ఆ ఫోన్ అవుట్ ఆఫ్ స్టాక్

వన్‌ప్లస్ వెబ్‌సైట్ లిస్టింగ్స్‌లో మాత్రం వన్‌ప్లస్ 3టీ 128జీబి వేరియంట్ అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తోంది

|

కొద్ది రోజుల క్రితం వన్‌ప్లస్ 3టీ 128జీబి వేరియంట్ ను డిస్‌కంటిన్యూ చేసిన్నట్లు వార్తలు వచ్చిన తెలిసిందే. ఈ వేరింయట్‌ను ఎందుకు నిలిపివేసారు అనేదాని పై ఆరాతీయగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వన్‌ప్లస్ 3టీ 128జీబి వేరియంట్ నిలిపివేతకు సంబంధించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడనప్పటికి వన్‌ప్లస్ వెబ్‌సైట్ లిస్టింగ్స్‌లో మాత్రం వన్‌ప్లస్ 3టీ 128జీబి వేరియంట్ అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తోంది.

 

వన్‌ప్లస్ 5 విడుదల నేపథ్యంలో..

వన్‌ప్లస్ 5 విడుదల నేపథ్యంలో..

వన్‌ప్లస్ 5 విడుదల నేపథ్యంలో ఈ వేరియంట్‌ను ఇక అందుబాటులోకి తీసుకురాకపోవచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

64జీబి, 128జీబి...

64జీబి, 128జీబి...

OnePlus 3 ఫోన్‌తో పోలిస్తే కెమెరా, స్టోరేజ్, బ్యాటరీ ఇంకా ప్రాసెసర్ విభాగాల్లో వన్‌ప్లస్ 3టీ ఫోన్ అప్‌గ్రేడెడ్ ఫీచర్లను కలిగి ఉంది. వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 2.35GHz క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్‌తో వస్తోంది. OnePlus 3 ఫోన్ తరహాలోనే ఈ ఫోన్‌లో కూడా 6జీబి ర్యామ్‌ను ఏర్పాటు చేయటం జరిగింది.ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అందులో మొదటికి 64జీబి వర్షన్, రెండవది 128జీబి వర్షన్.

శక్తివంతమైన 3400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
 

శక్తివంతమైన 3400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 3400 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఈ బ్యాటరీ డాష్ ఛార్జ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది.

శక్తివంతమైన 16 మెగా పిక్సల్ కెమెరా..

శక్తివంతమైన 16 మెగా పిక్సల్ కెమెరా..

వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్, రెండు 16 మెగా పిక్సల్ కెమెరాలను కలిగి ఉంది. వీటిని ఫ్రంట్ ఇంకా రేర్ భాగాల్లో అమర్చటం జరిగింది., సామ్‌సంగ్ 3P8SP సెన్సార్‌తో ఇంటిగ్రేట్ చేయబడిన ఈ కెమెరాల ద్వారా హైడెఫినిషన్ వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.

వన్‌ప్లస్ 3టీ ఫోన్ ఇతర స్పెసిఫికేషన్స్..

వన్‌ప్లస్ 3టీ ఫోన్ ఇతర స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల 1080 పిక్సల్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారండా డిజైన్ చేసిన ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. త్వరలో నౌగట్ అప్‌డేట్ లభించే అవకాశముంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్బీ టైప్-సీ కనెక్టర్, ఫ్లాస్ట్ ఛార్జింగ్ కోసం డాష్ ఛార్జ్ టెక్నాలజీ, డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ (క్యాటగిరి 6), డ్యుయల్ బ్యాండ్ వై-ఫై, వై-ఫై డెరెక్ట్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ 2.0 విత్ టైప్-సీ పోర్ట్, గూగుల్ కాస్ట్, జీపీఎస్, గ్లోనాస్, బ్లుటూత్ 4.2, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్.

వన్‌ప్లస్ 4ను పక్కనబెట్టి

వన్‌ప్లస్ 4ను పక్కనబెట్టి

వాస్తవానికి వన్‌ప్లస్ 3కి సక్సెసర్ వర్షన్‌గా వన్‌ప్లస్ 4 మార్కెట్లోకి రావల్సి ఉంది. అయితే చైనా మూఢనమ్మకాల ప్రకారం 4 అంకె కలిసిరాదట. ఈ నేపథ్యంలో వన్‌ప్లస్ 4ను పక్కనబెట్టి వన్‌ప్లస్ 5 మోడల్ పై కంపెనీ దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్‌తో..

శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్‌తో..

వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ పై రన్ అయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో 8జీబి ర్యామ్ కెపాసిటీతో ఈ ఫోన్‌ను రంగంలోకి దింపనున్నారట. 23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను కూడా ఫోన్‌లో అమర్చనున్నారట.

ఆల్ గ్లాస్ డిజైనింగ్‌తో..

ఆల్ గ్లాస్ డిజైనింగ్‌తో..

వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్ ఆల్ గ్లాస్ డిజైనింగ్‌తో రాబతోందట. 5.5 అంగుళాల డ్యుయల్ కర్వుడ్ ఫుల్ హైడెఫిపిషన్ డిస్‌ప్లే ఫోన్‌కు మరో ప్రధాన ఆకర్షణ కానుందట. ఈ రెండు ప్రధానమైన అంశాలు ఫోన్‌కు ప్రీమియమ్ లుక్‌ను తీసుకువస్తాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

64జీబి, 128జీబి ఇంకా 256జీబి

64జీబి, 128జీబి ఇంకా 256జీబి

వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్ IP68 సర్టిఫికేషన్‌తో రాబోతోంది. ఈ రేటింగ్‌తో వచ్చే ఫోన్ నీరు ఇంకా దుమ్ము ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కోగలదు. యూఎస్టీ టైప్ - సీ పోర్టును కూడా ఈ ఫోన్ లో నిక్షిప్తం చేసే అవకాశముందట. వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ కెపాసిటీ విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్ 64జీబి, 128జీబి ఇంకా 256జీబి వేరియంట్‌లలో లభ్యమయ్యే అవకాశముందట.

Best Mobiles in India

English summary
OnePlus 3T 128GB is just sold out and not discontinued. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X