Nokia 6 vs Moto G5 Plus, మీ బెస్ట్ ఫోన్ ఏది..?

ఈ రెండు ఫోన్‌లకు సంబంధించి Spec Comparison...

|

ఎట్టకేలకు ఆండ్రాయిడ్ గూటికి చేరిన నోకియా, హెచ్‌ఎండి గ్లోబల్ సారథ్యంలో మూడు సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. నోకియా 6, నోకియా 5,
నోకియా 3 మోడల్స్‌లో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి. వీటీలో హై-ఎండ్ మోడల్ అయిన నోకియా 6ను, మోటో జీ5 ప్లస్‌కు ప్రధాన కాంపిటీటర్‌గా మార్కెట్ వర్గాలు పరిగణిస్తున్నాయి. రూ.15,000 బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న ఈ రెండు ఫోన్‌లకు సంబంధించి Spec Comparisonను ఇప్పుడు చూద్దాం...

 

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి..

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి..

మోటో జీ5 ప్లస్ : 5.2 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్),
నోకియా 6 : 5.5 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్),


నోకియా 6 ఫోన్‌కు 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే ప్లస్ పాయింట్. మోటో జీ5 ప్లస్ ఫోన్ లో ఏర్పాటు చేసిన 5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే 424 పీపీఐను కలిగి ఉంటే, నోకియా 6 డిస్‌ప్లే మాత్రం 403 పీపీఐను మాత్రమే కలిగి ఉంటంది. ఈ రెండు డిస్‌ప్లేలను కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ట్ చేస్తుంది. మెటల్ డిజైన్‌లతో వస్తోన్న ఈ ఫోన్‌లు స్డర్డీ లుక్‌లో ఆకట్టుకోవటంతో పాటు చేతిలో కంఫర్ట్‌గా ఇమిడిపోతాయి.

 

ప్రాసెసర్ విషయానికొస్తే...

ప్రాసెసర్ విషయానికొస్తే...

మోటో జీ5 ప్లస్ : స్నాప్‌డ్రాగన్ 625
నోకియా 6 : స్నాప్‌డ్రాగన్ 430

ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి నోకియా 6 Snapdragon 430 ప్రాసెసర్‌తో పోలిస్తే మోటో జీ5 ప్లస్ Snapdragon 625 ప్రాసెసర్‌దే పైచేయిగా కనిపిస్తోంది.

ఆపరేటింగ్ సిస్టం
 

ఆపరేటింగ్ సిస్టం

మోటో జీ5 ప్లస్ : ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటంగ్ సిస్టం,
నోకియా 6 : ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటంగ్ సిస్టం,

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో ఆండ్రాయిడ్ యూజర్ ఎక్స్ పీరియన్స్ ఇంచుమించుగా ఒకేలా ఉంటుంది. 

 

 ర్యామ్ కెపాసిటీ...

ర్యామ్ కెపాసిటీ...

మోటో జీ5 ప్లస్ : 3జీబి ర్యామ్,
నోకియా 6 : 3జీబి ర్యామ్

ర్యామ్ విషయంలోనూ ఈ రెండు ఫోన్‌లు సమానమైన పనితీరును కనబరుస్తాయి. 

 స్టోరేజ్

స్టోరేజ్

మోటో జీ5 ప్లస్ : 32జీబి ఇంటర్నల్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం,
నోకియా 6 : 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం,

స్టోరేజ్ విషయంలోనూ ఈ రెండు ఫోన్‌లు సమానమైన పనితీరును కనబరుస్తాయి. 

కెమెరా

కెమెరా

మోటో జీ5 ప్లస్ : 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
నోకియా 6 : 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

కెమెరా విషయానికి వచ్చేసరికి నోకియా 6 ఫోన్ 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ అలానే 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది. ఈ కెమెరాలలో పొందుపరిచిన f/2.0 అపెర్చుర్ లెన్స్, డ్యుయల్ టోన్ ఫ్లాష్‌లు క్వాలిటీ ఫోటోగ్రఫీని ఆఫర్ చేస్తాయి. ఇదే సమయంలో మోటో జీ5 ప్లస్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ అలానే 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది. ఫోన్ వెనుక కెమెరాలో ఏర్పాటు చేసిన f/1.7 అపెర్చుర్ లెన్స్, మన్నికైన పనితీరును కనబరుస్తాయి. కెమెరా విషయానికి వచ్చేసరికి నోకియా 6 దే పై చేయిగా కనిపిస్తోంది.

బ్యాటరీ విషయానికొస్తే

బ్యాటరీ విషయానికొస్తే

మోటో జీ5 ప్లస్ : 3000mAh
నోకియా 6 : 3000mAh

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు సమానమైన 3000mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీలను కలిగి ఉన్నాయి. బ్యాటరీ బ్యాకప్ పరంగా మోటో జీ5 ప్లస్ మన్నికైన పనితీరును కనరబుస్తుంది. నోకియా 6 బ్యాటరీని పరీక్షించాల్సి ఉంది.

ఏది బెస్ట్ ఫోన్..?

ఏది బెస్ట్ ఫోన్..?

ఒక్క ప్రాసెసర్, కెమెరా మినహా ఈ రెండు ఫోన్‌లను ఇంచుమించుగా సమానమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్నాయి. ధర విషయంలోనూ ఈ రెండు ఫోన్‌లు సమానమైన ధర ట్యాగ్‌ను కలిగి ఉండటం విశేషం. నోకియా అభిమానులకు నోకియా 6 బెస్ట్ ఆప్షన్, మోటరోలా అభిమానులకు మోటో జీ5 ప్లస్ బెస్ట్ ఆప్షన్. 

Best Mobiles in India

English summary
Nokia 6 vs Moto G5 Plus:Is Nokia with Android Really Better?. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X