ఆ OPPO ఫోన్ ఎందుకంత బెస్ట్..?

4జీబి ర్యామ్, 4000 mAh బ్యాటరీ, VOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

|

ఒప్పో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఎఫ్3 ప్లస్ (F3 Plus) పేరుతో లాంచ్ అయిన ఈ లీడింగ్ క్లాస్ ప్రొడక్ట్‌ను మరో సెల్ఫీ వండర్‌గా చెప్పుకోవచ్చు. విప్లవాత్మక డ్యుయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.30,990.

 డ్యుయల్ సెల్ఫీ కెమెరా మాత్రమే కాదు

డ్యుయల్ సెల్ఫీ కెమెరా మాత్రమే కాదు

ఒక్క డ్యుయల్ సెల్ఫీ కెమెరా మాత్రమే కాదు.. 6 అంగుళాల క్వాలిటీ రిచ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 4000 mAh బ్యాటరీ, VOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి శక్తివంతమైన ఫీచర్లు కూడా ఎఫ్3 ప్లస్ ఫోన్‌లో ఉన్నాయి. ఈ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఒప్పో స్టోర్‌లతో పాటు ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌‌డీల్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సైట్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

బెస్ట్ క్లాస్ మొబైల్ ఎక్స్‌పీరియన్స్‌

బెస్ట్ క్లాస్ మొబైల్ ఎక్స్‌పీరియన్స్‌

లేటెస్ట్ టెక్నాలజీతో అభివృద్ధి చేయబడిన ఒప్పో ఎఫ్3 ప్లస్ స్మార్ట్‌ఫోన్ బెస్ట్ క్లాస్ మొబైల్ ఎక్స్‌పీరియన్స్‌ను చేరువచేస్తుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ సెల్ఫీ ఎక్స్‌పర్ట్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఇన్‌డెప్త్ రివ్యూను ఇప్పుడు చూద్దాం..

ప్రపంచపు మొట్టమొదటి డ్యుయల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరా

ప్రపంచపు మొట్టమొదటి డ్యుయల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరా

మొబైల్ ఫోటోగ్రఫీ ప్రధానమైన అంశంగా రూపుదిద్దుకున్న ఒప్పో ఎఫ్3 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ప్రపంచపు మొట్టమొదటి డ్యుయల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ ముందు భాగంలో అమర్చిన 16 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు హైక్వాలిటీ సెల్ఫీలను ఆఫర్ చేస్తాయి.

 

గ్రూప్ సెల్ఫీ షాట్స్

గ్రూప్ సెల్ఫీ షాట్స్

8 మెగా పిక్సల్ కెమెరాలో ఏర్పాటు చేసిన 120 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్ ద్వారా మన్నికైన ఫీల్డ్ వ్యూతో పాటు అత్యుత్తమ గ్రూప్ సెల్ఫీ షాట్‌లను చిత్రీకరించుకోవచ్చు. క్యాప్చుర్ చేయబడిన ఫోటోలు 6 అంగుళాల స్ర్కీన్‌లో అత్యత్తమంగా కనిపిస్తాయి.

Beautify 4.0 సాఫ్ట్‌వేర్

Beautify 4.0 సాఫ్ట్‌వేర్

ల్ఫీ ఎక్స్‌పీరియన్స్‌ను తరువాతి లెవల్‌కు తీసుకువెళ్తూ ఒప్పో పరిచయం చేసిన ‘Beautify mode' సెల్ఫీ ఫోటో ట్రెండ్‌నే మార్చేసిందనే చెప్పాలి. ఎఫ్3 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో ఒప్పో పొందుపరిచన Beautify 4.0 సాఫ్ట్‌వేర్ అడ్వాన్సుడ్ ప్రాసెసింగ్ అల్గారిథమ్స్ అలానే 7 లెవల్స్‌తో కూడిన ఇంటెలిజెంట్ బ్యూటిఫికేషన్ వ్యవస్ధను పొందుపరిచారు.

సహజసిద్ధమైన కలర్ టోన్స్‌..

సహజసిద్ధమైన కలర్ టోన్స్‌..

