సోనీ Xperia XZ, ధర రూ.51,990.. ఐఫోన్‌కు షాకిచ్చేలా ఉంది

|

Xperia XZ పేరుతో ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను సోనీ కంపెనీ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ.51,990. డిస్కౌంట్ పై రూ.49,990కి సొంతం చేసుకోవచ్చు.

సోనీ Xperia XZ, ధర రూ.51,990.. ఐఫోన్‌కు షాకిచ్చేలా ఉంది

యాపిల్ ఐఫోన్‌ 7తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తొలత IFA 2016లో ప్రదర్శించటం జరిగింది. హైలెట్ ఫీచర్లను పరిశీలించినట్లయితే...

Read More : మీ ఆధార్ కార్డులో తుప్పులున్నాయా..? వాటిని సరిచేసుకోండిలా..?

ALKALEIDO మెటీరియల్‌‌తో

ALKALEIDO మెటీరియల్‌‌తో

సోనీ తన ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఫోన్‌ను ప్రత్యేకమైన ALKALEIDO మెటీరియల్‌తో తయారు చేసింది. ఫోన్ పై మచ్చలంటూ పడవు. 8.1 మిల్లీ మీటర్ల మందంతో రూపుదిద్దుకున్న ఈ ఫోన్ బరువు 161 గ్రాములు.

X-Reality Engine

X-Reality Engine

సహజసిద్ధమైన రంగులను ఉత్పత్తి చేయగిలిగే అప్‌గ్రేడెడ్ X-Reality Engineను ఈ ఫోన్‌ డిస్‌ప్లేలో సోనీ పొందుపరిచింది. 5.1 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ట్రైల్యూమినస్ డిస్‌ప్లేతో వస్తోన్న ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఫోన్‌లో.. లైవ్ కలర్ ఎల్ఈడి, లైవ్ కలర్ క్రియేషన్ వంటి రిచ్ టోన్ కలర్ ఫీచర్లను పొందుపరిచారు.

శక్తివంతమైన Snapdragon ప్రాసెసర్..

శక్తివంతమైన Snapdragon ప్రాసెసర్..

ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఫోన్‌లో శక్తివంతమైన Snapdragon 820 chipsetను సోనీ నిక్షిప్తం చేసింది. పొందుపరిచిన అడ్రినో 530 చిప్ గ్రాఫిక్ విభాగాన్ని చూసుకుంటుంది.

ర్యామ్ ఎంతంటే..?

ర్యామ్ ఎంతంటే..?

ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఫోన్‌ 3జీబి ర్యామ్‌తో వస్తోంది. 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని మరింతగా విస్తరించుకునే అవకాశం.

సరికొత్త IMX300 Sensor

సరికొత్త IMX300 Sensor

సరికొత్త IMX300 Sensor ఆధారంగా పనిచేసే 23 మెగా పిక్సల్ కెమెరాను ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఫోన్‌ వెనుక భాగంలో ఏర్పాటు చేసారు. 13 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఆకట్టుకుంటుంది.

ట్రిపుల్ ఇమేజ్ సెన్సింగ్...

ట్రిపుల్ ఇమేజ్ సెన్సింగ్...

సోనీ, తన ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఫోన్‌ కెమెరా ద్వారా ట్రిపుల్ ఇమేజ్ సెన్సింగ్ పేరుతో సరికొత్త టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ సరికొత్త కమెరా టెక్నాలజీ కదులుతున్న వాటిని హైక్వాలిటీతో క్యాప్చుర్ చేస్తుంది.

ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ స్థానంలో...

ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ స్థానంలో...

సోనీ తన ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఫోన్‌ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు బదులుగా SteadyShot Intelligent Active Modeను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫోటోలు ఇంకా వీడియోలను స్థిరీకరించేందుకు ఈ మోడ్ 5 యాక్సిల్ గైరో స్కోప్‌ను ఉపయోగిస్తుంది.

 4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్

4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్

ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 13 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలతో పాటు వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు. ఈ కెమెరా 4కే క్వాలిటీ వీడియోలను కూడా రికార్డ్ చేయగలదు.

వాటర్ రెసిస్టెంట్ తత్వం..

వాటర్ రెసిస్టెంట్ తత్వం..

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఫోన్‌ ప్రత్యేకమైన వాటర్ రెసిస్టెంట్ తత్వంతో వస్తోంది.

క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ సపోర్ట్...

క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ సపోర్ట్...

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఫోన్‌‌లో ఏర్పాటు చేసిన 2,900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0 టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. అడాప్టివ్ ఛార్జింగ్ టెక్నాలజీని డివైస్ సపోర్ట్ చేస్తుంది.

Best Mobiles in India

English summary
10 THINGS TO KNOW About Sony Xperia XZ Launched in India for Rs.51,990. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X