సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 vs టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌లు: తేడాలు మీరే పరిశీలించండి?

|

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను అబ్బురపరుస్తూ, 2014 సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. ఈ సంవత్సరానికి గాను ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు తమతమ ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్‌లను దాదాపుగా పరిచయం చేసేసాయి. భారత్ వంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ వాతావరణం నెలకుంది. యాపిల్, సామ్‌స్ంగ్, హెచ్‌టీసీ వంటి దిగ్గజ కంపెనీలు తీవ్రమైన పోటీ ఒత్తడి మధ్య వ్యాపారాలను సాగిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో, భారతీయుల మదిలో విశ్వసనీయ బ్రాండ్‌గా గుర్తింపును సొంతం చేసుకున్న ‘సోనీ'.. తాజాగా తన లేటెస్ట్ వర్షన్ ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ ‘ఎక్స్‌పీరియా జెడ్3'ని మార్కెట్లో విడుదల చేసి మరోసారి తన సత్తాను చాటుకుంది. అత్యుత్తమ డిజైనింగ్ ఇంకా లేటెస్ట్ వర్షన్ హార్డ్‌వేర్‌తో రూపకల్పన కాబడిన ‘సోనీ ఎక్స్‌పీరియా జెడ్3' స్మార్ట్‌ఫోన్‌ను తొలత రూ.51,990 ధర ట్యాగ్‌తో మార్కెట్లో ఆవిష్కరించారు. పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ప్రత్యేకమైన ధర తగ్గింపులో భాగంగా సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 స్మార్ట్‌ఫోన్ రూ.49,990కే లభ్యమవుతోంది.

భవిష్యత్ కమ్యూనికేషన్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక స్మార్ట్ మొబైలింగ్ ఫీచర్‌లను సోనీ తన ఎక్స్‌పీరియా జెడ్3 ఫోన్‌లో పొందుపరిచింది. వినియోగదారులకు ఈ డివైజ్ హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్ అనుభూతులను చేరువ చేస్తుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 - కీలక స్పెసిఫికేషన్‌లు:

ఎక్స్‌పీరియా జెడ్3 స్మార్ట్‌ఫోన్ 5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది (రిసల్యూషన్ సామర్థ్యం1920 x 1080పిక్సల్స్, పిక్సల్ డెన్సిటీ 424 పీపీఐ), ఎక్స్‌పీరియా జెడ్2 స్ర్కీన్‌తో పోలిస్తే 20శాతం ప్రకాశవంతమైన స్ర్కీన్ క్వాలిటీని ఎక్స్‌పీరియా జెడ్3 చేరువ చేస్తుంది. ప్రత్యక్ష సూర్యకాంతిలోనూ ఎక్స్‌పీరియా జెడ్3 డిస్‌ప్లేను సౌకర్యవంతగా విక్షించవచ్చు.

ఫోన్ ఇతర ఫీచర్లను పరిశీలించినట్లయితే.... 2.5 గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను ఎక్స్‌పీరియా జెడ్3లో నిక్షిప్తం చేసారు. ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై డివైస్ రన్ అవుతుంది. శక్తివంతమైన 3,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఎక్స్‌పీరియా జెడ్3లో ఏర్పాటు చేయటం జరిగింది.

ఎక్స్‌పీరియా జెడ్3లో అమర్చిన 20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా పరిశ్రమలోని అత్యుత్తమ కెమెరా వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుంది. ఈ కెమెరాలో లైట్ సెన్సిటివిటీ సామర్థ్యం ఐఎస్ఓ 12800 వరకు ఉంది. మార్కెట్లో లభ్యమవుతున్న అత్యధిక శాతం స్మార్ట్‌ఫోన్‌లలో లైట్ సెన్సిటివిటీ సామర్థ్యం కేవలం ఐఎస్ఓ 800 వరుకు మాత్రమే పరిమితమై ఉంది.

ఎక్స్‌పీరియా జెడ్3లో ఏర్పాటు చేసిన 20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా ద్వారా ఫోటోలను క్రిస్టల్ క్లియర్ క్వాలిటీతో చిత్రీకరించవచ్చు. వీడియోలను 4కే రిసల్యూషన్ క్వాలిటీతో ఈ కెమెరా చిత్రీకరిస్తుంది. పీఎస్4 రిమోట్ ప్లే పేరుతో మరో ప్రత్యేకమైన ఫీచర్‌ను ఎక్స్‌పీరియా జెడ్3లో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ఫీచర్ ద్వారా గేమింగ్‌ను ఇష్టపడే వారు వై-ఫై నెట్‌వర్క్ పై పీఎస్4 గేమ్‌లను హైక్వాలిటీతో ఎంజాయ్ చేయవచ్చు. అయితే, పీఎస్4 గేమ్ కంట్రోలర్‌ను విడిగా కొనుగోలు చేయవల్సి ఉంటుంది.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 పటిష్టమైన వాటర్ రెసిస్టెంట్ వ్యవస్థను కలిగి ఉంది. ఎక్స్‌పీరియా జెడ్2తో పోలిస్తే జెడ్3 మరింత నాజూకుగా ఉంటుంది. ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో ఎక్స్‌పీరియా జెడ్3ని నమ్మకమైన ఫోన్‌గా అభివర్ణించవచ్చు. ఎక్స్‌పీరియా జెడ్3 స్మార్ట్‌ఫోన్‌ను ఇతర ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లతో విశ్లేషిస్తూ వాటి మధ్య వ్యత్యాసాలను మీ దృష్టికి తీసుకురావటం జరుగుతోంది. ఆ వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 vs టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌లు: తేడాలు మీరే పరిశీలించండి?

