మీ ఫోన్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే..?

మీ స్మార్ట్‌ఫోన్ హ్యాకర్ల చేతికి చిక్కకుండా, ఎప్పటికప్పుడు సురక్షితంగా ఉంచుకునేందుకు పలు ముఖ్యమైన సూచనలు..

|

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ హ్యాకింగ్ అనేది సర్వ సాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్‌లు హ్యాకింగ్ ప్రోన్‌గా మారిపోయాయి. మోస్ట్ సెక్యూర్డ్ ఫీచర్లతో, ఈ మధ్య మార్కెట్లో లాంచ్ అయిన గూగుల్ పిక్సల్ ఫోన్ ను సైతం చైనా బృందం 60 సెకన్లలో హ్యాక్ చేసి చూపించింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి సెక్యూరిటీ స్థాయిని మరింతగా పెంచేందుకు చాలానే ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. మీ స్మార్ట్‌ఫోన్ ఎప్పటికప్పుడు సురక్షితంగా ఉండాలంటే వైరస్‌ల నుంచి అప్రమత్తంగా ఉండాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. మీ స్మార్ట్‌ఫోన్ హ్యాకర్ల చేతికి చిక్కకుండా, ఎప్పటికప్పుడు సురక్షితంగా ఉంచుకునేందుకు పలు ముఖ్యమైన సూచనలు..

Read More : స్మార్ట్‌ఫోన్ కంటే ఆ నోకియా ఫోనే బెస్ట్..?

స్టెప్ 1

స్టెప్ 1

మీ ఫోన్‌కు ఓపెన్ చేసేందకు పాస్‌వర్డ్‌ లాక్‌ను సెట్ చేసుకోండి. లాక్ చేయవల్సిన ప్రతిసారీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయవవల్సి వచ్చినప్పటికి, మీ ఫోన్ మాత్రం సురక్షితంగా ఉంటుంది.

స్టెప్ 2

స్టెప్ 2

మీ ఫోన్‌లోని ఆటోమెటిక్ నెట్‌వర్క్ కనెక్ట్ ఆప్షన్‌ను డిసేబుల్ ఎప్పటికప్పుడు చేసి ఉంచండి. ఇలా చేయటం వల్ల మీ ఫోన్ ఎక్కడపడితే అక్కడ ఇతర డివైజ్ లతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉండదు.

స్టెప్ 3

స్టెప్ 3

మీ ఫోన్‌లోని డేటా ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసకోవటం ద్వారా డేటాకు పూర్తిస్థాయి రక్షణ లభిస్తుంది. ఈ మధ్య లాంచ్ అవతోన్న ఆండ్రాయిడ్ పోన్ లలో ఎన్‌క్రిప్షన్ ఆప్షన్ ను డీఫాల్ట్ గానే అందిస్తున్నారు.

స్టెప్ 4
 

స్టెప్ 4

మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇంటర్నెట్‌లో బ్రౌజర్ చేస్తున్నారా..? అయితే "https"తో ప్రారంభమయ్యే యూఆర్ఎల్స్‌ను మాత్రమే ఎంపిక చేసుకోండి. మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలోకి ప్రవేశించినట్లయితే యూఆర్ఎల్స్ విషయంలో అప్రమత్తత వహించండి. మీకు తెలియని అనుమానస్పద యూఆర్ఎల్స్‌‍ను ఏ మాత్రం క్లిక్ చేయవద్దు. ఒకవేళ ఆ యూఆర్ఎల్ మీ మిత్రుని ద్వారా వచ్చినట్లయితే ఒకసారి అతనిని అడిగి విషయం ఏంటో తెలుసుకోండి.

స్టెప్ 5

స్టెప్ 5

మీకు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈమెయిల్స్ లేదా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లతో జాగ్రత్తగా ఉండండి. మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తంగా ఉండటం మంచింది. అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమే ఎంపిక చేసుకోండి. మీరు డౌన్‌లోడ్ చేసుకునే అప్లికేషన్‌లకు సంబంధించి ప్రైవసీ సెట్టింగ్‌లను ముందుగా నిశితంగా పరిశీలించుకుని ఆ తరువాత ప్రొసీడ్ అవ్వండి.

Best Mobiles in India

English summary
Protect Your Smartphone From Hacking. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X