సీక్రెట్‌‌గా శాంసంగ్ గెలాక్సీ S8, పేరు నిలబెడుతుందా..?

ఫిబ్రవరి నెల కాకుండా మరో రెండు నెలలు ఆలస్యంగా, అంటే ఏప్రిల్లో ఎస్ 8 ను విడుదల

By Hazarath
|

ఈ మధ్య కాలంలో భారీగా నష్టపోయిన మొబైల్ కంపెనీ ఏదైనా ఉందంటే అది శాంసంగ్ కంపెనీ మాత్రమే. కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గెలాక్సీ నోట్ 7 కంపెనీ పేరును ఒక్కసారిగా మార్చివేసింది. బ్యాటరీలు పేలుతున్నయంటూ వచ్చిన వార్తలతో శాంసంగ్ కంపెనీ ఆ ఫోన్లన్నింటినీ రీకాల్ చేసింది. ఆ తరువాత కంపెనీ నుంచి ఎటువంటి ఫోన్ మార్కెట్లోకి రాలేదు. అయితే ఇప్పుడ గెలాక్సీఎస్8తో మార్కెట్లోకి దూసుకురావాలని చూస్తోంది. అయితే అది విడుదల మాత్రం మళ్లీ రెండు నెలలు వాయిదా పడింది.

శాంసంగ్ పే యాప్, పేటీఎంకు సవాలేనా..?

పోయిన పేరును తిరిగి తెచ్చుకునేందుకు

పోయిన పేరును తిరిగి తెచ్చుకునేందుకు

ఫిబ్రవరి 2017 లో గెలాక్సీ ఎస్ 8 ను విడుదల చేయాలని శాంసంగ్ భావించినప్పటికీ నోట్ 7 కారణంగా పోయిన పేరును తిరిగి తెచ్చుకునేందుకు అలాగే మళ్లీ వినియోగదారుల నమ్మకాన్ని చూరగొనేందుకు శాంసంగ్ ఎస్ 8 విడుదలను మరో రెండు నెలలకు పోస్ట్ పోన్ చేసింది.

2017 ఏప్రిల్లో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సందర్భంగా

2017 ఏప్రిల్లో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సందర్భంగా

ముందుగా అనుకున్న ఫిబ్రవరి నెల కాకుండా మరో రెండు నెలలు ఆలస్యంగా, అంటే ఏప్రిల్లో ఎస్ 8 ను విడుదల చేయాలని చూస్తోంది. న్యూయార్క్లో 2017 ఏప్రిల్లో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సందర్భంగా గెలాక్సీ ఎస్ 8 ను విడుదల చేయాలని శాంసంగ్ భావిస్తోంది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారాన్నీ వెల్లడించలేదు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫీచర్లను కూడా బయటకు తెలియకుండా

ఫీచర్లను కూడా బయటకు తెలియకుండా

గెలాక్సీ ఎస్ 8 ఫోన్‌కు చెందిన ఫీచర్లను కూడా బయటకు తెలియకుండా శాంసంగ్ జాగ్రత్తలు తీసుకుంటోంది. అయినప్పటికీ ఈ ఫోన్కు చెందిన పలు వార్తలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి.

5.7, 6.2 ఇంచెస్ వేరియెంట్లలో

5.7, 6.2 ఇంచెస్ వేరియెంట్లలో

గెలాక్సీ ఎస్ 8 ఫోన్‌ను 5.7, 6.2 ఇంచెస్ వేరియెంట్లలో విడుదల చేయనున్నట్టు సమాచారం. అదేవిధంగా ఈ ఫోన్లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ లేదా ఎగ్జినోస్ ప్రాసెసర్ను, అప్గ్రేడెడ్ డిజిటల్ అసిస్టెంట్ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది.

 ఫింగర్ప్రింట్ ఫోన్లకు భిన్నంగా

ఫింగర్ప్రింట్ ఫోన్లకు భిన్నంగా

దీంతోపాటు ఇప్పటి వరకు వచ్చిన ఫింగర్ప్రింట్ ఫోన్లకు భిన్నంగా ఎస్ 8 లో ఆప్టికల్ ఫింగర్ప్రింట్ సెన్సార్ను అమర్చుతున్నట్టు తెలియవచ్చింది. 

డివైస్ డిస్ప్లే కిందే సెన్సార్

డివైస్ డిస్ప్లే కిందే సెన్సార్

దీంతో ఫింగర్ప్రింట్ సెన్సార్కు ప్రత్యేకంగా బటన్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు. డివైస్ డిస్ప్లే కిందే సెన్సార్ ఎంబెడ్ అయి ఉంటుంది.

3 డీ టచ్ సౌకర్యాన్ని

3 డీ టచ్ సౌకర్యాన్ని

ఒక విధంగా చెప్పాలంటే ఈ ఫీచర్ వల్ల ఆపిల్ ఐఫోన్లో ఉన్న 3 డీ టచ్ సౌకర్యాన్ని ఇతర ఫోన్లలో అందించేందుకు వీలు కలుగుతుంది.

మళ్లీ మార్కెట్ ను శాసించాలని

మళ్లీ మార్కెట్ ను శాసించాలని

మొత్తంగా ఎన్నో ఆకర్షణీయ ఫీచర్లతో ఎస్ 8 ను విడుదల చేసి మళ్లీ మార్కెట్ ను శాసించాలని శాంసంగ్ భావిస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Samsung Galaxy S8 may be launched in April at an exclusive event in New York read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X