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ Amazon India ఎక్స్‌‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

#1

#1

ఇదే కాంపిటీటివ్ ధర ట్యాగ్‌తో మార్కెట్లో లభ్యమవుతోన్న షియోమీ Redmi 3S Prime స్మార్ట్‌ఫోన్ నుంచి Moto G Playకు గట్టిపోటీ ఎదురవుతోంది. ఈ ఫోన్‌ల మధ్య spec comparisonను పరిశీలించినట్లయితే...

#2

#2

మోటో జీ4 ప్లే అలానే రెడ్మీ 3ఎస్ ప్రైమ్‌లు సమానమైన డిస్‌ప్లే ఇంకా రిసల్యూషన్ క్వాలిటీలతో వస్తున్నాయి. 720 పిక్సల్ స్ర్కీన్ రిసల్యూషన్‌తో కూడిన 5 అంగుళాల డిస్‌ప్లే వ్యవస్థను ఈ రెండు ఫోన్‌లు కలిగి ఉన్నాయి.

#3

#3

హార్డ్‌వేర్ విషయానికి వచ్చేసరికి మోటో జీ4 ప్లే స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 చిప్‌సెట్‌ను ఎక్విప్ చేసారు. ప్రాసెసర్ క్లాక్ వేగం 1.2గిగాహెర్ట్జ్, 2జీబి ర్యామ్ సపోర్ట్.

#4
 

#4

మరోవైపు రెడ్మీ 3ఎస్ ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 చిప్‌సెట్‌ను నిక్షిప్తం చేసారు. ప్రాసెసర్ క్లాక్ వేగం వచ్చేసరికి 1.4 గిగాహెర్ట్జ్, 3జీబి ర్యామ్ సపోర్ట్. 

#5

#5

రెడ్మీ 3ఎస్ ఫోన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్‌తో వస్తోంది. మోటరోలా ఫోన్‌లో ఈ సదుపాయం లేదు.

#6

#6

స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి.. రెడ్మీ 3ఎస్ ప్రైమ్ 32జీబి ఇంటర్నల్ మెమరీ ఆప్షన్‌తో వస్తోంది. ఇదే సమయంలో మోటో జీ4 ప్లే 16జీబి ఇంటర్నల్ మెమరీ ఆప్షన్‌తో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా రెడ్మీ 3ఎస్ ప్రైమ్ స్టోరేజ్ ను 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

#7

#7

కెమెరా విషయానికి వచ్చేసరికి.. రెడ్మీ 3ఎస్ ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌లో 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఏర్పాటు చేసారు.

#8

#8

మరోవైపు మోటో జీ4 ప్లే స్మార్ట్‌ఫోన్‌లో 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఏర్పాటు చేసారు.

#9

#9

బ్యాటరీ ఇంకా సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి.. రెడ్మీ 3ఎస్ ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌లో 4,100 ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థను నిక్షిప్తం చేసారు. మోటో జీ4 ప్లే స్మార్ట్‌ఫోన్‌లో 2,800 ఎమ్ఏహెచ్ బ్యాటరీని మీరు చూడొచ్చు.

#10

#10

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయి.

Best Mobiles in India

English summary
Motorola Moto G4 Play launched: Will it be Real Contender to Xiaomi Redmi 3S Prime. Read More in Telgu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X