మార్కెట్‌ని షేక్ చేయడానికి రెడ్‌మి నోట్ 4 బ్లాక్ వర్షన్ దూసుకొస్తోంది

ఇండియా మొబైల్ మార్కెట్‌ని షేక్ చేయడానికి షియోమి రెడీ అయింది. రెడ్‌మి నోట్ 4తో సంచలనం సృష్టించిన ఈ కంపెనీ ఇప్పుడు అదే ఫోన్‌ని బ్లాక్ వర్షన్‌లో తీసుకొస్తోంది.

By Hazarath
|

ఇండియా మొబైల్ మార్కెట్‌ని షేక్ చేయడానికి షియోమి రెడీ అయింది. రెడ్‌మి నోట్ 4తో సంచలనం సృష్టించిన ఈ కంపెనీ ఇప్పుడు అదే ఫోన్‌ని బ్లాక్ వర్షన్‌లో తీసుకొస్తోంది. ఈ ఫోన్ ఇప్పటికే గోల్డ్ , గ్రే డార్క్ గ్రే కలర్స్‌లో లభ్యమవుతోంది. ఈ ఫోన్ ధర మార్కెట్లో రూ. 9999గా ఉంది. అయితే కంపెనీ ఇదే ధరతో బ్లాక్ వర్షన్ ఫోన్‌ని మార్చి 1 నుంచి మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ బ్లాక్ వర్షన్ ఫోన్ ఇండియన్ మార్కెట్‌ని షేక్ చేస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. రెడ్‌మి నోట్ 4 ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.

 

వివో నుంచి 3జిబి ర్యామ్ ఫోన్ రిలీజయింది

రెడ్మీ నోట్ 4 స్పెక్స్

రెడ్మీ నోట్ 4 స్పెక్స్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 2.0GHz ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కెపాసిటీ, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం (నౌగట్ అప్‌డేట్). 4100 mAh బ్యాటరీ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ విత్ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

డిజైనింగ్ పరంగా చూస్తే ..

డిజైనింగ్ పరంగా చూస్తే ..

డిజైనింగ్ పరంగా చూస్తే రెడ్మీ నోట్ 3, రెడ్మీ నోట్ 4లు మొదటి చూపులో ఒకేలా అనిపిస్తాయి. నోట్ 3 తరహాలోనే నోట్ 4 కూడా 5.5 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అదనంగా ఈ ఫోన్ డిస్‌ప్లే పై 2.5డి కర్వుడ్ గ్లాస్‌ను షియోమీ పొందుపరిచింది. రెడ్మీ నోట్ 3లో కర్వుడ్ గ్లాస్ ఉండదు. నోట్3 మాదిరిగానే నోట్ 4 కూడా సమానమైన స్ర్కీన్ రిసల్యూషన్ (1080*1920)ను కలిగి ఉంది. పీపీఐ (పిక్సల్స్ పర్ ఇంచ్) విషయానికి వచ్చేసరికి నోట్ 4 ఫోన్ 403 పీపీఐను కలిగి ఉంటుంది.

క్యాండీ బార్ డిజైన్‌తో..
 

క్యాండీ బార్ డిజైన్‌తో..

రెడ్మీ నోట్ 4 ఫోన్ క్యాండీ బార్ డిజైన్‌తో వస్తోంది. యునిమెటల్ బాడీ డిజైన్‌తో ఇటీవల మార్కెట్లోకి వస్తోన్న చాలా వరకు ఫోన్‌లలో ఈ తరహా డిజైన్‌ను మీరు చూడొచ్చు. రెడ్మీ నోట్ 4 ఫోన్ అంచులు మరింత గుండ్రంగా అనిపిస్తాయి. బరువు విషయానికి వచ్చేసరికి రెడ్మీ నోట్ 4 ఫోన్ ను 174 గ్రాముల బరువుతో తీర్చిదిద్దారు.

హర్డ్‌వేర్ బటన్స్ వచ్చేసరికి

హర్డ్‌వేర్ బటన్స్ వచ్చేసరికి

హర్డ్‌వేర్ బటన్స్ వచ్చేసరికి వాల్యుమ్ రాకర్స్ అలానే పవర్ బటన్‌లను ఫోన్‌కు కుడి వైపు ఏర్పాటు చేసారు. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కార్డ్ స్లాట్‌ను ఫోన్‌కు ఎడమ వైపు ఏర్పాటు చేయటం జరిగింది. ఫోన్ క్రింద భాగంలో రెండు స్పీకర్స్‌తో పాటు ఒక మైక్రోయూఎస్బీ పోర్టును అమర్చటం జరిగింది. టీవీ, ఏసీ వంటి డివైస్‌లకు ఈ ఫోన్‌ను రిమోట్ కంట్రోలర్‌లా ఉపయోగించుకునేందుకు వీలుగా పై భాగంలో IR blasterను ఏర్పాటు చేసారు. 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఫోన్ పై భాగంలోనే ఉంటుంది. ఇదే సమయలో ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఫోన్ వెనుక భాగంలో 13 మెగా పిక్సల్ కెమెరా మాడ్యుల్ క్రింద అమర్చారు.
today/slider-pf83826-016001.html

Qualcomm Snapdragon 625

Qualcomm Snapdragon 625

ఆక్టా కోర్ ప్రాసెసర్ Qualcomm Snapdragon 625 ఆక్టా కోర్ ప్రాసెసర్ పై ఫోన్ రన్ అవుతుంది. 14nm తయారీ ప్రాసెస్ ఆధారంగా ఈ చిప్‌సెట్‌ను అభివృద్ది చేసారు. ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన లెనోవో పీ2 స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఇదే తరహా చిప్‌సెట్‌ను ఉపయోగించటం జరిగింది. Adreno 506 GPU ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని చూసుకుంటుంది.

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా

రెడ్మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. f/2.0 aperture, డ్యుయల్ టోన్ ఫ్లాష్ లైట్ వంటి ఫీచర్లను ఈ కెమెరా కలిగి ఉంది. నోట్ 3 ప్రైమరీ కెమెరాతో పోలిస్తే నోట్ 4 కెమెరా బాగున్నప్పటికి కాంట్రాస్ట్ లెవల్స్ అంతగా గొప్పగా లేవు. డేలైట్ కండీషన్ లో ఈ కెమెరాతో చిత్రీకరించిన పలు ఫోటోలు ఓవర్ గా ఎక్స్ పోజ్ అవ్వటమే ఇందుకు కారణం. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లోపించటం, తక్కువ స్ధాయిలో లైట్నిగ్ పనితీరు వంటి అంశాలు రెడ్మీ నోట్ 4 కెమెరాను ప్రధాన అవరోధంగా నిలిచాయి.

4100mAh బ్యాటరీ

4100mAh బ్యాటరీ

రెడ్మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్ 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. మంచి లైటింగ్ కండీషన్‌లలో ఈ కెమెరా అద్బుతంగా పనిచేస్తోంది. ఇవి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో పోస్ట్ చేయడానికి చాలా బాగుంటాయి. బ్యాటరీ కెపాసిటీ విషయానికి వచ్చేసరికి రెడ్మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్, 4100mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తోంది. జాగ్రత్తగా వాడుకుంటే రెండు రోజుల పాటు ఈ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఫోన్ హెవీగా వాడటం మొదలు పెడితే ఒక్క రోజులోనే బ్యాటరీ మొత్తం దిగిపోతుంది.

ధర

ధర

2జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999. 3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999.

Best Mobiles in India

English summary
Redmi Note 4 Black Version hit Indian Markets from 1st March 17 read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X