8జీబి ర్యామ్‌తో వన్‌ప్లస్ 3టీ?

8జీబి ర్యామ్‌తో వస్తున్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ ఇదేనా..?

|

చైనా స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ వన్‌ప్లస్ అతిత్వరలో ఓ శక్తివంతమైన స్మార్ట్‌పోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. OnePlus 3T పేరుతో లాంచ్ కాబోతున్నఈ ఫోన్ 8జీబి ర్యామ్‌తో అలరించే అవకాశముందని తెలుస్తోంది. ఈ రూమర్స్ నిజమైన పక్షంలో 8జీబి ర్యామ్‌తో వస్తున్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా వన్‌ప్లస్ 3టీ గుర్తింపు తెచ్చుకోనుంది.

Read More : రూ.10,000లో బెస్ట్ 3జీబి ర్యామ్ ఫోన్‌లు

వేగవంతమైన క్వాల్కమ్ ప్రాసెసర్..

వేగవంతమైన క్వాల్కమ్ ప్రాసెసర్..

వేగవంతమైన Snapdragon 821 చిప్‌సెట్‌ను ఈ ఫోన్ లో నిక్షిప్తం చేసినట్లు క్వాల్కమ్ కంపెనీ ఇప్పటికే ప్రకటించింది.

ప్రముఖ బ్రాండ్‌లకు వణుకు పుట్టించే విధంగా..

ప్రముఖ బ్రాండ్‌లకు వణుకు పుట్టించే విధంగా..

ప్రముఖ బ్రాండ్‌లకు వణుకు పుట్టించే విధంగా ఈ ఫోన్ ఫీచర్లు ఉండబోతున్నట్లు సమాచారం. రూమర్ మిల్స్ కధనాల ప్రకారం OnePlus 3T ఫోన్ స్పసిఫికేషన్స్ ఈ విధంగా ఉండొచ్చు..

ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ లేటెస్ట్..
 

ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ లేటెస్ట్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్యానల్‌తో కూడిన ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే (పిక్సల్ రిసల్యూషన్ 401 పీపీఐ), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం పై వన్‌ప్లస్ 3టీ ఫోన్ రన్ అయ్యే అవకాశముంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

8జీబి ర్యామ్‌తో సంచలనం కానుందా..?

8జీబి ర్యామ్‌తో సంచలనం కానుందా..?

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 821 చిప్‌సెట్‌తో వస్తోన్న ఈ ఫోన్‌లో శక్తివంతమైన 8జీబి ర్యామ్‌తో పాటు 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం ఉంటుందని సమాచారం. వన్‌ప్లస్ 3టీ ఫోన్ 6జీబి ర్యామ్‌తో వచ్చే అవకాశముందని మరికొన్ని రూమర్స్ చెబుతన్నాయి.

కెమెరా క్వాలిటీ..

కెమెరా క్వాలిటీ..

ఆధునిక ఫీచర్లతో కూడిన 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసే అవకాశముందని తెలుస్తోంది.

ఆధునిక కనెక్టువిటీ ఫీచర్లు..

ఆధునిక కనెక్టువిటీ ఫీచర్లు..

వన్‌ప్లస్ 3 తరహాలోనే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ, వంటి ప్రత్యేకతలను ఈ ఫోన్ కలిగి ఉండే అవకాశముంది.

ధర ఎంత..?

ధర ఎంత..?

డాష్ ఛార్జ్ సపోర్ట్‌తో కూడిన 3000 mAh బ్యాటరీని ఫోన్ లో నిక్షిప్తం చేసినట్లు సమాచారం. ఇండియన్ మార్కెట్లో OnePlus 3T ఫోన్ ధర రూ.32,000 వరకు ఉండొచ్చని సమాచారం. జియో బ్రాడ్‌బ్యాండ్ మూడు నెలలు ఉచితం?

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
OnePlus 3T to feature 8GB of RAM?. Read More in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X