నోకియా 3 సేల్ స్టార్ట్ అయ్యింది, ధర రూ.9,499

లాంచ్ ఆఫర్స్ కూడా సిద్ధం...

|

నోకియా, నోకియా 5, నోకియా 3 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌‌లు కొద్దిరోజుల క్రితమే ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన విషయం తెలిసిందే. లాంచ్ సమయంలో హెచ్‌ఎండి గ్లోబల్ వెల్లడించిన వివరాల ప్రకారం నోకియా 3, నోకియా 5 మోడల్స్ ఆఫ్‌లైన్ మోడ్‌లో మాత్రమే దొరుకుతాయి. నోకియా 6 మాత్రం అమెజన్ ఇండియాలో దొరుకుతుంది.

 

నోకియా 3 సేల్ ప్రారంభమైంది..

నోకియా 3 సేల్ ప్రారంభమైంది..

తాజాగా, నోకియా 3 ఫోన్‌లకు సంబంధించిన సేల్ ఇండియన్ మార్కెట్లో ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 80,000 రిటైల్ స్టోర్‌లలో ఈ ఫోన్‌లను అందుబాటులో ఉంచేందుకు గాను 400 డిస్ట్రిబ్యూటర్లను హెచ్‌ఎండి గ్లోబల్ అపాయింట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నోకియా మొబైల్ కేర్ సర్వీసును 300 నగరాలకు హెచ్‌ఎండి గ్లోబల్ విస్తరించినట్లు తెలుస్తోంది.

 నోకియా 3 స్పెసిఫికేషన్స్...

నోకియా 3 స్పెసిఫికేషన్స్...

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, MTK 6737, క్వాడ్-కోర్ 1.3Ghz ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్న్ స్టోరేజ్ , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 2650 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (సిల్వర్ వైట్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్).

లాంచ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి...
 

లాంచ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి...

లాంచ్ ఆఫర్ క్రింద నోకియా 3 ఫోన్‌లను కొనుగోలు చేసిన వొడాఫోన్ యూజర్లకు మూడు నెలల పాటు రూ.149కే 5జీబి డేటా లభిస్తుంది. అలనే Makemytrip.com బుకింగ్స్ పై రూ.1800 వరకు తగ్గింపు, డొమస్టిక్ ఫ్లైట్స్ పై రూ.700 వరకు తగ్గింపు లభిస్తుంది.

నోకియా 3 కోసం ప్రత్యేకమైన యాక్సెసరీస్

నోకియా 3 కోసం ప్రత్యేకమైన యాక్సెసరీస్

నోకియా 3 కోసం ప్రత్యేకమైన యాక్సెసరీస్‌ను హెచ్‌ఎండి గ్లోబల్ అందుబాటులో ఉంచింది. వాటిలో నోకియా స్టీరియో హెడ్‌సెట్ WH-201 ఒకటి. ఈ ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్స్ హైక్వాలిటీ పనితీరును ఆఫర్ చేస్తాయి.

Best Mobiles in India

English summary
Nokia 3 sale starts in India at Rs.9,499. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X