షాకింగ్ ఫీచర్లతో నోకియా 8, కొత్తవి ఇవే !

రూమర్ల ప్రకారం నోకియా 8 కెమెరాకు Carl Zeiss lensesను అమర్చినట్లుగా తెలుస్తోంది.

By Hazarath
|

నోకియా ఈ పేరులో ఏదో తెలియన గమ్మత్తు ఉంది. ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో మకుటం లేని మహరాజులా ఏలిన నోకియా సరికొత్త స్మార్ట్‌ఫోన్ల రాకతో ఒక్కసారిగా తన వైభవాన్ని కోల్పోయింది. ఇప్పుడు హెచ్ఎమ్‌డితో జట్టుకట్టడం నోకియాకి బాగా కలిసొచ్చింది. స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో మళ్లీ ఉనికిని చాటుకునేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా నోకియా 3, నోకియా 5, నోకియా 6, నోకియా 3310 ఫోన్లను రిలీజ్ చేసింది.ఇప్పుడు నోకియా 8తో దూసుకొస్తోంది. దీనికి సంబంధించి సరికొత్త ఫీచర్లు లీకయ్యాయి.

ఇకపై ఐడియా రోమింగ్ ఉచితం

నోకియా 8 కెమెరాకు Carl Zeiss lenses

నోకియా 8 కెమెరాకు Carl Zeiss lenses

లేటెస్ట్ గా వచ్చిన రూమర్ల ప్రకారం నోకియా 8 కెమెరాకు Carl Zeiss lensesను అమర్చినట్లుగా తెలుస్తోంది. ఇది హైఎండ్ ఫీచర్. విబో ఫోన్‌కు ఈ ఫీచర్ వస్తోందనే న్యూస్ గతేడాది హల్‌చల్ చేసింది కూడా. అయితే నోకియా ఈ ఫీచర్‌ని నోకియా8లో తీసుకురానున్నట్లు లీకయిన వార్తలు చెబుతున్నాయి.అయితే నోకియా దీనిని అధికారికంగా ధృవీకరించలేదు

23 మెగా‌ఫిక్సల్ సెట్‌అప్ డ్యూయెల్ కెమెరా

23 మెగా‌ఫిక్సల్ సెట్‌అప్ డ్యూయెల్ కెమెరా

23 మెగా‌ఫిక్సల్ సెట్‌అప్ డ్యూయెల్ కెమెరాతో పాటు 23 మెగా‌ఫిక్సల్ రిజల్యూషన్ తో ఫోన్ రానున్నట్లు సమాచారం. అయితే Carl Zeiss lensesను జూన్‌లో లాంచ్ చేయనున్నారు. లాంచ్‌కు ముందే నోకియా తన ఫోన్లకు వాడేసినట్లు సమాచారం.

రెండు రకాల వేరియంట్లలో
 

రెండు రకాల వేరియంట్లలో

లీకయిన వివరాల ప్రకారం నోకియా 8 రెండు రకాల వేరియంట్లలో రానుంది. 5.7 ఇంచ్ సూపర్ అమోల్డ్ bezel-less displayతో పాటు QHD రిజల్యూషన్ తో రానున్నట్లు సమాచారం. మెటల్ యునిబాడీ డిజైన్ తో ఫోన్ రానుంది.

ర్యామ్

ర్యామ్

Snapdragon 821 processor విత్ 8జీబి ర్యామ్, Snapdragon 835 processor విత్ 6జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం.64 జిబి, 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో రానున్నట్లు తెలుస్తోంది.

12 ఎంపీ సెల్ఫీ కెమెరా

12 ఎంపీ సెల్ఫీ కెమెరా

సెల్ఫీ కెమెరా విషయానికొస్తే 12 ఎంపీ సెల్ఫీ కెమెరాతో నచ్చిన ఫోటోలు షూట్ చేసుకోవచ్చు. వీడియో కాలింగ్ సదుపాయం కూడా ఉంది. ఇండియాలో ఇది రిలీజయితే దీని ధర సుమారుగా 38,400 ఉండొచ్చని అంచనా.అలాగే higher వేరియంట్ ధర రూ. 43, 500 ఉండొచ్చని అంచనా.

Best Mobiles in India

English summary
Nokia 8 rumored to feature 23-megapixel rear camera with Carl Zeiss lens: Specifications, features read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X