నెం.1 సామ్‌సంగ్, నెం.2 షియోమీ.. ఇండియాలో లీడింగ్ ఫోన్ బ్రాండ్స్ ఇవే

సామ్‌సంగ్ ఇప్పటికి భారతదేశపు నెం.1 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గానే కొనసాగుతోంది.

|

తన Redmi సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లతో Xiaomi బ్రాండ్ దూసుకుపోతున్నప్పటికి సామ్‌సంగ్‌ను మాత్రం బీట్ చేయలేక‌పోతోంది. సింగపూర్‌కు చెందిన ప్రముఖ రిసెర్చ్ సంస్థ Canalys తాజాగా జరిపిన విశ్లేషణ ప్రకారం దక్షిణ కొరియాకు చెందిన సామ్‌సంగ్, ఇప్పటికి భారతదేశపు నెం.1 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గానే కొనసాగుతోంది.

Read More : ఫోన్‌లో డిలీట్ అయిన టెక్స్ట్ మెసెజ్‌లను రికవర్ చేయటం ఎలా..?

క్వార్టర్లీ అమ్మకాలకుగానూ..

క్వార్టర్లీ అమ్మకాలకుగానూ..

క్వార్టర్లీ అమ్మకాలకుగానూ సామ్‌సంగ్‌ తరువాతి స్థానాలను షియోమీ, వివో, లెనోవో, ఒప్పో బ్రాండ్‌లు సొంతం చేసుకున్నాయి.

సామ్‌సంగ్ 6 మిలియన్లు, షియోమీ 4 మిలియన్లు..

సామ్‌సంగ్ 6 మిలియన్లు, షియోమీ 4 మిలియన్లు..

2017 మొదటి క్వార్టర్‌కు గాను సామ్‌సంగ్ దాదాపుగా 6 మిలియన్ డివైస్‌లను విక్రయించగా, షియోమీ 4 మిలియన్ డివైస్‌లను విక్రయించగలిగింది.

ఆన్‌లైన్ మార్కెటింగ్ స్ట్రేటజీ..

ఆన్‌లైన్ మార్కెటింగ్ స్ట్రేటజీ..

ఆన్‌లైన్ మార్కెటింగ్ స్ట్రేటజీలు షియోమీకి బాగా కలిసొచ్చాయని Canalys రిసెర్చ్ సర్వే చెబుతోంది. ఇదే సమయంలో మరే బ్రాండ్‌కు లేన్నంత విస్తృతమైన స్మార్ట్‌ఫోన్ పోర్టిఫోలియోను సామ్‌సంగ్ కలిగి ఉండటంతో అమ్మకాలు మరింత ఆశాజనకంగా సాగాయని విశ్లేషణ చెబుతోంది.

షియోమీ సక్సెస్‌కు...
 

షియోమీ సక్సెస్‌కు...

షియోమీ సక్సెస్‌కు కేవలం మూడు లేదా నాలుగు స్మార్ట్‌ఫోన్‌లు దోహదపడ్డాయని, ఇదే సమయంలో సామ్‌సంగ్ సక్సెస్‌కు అనేక గెలాక్సీ సిరీస్ మోడల్స్ దోహదపడ్డాయని Canalys రిసెర్చ్ వెల్లడించింది.

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌ను పరిశీలించినట్లయితే..

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌ను పరిశీలించినట్లయితే..

మార్కెట్లో, సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌ను పరిశీలించినట్లయితే రూ.20,000 ధర బ్రాకెట్ లోపు చాలా మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇదే సమయంలో హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలోనూ సామ్‌సంగ్ కు మంచి పట్టుంది.

 11% నుంచి 14% శాతంకు పెరిగాయి..

11% నుంచి 14% శాతంకు పెరిగాయి..

షియోమీ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి 2016 మొదటి క్వార్టర్‌లో జరిగిన అమ్మకాలతో పోలిస్తే 2017 మొదటి క్వార్టర్‌లో జరిగిన అమ్మకాలు 11% నుంచి 14% శాతం పెరిగాయని Canalys రిసెర్చ్ వెల్లడించింది.

మూడో స్థానంలో నిలిచిన వివో

మూడో స్థానంలో నిలిచిన వివో

ఇక మూడో స్థానంలో నిలిచిన వివో, 2017 మొదటి క్వార్టర్‌లో మూడు 3 మిలియన్ ఫోన్‌లను విక్రయించింది. ఈ బ్రాండ్ అటు ఆన్‌లైన్ మార్కెట్‌తో పాటు ఇటు ఆఫ్‌లైన్ మార్కెట్లోనూ దూసుకుపోతోంది.

లెనోవో 5 నుంచి నాలుగుకి...

లెనోవో 5 నుంచి నాలుగుకి...

ఇక డిసెంబర్ 2016తో ముగిసిన క్వార్టర్‌కు గాను 5వ స్థానంలో నిలిచిన లెనోవో ఒక స్థానం పైకి ఎగబాకి 4వ స్థానంలో నిలిచింది.

ఒప్పో ఐదవ స్థానంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది

ఒప్పో ఐదవ స్థానంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది

చైనాకు చెందిన మరో బ్రాండ్ ఒప్పో ఐదవ స్థానంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. మొత్తంగా చూసుకుంటే 2017 మొదటి క్వార్టర్‌లో 27 మిలియన్ల షిప్‌మెంట్‌లు జరిగినట్లు Canalys రిసెర్చ్ చెబుతోంది.

Best Mobiles in India

English summary
Samsung and Xiaomi are India’s First and Second Largest Smartphone Brands in Q1 2017: Canalys Report. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X