ధర ఇంత తక్కువా..? ఇండియాకు వచ్చేసిన నోకియా 3310

ఎప్పటి నుంచో ఊరిస్తున్న నోకియా ఫీచర్ ఫోన్ 3310 ఎట్టకేలకు భారత్ లోకి అధికారికంగా వచ్చేసింది.

By Hazarath
|

ఎప్పటి నుంచో ఊరిస్తున్న నోకియా ఫీచర్ ఫోన్ 3310 ఎట్టకేలకు భారత్ లోకి అధికారికంగా వచ్చేసింది. హెచ్ఎండీ గ్లోబల్ ఈ ఫోన్ ను అధికారికంగా భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. 2017 మే 18 నుంచి ఈ ఫోన్ భారత్ లోని అన్ని స్టోర్లలో అందుబాటులోకి వస్తోందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ ధరవింటే నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది కూడా.

నోకియా 3310 (2017) vs నోకియా 3310 (2000)

మోడల్ పేరునే, ధరగా

మోడల్ పేరునే, ధరగా

ఈ ఫోన్ మోడల్ పేరునే, ధరగా హెచ్ఎండీ గ్లోబల్ ప్రకటించింది. అంటే నోకియా 3310 ఫోన్ ను 3,310 రూపాయలకే విక్రయానికి ఉంచనుంది.

తొలి ఫోన్ ఇదే

తొలి ఫోన్ ఇదే

హెచ్ఎండీ గ్లోబల్ రూపొందించిన తొలి ఫోన్ ఇదే. అంతేకాక ఆ కంపెనీ విక్రయానికి తీసుకొస్తున్న దేశాల్లో కూడా భారత్ కే మొదటి స్థానం కల్పించింది .

నాలుగు రంగుల్లో

నాలుగు రంగుల్లో

నాలుగు రంగుల్లో దీన్ని కంపెనీ భారత్ లోకి తీసుకొచ్చింది. డార్క్ బ్లూ, గ్రే, రెడ్, ఎల్లో రంగుల్లో ఇది అందుబాటులోకి వస్తోంది.

పాత నోకియా 3310కి
 

పాత నోకియా 3310కి

పాత నోకియా 3310కి చాలా మార్పులను చేస్తూ ప్రస్తుత వెర్షన్ ను హెచ్ఎండీ గ్లోబల్ తీసుకొచ్చింది. దీనిలో అతిపెద్ద మార్పు డిస్ ప్లే, డిజైన్. 2.4 అంగుళాల కలర్ డిస్ ప్లే, స్క్రీన్ పై కర్వ్డ్ గ్లాస్ ను ఈ ఫోన్ కు కల్పించింది.

2.1 గంటల వరకు టాక్ టైమ్ పవర్

2.1 గంటల వరకు టాక్ టైమ్ పవర్

ఫీచర్ల విషయానికొస్తే 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ ప్లే తో ఫోన్ వచ్చింది. 1200ఎంఏహెచ్ బ్యాటరీ(22.1 గంటల వరకు టాక్ టైమ్ పవర్),రేడియో, మ్యూజిక్ ప్లేయర్, నోకియా మైక్రోయూఎస్బీ ఛార్జర్.

 32జీబీ వరకు మైక్రోఎస్డీ కార్డు

32జీబీ వరకు మైక్రోఎస్డీ కార్డు

16ఎంబీ ఫోన్ స్పేస్ ఉంటుంది. 32జీబీ వరకు మైక్రోఎస్డీ కార్డుతో వాడుకోవచ్చు. బ్రౌజింగ్ ఆప్షన్ ఉంటుంది కానీ యాప్స్ డౌన్ లోడ్ కు అవకాశం లేదు.

2ఎంపీ వెనుక కెమెరా

2ఎంపీ వెనుక కెమెరా

2ఎంపీ వెనుక కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ తో నచ్చిన విధంగా ఫోటోలు తీసుకోవచ్చు. 2జీ నెట్‌వర్క్ సపోర్ట్, బ్లుటూత్ కనెక్టువిటీ

స్నేక్ గేమ్‌

స్నేక్ గేమ్‌

అప్పటి మోస్ట్ పాపులర్ స్నేక్ గేమ్‌ను రీడిజైన్ చేసి ఈ ఫోన్‌లో పొందుపరిచారు. ఒరిజినల్ వర్షన్‌తో పోలిస్తే ఫోన్ కలర్ డిస్‌ప్లేను మరింతగా మెరుగుపరచటంతో గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కొత్తగా అనిపిస్తుంది.

2017 మే 18 నుంచి

2017 మే 18 నుంచి

2017 మే 18 నుంచి ఈ ఫోన్ భారత్ లోని అన్ని స్టోర్లలో అందుబాటులోకి వస్తోంది

Best Mobiles in India

English summary
Nokia 3310 finally launched in India, and here’s the final price Read more at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X