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 vs టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌లు: తేడాలు మీరే పరిశీలించండి?

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 Vs యాపిల్ ఐఫోన్ 6

యాపిల్ ఐఫోన్ 6, 4.7 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ ఎల్ఈడి డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇదే సమయంలో, ఎక్స్‌పీరియా జెడ్3 కూడిన 5.2 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ క్వాలిటీ 1,920 x 1,080 పిక్సల్స్)తో ముందంజలో ఉంది. డిస్‌ప్లే ఇంకా రిసల్యూషన్ క్వాలిటీ విషయాన్ని పక్కన పెడితే ఎక్స్‌పీరియా జెడ్3, 2.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్ ఇంకా 3జీబి ర్యామ్‌ సపోర్ట్‌ను కలిగి ఉంది.

ఇదే సమయంలో ఐఫోన్ 6, 1జీబి ర్యామ్‌తో కూడని 1.4గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ఏ8  చిప్‌సెట్‌ను కలిగి ఉంది. సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ఫీచర్‌ను కలిగి ఉంటే, యాపిల్ ఐఫోన్ 6లో ఈ సౌకర్యం లోపించింది.

 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 vs టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌లు: తేడాలు మీరే పరిశీలించండి?

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 vs టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌లు: తేడాలు మీరే పరిశీలించండి?

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 Vs సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5

స్పెసిఫికేషన్‌ల పరంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5, ఎక్స్‌పీరియా జెడ్3 స్మార్ట్‌ఫోన్‌కు దగ్గరగా వచ్చినప్పటికి బ్యాటరీ విషయంలో చేతులెత్తేసింది. సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ముందంజలో ఉండగా, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 2,800 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వెనుకంజలో ఉంది. కెమెరా విషయంలోనూ ఎక్స్‌పీరియా జెడ్3దే పైచేయి. గెలాక్సీ ఎస్5లో ఏర్పాటు చేసిన 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, ఎక్స్‌పీరియా జెడ్3లో ఏర్పాటు చేసిన 20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా ముందు తేలిపోక తప్పదు.

 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 vs టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌లు: తేడాలు మీరే పరిశీలించండి?

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 vs టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌లు: తేడాలు మీరే పరిశీలించండి?

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 Vs సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా మెటల్ డిజైనింగ్ ఆకట్టుకున్నప్పటికి స్పెసిఫికేషన్‌ల పరంగా ఎక్స్‌పీరియా జెడ్3ని అందుకోలేకపోయింది. ఈ రెండు ఫోన్‌ల మధ్య ప్రముఖ వ్యత్యాసాలను పరిశీలించినట్లయితే... గెలాక్సీ ఆల్ఫా 4.7 అంగుళాల సూపర్ అమోల్డ్ స్ర్కీన్ (720 పిక్సల్ రిసల్యూషన్)తో ఓ మోస్తరుగా ఆకట్టుకోగా, ఎక్స్‌పీరియా జెడ్3 5.2 అంగుళాల ట్రైల్యూమినస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1920 x 1080పిక్సల్స్)తో తన హవాను కొనసాగించింది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా స్మార్ట్‌ఫోన్‌ ఆక్టా కోర్ ప్రాసెసర్‌ పై స్పందిస్తుంది. అలానే, 2జీబి ర్యామ్, 32జీబి ఫిక్సుడ్ ఇంటర్నల్ మెమరీ వంటి ఫీచర్లు  ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

అయితే, గెలాక్సీ ఆల్ఫా స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసిన ఆక్టా కోర్ ప్రాసెసర్‌‌ను ఎక్స్‌పీరియా జెడ్3లో ఏర్పాటు చేసిన క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌తో పోల్చలేం.

 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 vs టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌లు: తేడాలు మీరే పరిశీలించండి?

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 vs టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌లు: తేడాలు మీరే పరిశీలించండి?

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 Vs హెచ్‌టీసీ వన్ (ఎమ్ 8)

ఈ రెండు ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లకు సంబంధించి వ్యత్యాసాన్ని పరిశీలించినట్లయితే..

