గెలాక్సీ S8పై శాంసంగ్ సంచలన నిర్ణయం

శాంసంగ్ ఎస్8 విడుదలపై కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది.

By Hazarath
|

గెలాక్సీ 7 పేళుళ్ల రూపంలో శాంసంగ్ కంపెనీకి కోలుకోలేని దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ దెబ్బ నుంచి కోలుకోక పోగా భారీ నష్టాలతో కంపెనీ ఒక్కసారిగా కుదేలైంది. గెలాక్సీ 7 వల్ల శాంసంగ్ కంపెనీకి దాదాపు రూ.30.6 వేలకోట్లకు పైనే నష్టాలు వచ్చాయంటే నష్టం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి కంపెనీ శాంసంగ్ ఎస్8ని మార్కెట్లోకి తీసుకురావాలని ఎప్పటినుంచో అనుకుంటోంది. అయితే అది ఇప్పట్లో కార్యరూపం దాల్చేలా లేదు.

బ్రాండెడ్ ఫోన్లపై రూ. 10 వేల డిస్కౌంట్

కొత్తఫోన్‌ను విడుదల చేయడంలేదని

కొత్తఫోన్‌ను విడుదల చేయడంలేదని

వచ్చే నెల బార్సిలోనాలో జరిగే వరల్డ్ మొబైల్ కాంగ్రెస్‌లో శాంసంగ్ ఎస్8ని విడుదల చేస్తుందని అందరూ ఎదురూచూస్తున్నారు. అయితే తాము ఇంతకు ముందులాగా ఎండబ్ల్యూసీలో కొత్తఫోన్‌ను విడుదల చేయడంలేదని దక్షిణ కొరియాకి చెందిన ఈ కంపెనీ చీఫ్ కోడాంగ్ జిన్ వెల్లడించారు.

Image credit: SamMobile

మార్చి 29న అఫిషియల్ గా లాంచ్

మార్చి 29న అఫిషియల్ గా లాంచ్

రూమర్ల ప్రకారం ఈ ఫోన్ మార్చి 29న అఫిషియల్ గా లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏప్రిల్ 21 నుంచి గో ఆన్ సేల్ కు ఈ ఫోన్ వెళుతుందని రూమర్లు తెలియజేస్తున్నాయి.

Image credit: Veniamin Geskin

2 సైజుల్లో

2 సైజుల్లో

రానున్న ఈ ఫోన్ 2 సైజుల్లో రానుందని రూమర్లను బట్టి తెలుస్తోంది. 5.7-inch and 6.2-inch డిస్ ప్లేలతో ఈ ఫోన్ అభిమానులను అలరించనుందని తెలుస్తోంది. మరికొన్ని రూమర్ల ప్రకారం 5-inch and 6-inch స్క్రీన్ సైజుల్లో రానుందని తెలుస్తోంది.

డ్యూయెల్ ఎడ్జ్ కర్వడ్ డిస్ ప్లే

డ్యూయెల్ ఎడ్జ్ కర్వడ్ డిస్ ప్లే

ఈ ఫోన్లు డ్యూయెల్ ఎడ్జ్ కర్వడ్ డిస్ ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది. ఫ్లాట్ స్క్రీన్ కి శాంసంగ్ బైబై చెప్పినట్లు కూడా రూమర్లను బట్టి తెలుస్తోంది. దీంతో పాటు కెమెరాను ఎస్ 7లో ఉన్నట్లుగానే ఎస్8లో కూడా ఉండనుంది.

64 జిబి ఇన్ బుల్ట్ స్టోరేజ్

64 జిబి ఇన్ బుల్ట్ స్టోరేజ్

రానున్న ఈ ఫోన్లు 64 జిబి ఇన్ బుల్ట్ స్టోరేజ్ తో పాటు మైక్రోఎస్ డీ కార్డు ద్వారా 256 జిబి వరకు విస్తరించుకునేలా రానుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ బ్యాక్ ఉండనుంది.

మినీ ఆండ్రాయిడ్ కంప్యూటర్

మినీ ఆండ్రాయిడ్ కంప్యూటర్

దీంతో పాటు కొత్త ఫీచర్ మినీ ఆండ్రాయిడ్ కంప్యూటర్ మాదిరిగా రానుంది. అయితే దీని ధరపై కంపెనీ ఇంకా ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు.

Best Mobiles in India

English summary
Samsung Confirms Galaxy S8 Release Date Delay read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X