Beautify 4.0 మోడ్ ఫోటోలకు సహజసిద్ధమైన కలర్ టోన్స్‌ను అద్దుతుంది. ఈ మోడ్‌ను ఉపయోగించుకోవటం ద్వారా ఎటువంటి వాతావరణంలోనైనా హైక్వాలిటీ సెల్ఫీలను చిత్రీకరించుకోవచ్చు. ఈ ఫోన్ ద్వారా గ్రూప్ సెల్ఫీలను చిత్రీకరించుకోవాలనుకునే సమయంలో కెమెరా ఇంటర్‌ఫేస్‌లోని 8 మెగా పిక్సల్ సెన్సార్‌ను యాక్టివేట్ చేసుకోవటం ద్వారా గ్రూప్ సెల్ఫీలకు అవసరమైన ఎక్స్‌ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో ఆన్ అవుతుంది. 6 పిక్సల్ లెన్స్‌తో వస్తోన్న ఈ 8మెగా పిక్సల్ కెమెరా ఫ్రేమ్ లోని సబ్జెక్ట్ మొత్తాన్ని కవర్ చేయగలదు.

 palm shutter ఫీచర్‌

palm shutter ఫీచర్‌

ఒప్పో ఎఫ్3 ప్లస్ కెమెరా యాప్‌లోని palm shutter ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకున్నట్లయితే సెల్ఫీ‌లను చిత్రీకరించేకునేందుకు ప్రతిసారి షట్టర్ బటన్ పై క్లిక్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్, మీ చేయిని పైకి లేపితే చాలు సెల్ఫీ దానంతటకదే క్యాప్చుర్ కాబడుతుంది.

 

ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు 16 ఎంపీ కెమెరా

ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు 16 ఎంపీ కెమెరా

ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 16 మెగా పిక్సల్ కెమెరాలో హైక్వాలిటీ సోనీ IMX398 సెన్సాన్‌ను నిక్షిప్తం చేయటం జరిగింది. ఈ కెమెరాలో యాడ్ చేసిన ఎక్స్‌ట్రా వైడ్ f/1.7 అపెర్చుర్, డ్యుయల్ PDAF వంటి అదనపు ఫీచర్లు క్లియర్ కట్ ఫోటోగ్రఫీని ఆఫర్ చేస్తాయి.

 

'Expert Mode'

'Expert Mode'

ఒప్పో ఎఫ్3 ప్లస్ కెమెరా యాప్‌లోని 'Expert Mode'ను ఎనేబుల్ చేసుకున్నట్లయితే ఫోటోగ్రఫీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే వీలుంటుంది. మీరు చిత్రీకరించే ఫోటోలకు సంబధించి షట్టర్ స్పీడ్, ఫోకస్, వైట్ బ్యాలన్స్ ఇంకా ఐఎస్ఓలు ఎంతెంత లెవల్స్‌లో ఉండాలి అనేదాని పై ఈ ఎక్స్‌పర్ట్ మోడ్ స్పష్టతనిస్తుంది.

 

‘Ultra HD' మోడ్

‘Ultra HD' మోడ్

మరో మోడ్ ‘Ultra HD' ద్వారా 50 మెగా పిక్సల్ అల్ట్రా హై డెఫినిషన్ ఫోటోలను జనరేట్ చేసుకునే వీలుంటుంది. అంతేకాకుండా.. ముందుకూ వెనక్కూ కదిలేలా ప్రత్యేకమైన GIFలను కూడా Ultra HD మోడ్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. ఒప్పో

ఎఫ్3 ప్లస్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 16 మెగా పిక్సల్ కెమెరా ద్వారా 4కే రిసల్యూషన్ క్వాలిటీ వీడియోలు కూడా సాధ్యమవుతాయి.

 

వంతమైన 4,000mAh బ్యాటరీ

వంతమైన 4,000mAh బ్యాటరీ

ఒప్పో ఎఫ్3 ప్లస్ శక్తివంతమైన 4,000mAh బ్యాటరీతో వస్తోంది. సింగిల్ ఛార్జ్ పై రోజు మొత్తం వీడియోలు చూడొచ్చు, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయవచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, మ్యూజిక్‌ను కూడా స్ట్రీమ్ చేసుకోవచ్చు. VOOC టెక్నాలజీతో వస్తోన్న ఈ బ్యాటరీని 30 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.

ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యుమినియమ్‌‌తో ఫోన్ నిర్మాణం..

ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యుమినియమ్‌‌తో ఫోన్ నిర్మాణం..

డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి ఒప్పో ఎఫ్3 ప్లస్ ఫోన్ 7.53 మిల్లీమీటర్ల మందంతో కూడిన స్లీక్ బాడీని కలిగి ఉంటుంది. ఫోన్ బరువు కేవలం 185 గ్రాములు. మెటల్ యునిబాడీ డిజైన్‌తో వస్తోన్న ఈ ఫోన్‌ నిర్మాణంలో భాగంగా ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యుమినియమ్‌ను ఉపయోగించారు. ఫోన్ డిస్ ప్లే పై వేసిన 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ రక్షణ కవచంలా నిలుస్తుంది.

 

6 అంగుళాల మల్టీ టచ్ హై-డెఫినిషన్ డిస్‌ప్లే

6 అంగుళాల మల్టీ టచ్ హై-డెఫినిషన్ డిస్‌ప్లే

ఒప్పో ఎఫ్3 ప్లస్ ఫోన్ 6 అంగుళాల మల్టీ టచ్ హై-డెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. ఈ డిస్‌ప్లే ఆఫర్ చేసే బ్రైట్‌నెస్, వ్యూవింగ్ యాంగిల్స్ ఇంకా టచ్ రెస్పాన్సివ్ సిస్టమ్ ఆకట్టుకుంటుంది.

 Eye పొటెక్షన్ మోడ్

Eye పొటెక్షన్ మోడ్

ఒప్పో ఎఫ్3 ప్లస్ డిస్‌ప్లే పై 3డీ గేమింగ్ ఉత్కంఠకులోను చేస్తుంది. Eye పొటెక్షన్ మోడ్ కళ్లపై ఒత్తిడి పడకుండా చూస్తుంది.

అంతరాయంలేని పనితీరు కోసం  4జీ ర్యామ్

అంతరాయంలేని పనితీరు కోసం 4జీ ర్యామ్

కంప్యూటింగ్ ఇంకా మల్టీటాస్కింగ్ విషయానికి వచ్చేసరికి ఒప్పో ఎఫ్3 ప్లస్ ఫోన్ Qualcomm's Snapdragon 653 SoC పై రన్ అవుతుంది. 4జీ ర్యామ్ అంతరాయంలేని పనితీరును ఆఫర్ చేస్తుంది.

64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ..

64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ..

స్టోరేజ్ కెపాసిటీ విషయానికి వచ్చేసరికి ఎఫ్3 ప్లస్ ఫోన్ 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం. 4జీ వోల్ట్ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే ఈ ఫోన్‌లో కాల్ క్వాలిటీ నాణ్యమైన ప్రమాణాలను కలిగి ఉంటుంది.

 Color OS V3.0 యూజర్ ఇంటర్‌ఫేస్

Color OS V3.0 యూజర్ ఇంటర్‌ఫేస్

ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన Color OS V3.0 కస్టమ్ యూజర్ ఇంటర్‌ఫేస్ యూజర్‌కు కొత్త మొబైలింగ్ అనుభూతులను చేరువచేస్తుంది.

ఫింగర్‌ప్రింట్ స్కానర్

ఫింగర్‌ప్రింట్ స్కానర్

ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్ ఒప్పో ఎఫ్3 ప్లస్ ఫోన్‌కు అదనపు సెక్యూరిటీగా నిలుస్తుంది. హోమ్ బటన్‌కు అనుసంధానించబడిన ఈ సెన్సార్ ద్వారా ఫోన్‌ను కేవలం 0.2 సెకన్ల వ్యవధిలో అన్‌లాక్ చేయవచ్చు. ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కేవలం ఫోన్ అన్‌లాకింగ్‌కు మాత్రమే కాకుండా అనేకమైన పనులకు కస్టమైజ్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
OPPO F3 Plus is a no compromise flagship smartphone at an affordable price. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X