సామ్‌సంగ్ 4జీ ఫోన్‌ల పై తగ్గింపు, త్వరపడండి

గెలాక్సీ ఆన్5 ప్రో, ఆన్7 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు ప్రత్యేకమైన ఎస్ బైక్ మోడ్ ఫీచర్‌తో వస్తున్నాయి.

|

కొద్ది నెలల క్రితం మార్కెట్లో లాంచ్ అయిన గెలాక్సీ ఆన్5 ప్రో, ఆన్7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ల పై సామ్‌సంగ్ రూ.1200 ధర తగ్గింపును ప్రకటించింది.

సామ్‌సంగ్ 4జీ ఫోన్‌ల పై తగ్గింపు, త్వరపడండి

Read More : రూ.3,799కే 4G VoLTE ఫోన్, 16జీబి స్టోరేజ్ కూడా..

తాజా, ధర తగ్గింపులో భాగంగా గెలాక్సీ ఆన్5 ప్రో రూ.7,990కే మీ సొంతమవుతుంది. అంతకుముదు ఈ ఫోన్ ధర రూ.9,190గా ఉంది. మరో ఫోన్ గెలాక్సీ ఆన్7 ప్రో రూ.9,990కే మీ సొంతమవుతుంది. అంతకుముందు ఈ ఫోన్ ధర రూ.11,190గా ఉంది. Amazon Indiaలో ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నాయి.

Galaxy On5 Pro స్పెసిఫికేషన్స్

Galaxy On5 Pro స్పెసిఫికేషన్స్

5 అంగుళాల 720 పిక్సల్ రిసల్యూషన్ హైడెఫినిష్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ఎక్సినోస్ 3475 ప్రాసెసర్, మాలీ-టీ720 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, అల్ట్రా డేటా సేవింగ్ మోడ్, ఎస్ బైక్ మోడ్.

Galaxy On7 Pro స్పెసిఫికేషన్స్

Galaxy On7 Pro స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల 720 పిక్సల్ రిసల్యూషన్ హైడెఫినిష్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, అల్ట్రా డేటా సేవింగ్ మోడ్, ఎస్ బైక్ మోడ్.

 

 

 ఎస్ బైక్ మోడ్
 

ఎస్ బైక్ మోడ్

గెలాక్సీ ఆన్5 ప్రో, ఆన్7 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు ప్రత్యేకమైన ఎస్ బైక్ మోడ్ ఫీచర్‌తో వస్తోంది. డివైస్‌లో ఈ మోడ్‌‌ను ఎనేబుల్ చేసి బైక్ నడుపుతున్నప్పుడు మనకు ఏదైనా కాల్ వచ్చినట్లయితే, మన స్మార్ట్‌ఫోన్ ఆటోమెటిక్‌గా కాల్ చేసిన వారికి తర్వాత కాల్ చేయండి అనే మెసేజ్‌ను పంపుతుంది. దీంతో రైడర్స్ మాటిమాటికీ తమ మొబైల్ చూసుకోకుండా డ్రైవింగ్‌పైనే దృష్టి సారించవచ్చు. అదే ఎమర్జెన్సీ అయితే కాల్ చేసిన వారు వారి స్మార్ట్‌ఫోన్‌లో ఒకటి అంకెను ప్రెస్ చేసినట్లయితే అర్జెంట్ కాల్ అని డ్రైవింగ్ చేస్తున్న వారి స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. అప్పుడు బండిని పక్కాగా పార్క్ చేసి కాల్ రిసీవ్ చేసుకోవచ్చు.

 అల్ట్రా డేటా సేవింగ్ మోడ్

అల్ట్రా డేటా సేవింగ్ మోడ్

గెలాక్సీ ఆన్5 ప్రో, ఆన్7 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు ప్రత్యేకమైన అల్ట్రా సేవింగ్ మోడ్ ఆప్షన్‌తో వస్తున్నాయి. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ద్వారా యూజర్లు 50 శాతం వరకు మొబైల్ డేటాను ఆదా చేసుకోవచ్చు. ఫీచర్ ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌‍లో రన్ అయ్యే అనవసరమైన యాప్స్‌ను అల్ట్రా సేవింగ్ మోడ్ ఆప్షన్‌ ఎప్పటికప్పుడు బ్లాక్ చేస్తూ డేటాను ఆదా చేస్తుంటుంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy On5 Pro, Galaxy On7 Pro gets a price cut of Rs 1,200. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X