పోర్న్ సైట్‌ల ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్ల‌లోకి వ్యాపిస్తోన్న భయంకరమైన వైరస్

ఈ మాల్వేర్ సోకిన ఫోన్‌లో Ks Clean అనే యాప్ ఆటోమెటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోతుంది.

|

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మరో భయంకరమైన ముప్పు పొంచి ఉంది. kskas.apk పేరుతో ప్రమాదకరమైన యాప్ ఒకటి దానంతటికదే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో డౌన్‌లోడ్ అయిపోతోంది. Ks Clean పేరుతో ఈ యాప్ పైకి కనిపిస్తోంది. పోర్న్ అలానే పైరేటెడ్ కంటెంట్‌ వెబ్‌సైట్స్ ద్వారా ఈ మాల్వేర్ స్మార్ట్‌ఫోన్‌లలోకి ఇన్‌ఫెక్ట్ అవుతున్నట్లు నిపుణులు గుర్తించారు.

 
పోర్న్ సైట్‌ల ద్వారా వ్యాపిస్తోన్న భయంకరమైన వైరస్

ఈ మాల్వేర్ సోకిన ఫోన్‌లో Ks Clean అనే యాప్ ఆటోమెటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోతుంది. యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయించే క్రమంలో యూజర్‌ను ఊరించే విధంగా ఒక పాపప్ మెసేజ్‌ను డిస్‌ప్లే చేస్తుంది. ఈ పాపప్ మెసేజ్‌కు "Ok" బటన్ తప్ప "cancel" or "close" వంటి బటన్స్ ఉండవు. "Ok" బటన్ పై క్లిక్ చేసినట్లయితే "update" పేరుతో మరొక యాప్ దానంతటకదే మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ కాబడి ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఈ యాప్‌ను మీరు అన్‌ఇన్‌స్టాల్ చేసుకునే అవకాశం ఉండదు. ఈ యాప్ మీకు తెలియకుండానే మన ఫోన్‌లోని సమాచారాన్ని హ్యాకర్లు చేరవేసేస్తుంటుంది. Ks Clean మాల్వేర్‌కు దూరంగా ఉండాలంటే, పోర్న్ వెబ్‌సైట్‌లతో పాటు పైరేటెడ్ సైట్‌ల జోలికి వెళ్లకండి.

 

Best Mobiles in India

English summary
Self-Downloading Malware Ks Clean Targets Android Users. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X