నోకియా, రెండు కొత్త ఫోన్‌లను లాంచ్ చేసింది

|

HMD Global, తన మొదటి నోకియా బ్రాండెడ్ ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది. నోకియా 150, నోకియా 150 డ్యుయల్ మోడల్స్‌లో లాంచ్ అయిన ఈ రెండు పీచర్ ఫోన్‌లు నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కంటే ముందే అందుబాటులోకి రావటం మార్కెట్ ఆశ్చర్యపరుస్తుంది.

Read More : 4జీబి ర్యామ్, 64జీబి స్టోరేజ్‌తో Moto M మార్కెట్లో లాంచ్ అయ్యింది

2017, జనవరిలో మార్కెట్లోకి..

2017, జనవరిలో మార్కెట్లోకి..

2017, మొదటి క్వార్టర్‌లో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి. ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రీకా ఇంకా యూరోప్ ప్రాంతాల్లో ఈ ఫోన్‌లనుహెచ్‌ఎమ్‌డి గ్లోబల్ అందుబాటులో ఉంచనుంది. మార్కెట్లో ఈ ఫోన్ ధరలు రూ.1700లోపు ఉండొచ్చని తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉండదు

ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉండదు

నోకియా నుంచి లాంచ్ అయిన ఈ రెండు కొత్త బేసిక్ హ్యాండ్‌సెట్స్‌లో ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉండదు. ఎంపీ3 ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, బ్లుటూత్ వీ3.0 విత్ స్లామ్, వీజీఏ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్ వంటి ప్రత్యేకతలు ఉంటాయి.

ఫోన్ స్పెసిఫికేషన్స్..

ఫోన్ స్పెసిఫికేషన్స్..

2.5 అంగుళాల QVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 240x320పిక్సల్స్)తో వస్తోన్న, ఈ హ్యాండ్‌సెట్‌లు నోకియా సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయి.

బ్యాటరీ బ్యాకప్

బ్యాటరీ బ్యాకప్

బ్యాటరీ సామర్థ్యం వచ్చేసరికి.. 22 గంటల టాక్‌టైమ్ అలానే 31 రోజులు స్టాండ్‌బై టైమ్‌ను ఈ ఫోన్‌లకు సంబంధించిన బ్యాటరీలు సమకూర్చగలవని హెచ్‌ఎమ్‌డి గ్లోబల్ చెబుతోంది. Snake Xenzia, Nitro Racing వంటి పాపులర్ గేమ్స్ ఈ ఫోన్‌లలో అందుబాటులో ఉంటాయని కంపెనీ చెబుతోంది.

ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే..

ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే..

మైక్రోసాఫ్ట్ కంపెనీ నోకియా బ్రాండ్ హక్కులను హెచ్‌ఎండీ గ్లోబల్‌కు విక్రయించిన విషయం తెలిసిందే. వచ్చే పదేళ్ల పాటు నోకియా బ్రాండ్‌ ఫోన్లు, టాబ్లెట్లు తయారు చేసేందుకు హెచ్‌ఎండి గ్లోబల్‌ లిమిటెడ్‌కు అంతర్జాతీయ లైసెన్సును, ఐపిఆర్‌ హక్కులను మైక్రోసాఫ్ట్ నుంచి హెచ్‌ఎండీ గ్లోబల్‌ సొంతం చేసుకుంది. 1998-2011 మధ్య కాలంలో మొబైల్ ఫోన్ల రంగంలో నోకియా కంపెనీ అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Nokia 150, Nokia 150 Dual SIM Feature Phones Launched. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X