రెండు సామ్‌సంగ్ ఫోన్‌ల పై ఏకంగా రూ.5,000 తగ్గింపు

|

రెండు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల పై సామ్‌సంగ్ భారీ ధర తగ్గింపును ప్రకటించింది. గెలాక్సీ నోట్ 7 విడుదల నేపథ్యంలో గెలాక్సీ ఎస్7, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్‌ల పై ఏకంగా రూ.5,000 తగ్గింపును సామ్‌సంగ్ ప్రకటించింది. విడుదల సమయంలో గెలాక్సీ ఎస్7 రూ.48,400గా ఉంది. తాజా ధర తగ్గింపులో భాగంగా రూ.43,400కే లభ్యమవుతోంది. విడుదల సమయంలో గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ధర రూ.55,900గా ఉంది. తాజా ధర తగ్గింపులో భాగంగా రూ.50,900కే లభ్యమవుతోంది. Flipkart, Amazon వంటి వెబ్‌సైట్‌లు ధర తగ్గింపు రేట్లకే ఈ ఫోన్ లను విక్రయించటం మొదలు పెట్టేసాయి.

 లేటెస్ట్ సామ్‌సంగ్ ఫోన్ పై ఏకంగా రూ.5,000 తగ్గింపు

Read More : మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ సెక్యూరిటీ కోసం గూగుల్ చెబుతోన్న ముఖ్యమైన టిప్స్

గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్ ఫోన్‌లను సిమిలర్ హార్డ్‌వేర్ స్పెక్స్‌తో సామ్‌సంగ్ విడుదల చేసింది. డిస్‌ప్లే ఇంకా బ్యాటరీ విషయంలో మాత్రమే స్వల్ప మార్పులు ఉంటాయి. ఎస్ 7 వేరియంట్ 5.1 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుండగా, ఎస్7 ఎడ్జ్ 5.5 అంగుళాల డిస్‌ప్లేతో వస్తోంది. బ్యాటరీ విషయంలోనూ అంతే గెలాక్సీ ఎస్7 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుండగా, ఎస్ 7 ఎడ్జ్ 3600 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.

 లేటెస్ట్ సామ్‌సంగ్ ఫోన్ పై ఏకంగా రూ.5,000 తగ్గింపు

Read More : ఈ వారం విడుదలైన కొత్త ఫోన్‌లు (టాప్ - 10)

క్వాడ్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేలను ఈ రెండు ఫోన్‌లలో ఏర్పాటు చేసారు, రిసల్యూషన్ సామర్థ్యం (2560 x 1440పిక్సల్స్). ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టంతో వస్తున్న ఈ ఫోన్‌లు 32జీబి అలానే 64జీబి ఇంటర్నల్ మెమరీ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటాయి. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్‌లకు సంబంధించిన మెమరీని 200జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని సామ్‌సంగ్ కల్పిస్తోంది. 4జీబి ర్యామ్, డ్యుయల్ పిక్సల్ 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ర్యామ్ వంటి ప్రత్యేకతలు ఆకట్టుకుంటాయి. గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు క్రింది స్లైడర్‌‌లో చూడొచ్చు...

డిస్‌ప్లే

డిస్‌ప్లే

5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ కర్వుడ్ ఎడ్జ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 2560×1440పిక్సల్స్), 534 పీపీఐ.

 ప్రాసెసర్

ప్రాసెసర్

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ రెండు ప్రాసెసర్ వేరియంట్‌లలో లభ్యంకానుంది. మొదటి వేరియంట్ స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్ కాగా రెండవ వేరియంట్ ఆక్టా కోర్ ఎక్సినోస్ 8 ఆక్టా 8890 ప్రాసెసర్,

హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ స్లాట్‌

హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ స్లాట్‌

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఫోన్‌లో హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ స్లాట్‌లను పొందుపరిచారు. 4జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ ఆప్షన్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరినీ 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

డ్యుయల్ పిక్సల్ కెమెరా
 

డ్యుయల్ పిక్సల్ కెమెరా

డ్యుయల్ పిక్సల్ 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్ 1.7 అపెర్చర్, స్మార్ట్ ఓఐఎస్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

ఐపీ68 రేటింగ్‌

ఐపీ68 రేటింగ్‌

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఐపీ68 రేటింగ్‌తో వస్తోంది. వాటర్ ఇంకా డస్ట్ ప్రమాదాలను గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ సమర్థవంతంగా తట్టుకోగలదు.

ఆపరేటింగ్ సిస్టం

ఆపరేటింగ్ సిస్టం

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. యాప్ పర్మిషన్, గూగుల్ నౌ ఆన్ టాప్, డోజ్ మోడ్, ర్యామ్ మేనేజర్, ఆటో బ్యాకప్, బ్యాటరీ లైఫ్, ఆటో హ్యాండ్లింగ్ యాప్స్, ఆండ్రాయిడ్ పే వంటి ప్రత్యేక ఫీచర్లను ఎస్7 ఎడ్జ్ అందిస్తుంది.

Always-On Display

Always-On Display

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఫోన్ కు "Always-On Display" ఫీచర్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ ఫీచర్ ఫోన్ స్ర్కీన్ పై ఎఫ్పుడు ఆన్ అయ్యే ఉంటుంది. క్లాక్, నోటిఫికేషన్స్, క్యాలెండర్‌లను ఈ ఫీచర్ డిస్‌ప్లే సూచిస్తుంది. తద్వారా చీటికి మాటికి పోన్‌ను ఓపెన్ చేయకుండా బ్యాటరీ ఆదా చేయవచ్చు.

కనెక్టువిటీ ఫీచర్లు

కనెక్టువిటీ ఫీచర్లు

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై 802.11, బ్లూటూత్, జీపీఎస్, గ్లోనాస్, వంటి కనెక్టువిటీ ఆప్షన్‌లను సపోర్ట్ చేస్తుంది.

బ్యాటరీ విత్ వైర్‌లెస్ ఛార్జింగ్

బ్యాటరీ విత్ వైర్‌లెస్ ఛార్జింగ్

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ 3600 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్.

కలర్ వేరియంట్స్

కలర్ వేరియంట్స్

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ బ్లాక్ ఆనియక్స్, గోల్డ్ ప్లాటినమ్, సిల్వర్ టైటానియమ్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy S7 and Galaxy S7 Edge receive price cut in India. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X