నోకియా నుంచి వస్తుంది ఫోనే.. టాబ్లెట్ కాదు!

నోకియా అప్‌కమింగ్ ఆండ్రాయిడ్ డివైస్ D1C గురించి రోజుకో ఆసక్తికర సమాచారం ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమవుతోంది.

|

నోకియా అప్‌కమింగ్ ఆండ్రాయిడ్ డివైస్ D1C గురించి రోజుకో ఆసక్తికర సమాచారం ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమవుతోంది. కొద్ది రోజుల క్రితం నోకియా D1C డివైస్‌ను 13.8 అంగుళాల డిస్‌ప్లేతో కూడిన టాబ్లెట్‌గా అభివర్ణిస్తూ GFXBench పలు వివరాలు విడుదల చేసింది. ఈ రిపోర్ట్ వెలువడిన తరువాత నోకియా D1C స్మార్ట్‌ఫోన్ కాదని, టాబ్లెట్ మాత్రమేనని అనుకున్నారు.

నోకియా నుంచి వస్తుంది ఫోనే.. టాబ్లెట్ కాదు!

Read More : ఇక వాట్సాప్‌లో వీడియో కాలింగ్

తాజాగా, Nokiapoweruser అనే వెబ్‌సైట్ నోకియా డీ1సీ, 4.8 అంగుళాల డిస్‌ప్లేతో వస్తోన్న ఆండ్రాయిడ్ ఫోన్ అని చెబుతోంది. నోకియా D1Cకి సంబంధించి GFXBench బెంచ్ మార్కింగ్ వెబ్‌సైట్‌లో వచ్చిన వివరాలు తప్పని ఈ వెబ్‌సైట్ వెల్లడించింది. పలు అనధికారిక కధనాల ప్రకారం Nokia D1C ఫోన్‌కు సంబంధించి కొన్ని హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉండొచ్చు..

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 ఆండ్రాయిడ్ 7.0 నౌగట్

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్

Nokia D1C స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఇది లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కావటం విశేషం.

 స్నాప్‌డ్రాగన్ 430 SoC

స్నాప్‌డ్రాగన్ 430 SoC

1.4గిగాహెర్ట్జ్ సామర్థ్యం గల ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 SoCను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదే చిప్‌సెట్‌ను రెడ్మీ 3ఎస్, రెడ్మీ 3ఎస్ ప్రైమ్ ఫోన్‌లలో వినియోగించారు.

 3జీబి ర్యామ్‌తో

3జీబి ర్యామ్‌తో

Nokia D1C స్మార్ట్‌ఫోన్ 3జీబి ర్యామ్‌తో రాబోతున్నట్లు GeekBench అలానే AnTuTu లిస్టింగ్స్ చెబుతున్నాయి.

ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే

ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే

స్నాప్‌డ్రాగన్ 430 SoCతో వచ్చే ఫోన్ ఖచ్చితంగా ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేను సపోర్ట్ చేస్తుంది. కాబట్టి Nokia D1C స్మార్ట్‌ఫోన్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో రాబోతోంది.

యూజర్లకు త్వరగా కనెక్ట్ అయ్యే అవకాశం..?

యూజర్లకు త్వరగా కనెక్ట్ అయ్యే అవకాశం..?

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ డిజైన్ చేయబడుతున్న నోకియా ఆండ్రాయిడ్ ఫోన్స్ రూ.10,000 కంటే తక్కువ ధర రేంజ్‌లో అందుబాటులో ఉంటే యూజర్లకు త్వరగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు

Best Mobiles in India

English summary
Nokia D1C is a 4.8-inch display Android phone, not a tablet: Report. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X