ఇక తక్కువ బడ్జెట్ ఫోన్‌లలోనూ హైస్పీడ్ ఇంటర్నెట్, ఫాస్ట్ ఛార్జింగ్, 4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్

14nm తయారీ ప్రాసెస్ పై, ఈ కొత్త చిప్‌సెట్‌లను బిల్ట్ చేసినట్లు క్వాల్కమ్ చెబుతోంది.

|

ప్రముఖ మొబైల్ ప్రాసెసర్‌ల తయారీ కంపెనీ క్వాల్కమ్ (Qualcomm), తన తరువాతి జనరేషన్ మొబైల్ చిప్‌సెట్‌లను మార్కెట్లో అనౌన్స్ చేసింది.

Read More : రూ.4,199కే ఆండ్రాయిడ్ నౌగట్ ఫోన్, 4జీ వోల్ట్ సపోర్ట్ కూడా

స్నాప్‌డ్రాగన్ 660, స్నాప్‌డ్రాగన్ 630

స్నాప్‌డ్రాగన్ 660, స్నాప్‌డ్రాగన్ 630

స్నాప్‌డ్రాగన్ 660 (Snapdragon 660), స్నాప్‌డ్రాగన్ 630 (Snapdragon 630) మోడల్స్‌లో అనౌన్స్ కాబడిన ఈ మొబైల్ ప్లాట్‌ఫామ్స్, ఇప్పటికే మార్కెట్లో అందబాటులో ఉన్న స్నాప్‌డ్రాగన్ 653, 625 మొబైల్ ప్లాట్‌ఫామ్‌లకు అప్‌గ్రేడెడ్ మోడల్స్‌గా భావించవచ్చు.

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లలోనూ ..

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లలోనూ ..

ఈ కొత్త మొబైల్ ఫ్లాట్ ఫామ్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లలోనూ వేగవంతమైన ఎల్టీఈ కనెక్టువిటీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్, మెరుగైన బ్యాటరీ బ్యాకప్ అలానే 4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్‌ను ఆఫర్ చేస్తాయని క్వాల్కమ్ చెబుతోంది.

14nm తయారీ ప్రాసెస్ పై..

14nm తయారీ ప్రాసెస్ పై..

14nm తయారీ ప్రాసెస్ పై, ఈ కొత్త చిప్‌సెట్‌లను బిల్ట్ చేసినట్లు క్వాల్కమ్ వెల్లడించింది. ఈ కొత్త మొబైల్ ప్లాట్‌ఫామ్స్ వినియోగం సమయంలో 50 శాతం నుంచి 75 శాతం వరకు తక్కువ పవర్‌ను ఖర్చుచేస్తాయని క్వాల్కమ్ తెలిపింది.

X12 LTE మోడెమ్..

X12 LTE మోడెమ్..

నిన్న మొన్నటివ వరకు Snapdragon 820 SoCలకు మాత్రమే పరిమితమైన X12 LTE మోడెమ్, క్వాల్కమ్ లాంచ్ చేయబోతోన్న కొత్త స్నాప్‌డ్రాగన్ 660, 630 మొబైల్ ప్లాట్‌ఫామ్‌లలో కనిపించబోతోంది.

 600 Mbps వరకు డేటా స్పీడ్‌లను అందుకోగలుగుతుంది

600 Mbps వరకు డేటా స్పీడ్‌లను అందుకోగలుగుతుంది

X12 LTE మోడెమ్ 600 Mbps వరకు డేటా స్పీడ్‌లను అందుకోగలుగుతుంది. స్నాప్‌డ్రాగన్ 660 మొబైల్ ప్లాట్‌ఫామ్ బ్లుటూత్ 5.0, 2 x 2 MIMO Wi-Fi వంటి విప్లవాత్మక ఫీచర్లను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 630 మొబైల్ ప్లాట్‌ఫామ్‌లో బ్లుటూత్ 5.0 మాత్రమే ఉంటుంది.

 20శాతం వేగవంతమైన క్లాక్ స్పీడ్‌

20శాతం వేగవంతమైన క్లాక్ స్పీడ్‌

స్నాప్‌డ్రాగన్ 653 మొబైల్ ప్లాట్‌ఫామ్‌తో పోలిస్తే స్నాప్‌డ్రాగన్ 660 మొబైల్ ప్లాట్‌ఫామ్ 20శాతం వేగవంతమైన క్లాక్ స్పీడ్‌లను ఆఫర్ చేస్తుంది.

క్విక్ ఛార్జ్ 4.0 ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో..

క్విక్ ఛార్జ్ 4.0 ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో..

స్నాప్‌డ్రాగన్ 660 ప్లాట్‌ఫామ్‌లో octa-core Kryo 260 CPUతో పాటు Adreno 512 GPUలు ఉంటాయి. స్నాప్‌డ్రాగన్ 630 ప్లాట్‌ఫామ్‌లో ఆక్టా కోర్ ఏ53 సీపీయూతో పాటు Adreno 508 GPUలు ఉంటాయి. క్వాల్కమ్ ఆఫర్ చేస్తున్న క్విక్ ఛార్జ్ 4.0 ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా ఇవి సపోర్ట్ చేస్తాయి.

 

 

Best Mobiles in India

English summary
Qualcomm Snapdragon 660 and Snapdragon 630 launched for mid-range smartphones. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X