హెచ్‌టీసీ వన్ (ఎమ్ 8) స్మార్ట్‌ఫోన్ 4 అల్ట్రా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా అలానే 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. ఇదే సమయంలో, సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 శక్తివంతమైన 20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరాతో పాటు 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో హెచ్‌టీసీ వన్ (ఎమ్ 8) పై పూర్తిస్థాయిలో పై చేయి సాధించింది. ఎక్స్‌పీరియా జెడ్3లో నిక్షిప్తం చేసిన రేర్ కెమెరా ద్వారా వీడియోలను 4కే రిసల్యూషన్ క్వాలిటీతో చిత్రీకరించుకోవచ్చు. అదనంగా ఎక్స్‌పీరియా జెడ్3 ఐపీ 65, ఐపీ 68 సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది.

 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 vs టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌లు: తేడాలు మీరే పరిశీలించండి?

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 vs టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌లు: తేడాలు మీరే పరిశీలించండి?

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 Vs మోటో ఎక్స్ (2014)

ఈ రెండు ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లకు సంబంధించి వ్యత్యాసాలను పరిశీలించినట్లయితే ఎక్స్‌పీరియా జెడ్3 శక్తివంతమైన 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇదే సమయంలో మోటో ఎక్స్ (2014) స్మార్ట్‌ఫోన్ 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీని మాత్రమే కలిగి ఉంది.

3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ వంటి ఫీచర్లు ఎక్స్‌పీరియా జెడ్3కి వెన్నుముకగా నిలుస్తాయి. అంతేకాకుండా, ఎక్స్‌పీరియా జెడ్3 మెమరీని మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా 128జీబి వరకు విస్తరించుకోవచ్చు. మోటో ఎక్స్ 2014 ఎడిషన్‌లో మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ఫీచర్ లోపించింది.

 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 vs టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌లు: తేడాలు మీరే పరిశీలించండి?

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 vs టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌లు: తేడాలు మీరే పరిశీలించండి?

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 Vs నోకియా లూమియా 930

ఈ రెండు ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లకు సంబంధించి వ్యత్యాసాలను పరిశీలించినట్లయితే...

నోకియా ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ లూమియా 930, 2.2 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాససర్‌‌తో ఆకట్టుకోగా, 2.5 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాససర్‌తో సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 మరింత ఆకట్టుకుంది. బ్యాటరీ విషయంలోనూ సోనీదే పైచేయిగా ఉంది. లూమియా 930 ఫోన్ 2420ఎమ్ఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇదే సమయంలో సోనీ ఎక్స్‌పీరియా జెడ్3, 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది.

 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 vs టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌లు: తేడాలు మీరే పరిశీలించండి?

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 vs టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌లు: తేడాలు మీరే పరిశీలించండి?

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 Vs గూగుల్ నెక్సూస్ 5

ఈ రెండు ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లకు సంబంధించి వ్యత్యాసాలను పరిశీలించినట్లయితే..  గూగుల్ నెక్సూస్ 5, 5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇతరు ఫీచర్లను పరిశీలించినట్లయితే.. 2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్, 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం1920 x 1080పిక్సల్స్, పిక్సల్ డెన్సిటీ 424 పీపీఐ) 2.5గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

గూగుల్ నెక్సూస్ 5 స్పెసిఫికేషన్‌లతో పోలిస్తే సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 స్పెసిఫికేషన్‌లు మరింత శక్తివంతంగా ఉన్నాయి.

 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 vs టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌లు: తేడాలు మీరే పరిశీలించండి?

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 vs టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌లు: తేడాలు మీరే పరిశీలించండి?

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 Vs ఎల్‌జీ జీ3 స్టైలస్

ఎల్‌జీ జీ3 స్టైలస్ 5.5 అంగుళాల స్ర్కీన్‌ను (రిసల్యూషన్ సామర్థ్యం 960 x 540పిక్సల్స్) కలిగి ఉంటే, సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం1920 x 1080పిక్సల్స్ , పిక్సల్ డెన్సిటీ 424 పీపీఐ)ను కలిగి ఉంది.

1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్ పై ఎల్‌జీ జీ3 స్టైలస్ పని చేస్తుంది. ఇదే సమయంలో సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 2.5గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్‌కోర్ ప్రాసెసర్ పై స్పందిస్తుంది. ఎల్‌జీ జీ3 స్టైలస్‌లో, 13 మెగా పిక్సల్ కెమెరాను ఏర్పాటు చేసారు. ఇదే సమయంలో సోనీ ఎక్స్‌పీరియా జెడ్3లో 20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరాను నిక్షిప్తం చేసారు. ఈ కెమెరా ద్వారా వీడియోలను 4కే రిసల్యూషన్ క్వాలిటీతో చిత్రీకరించుకోవచ్చు.

ఎల్‌జీ జీ3 స్టైలస్ స్పెసిఫికేషన్‌లతో పోలిస్తే సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 స్పెసిఫికేషన్‌లు మరింత శక్తివంతంగా ఉన్నాయి.

 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 vs టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌లు: తేడాలు మీరే పరిశీలించండి?

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 vs టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌లు: తేడాలు మీరే పరిశీలించండి?

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 Vs సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్ 5 అంగుళాల క్యూహైడెఫినిషన్ స్ర్కీన్‌ను కలిగి ఉంది. రిసల్యూషన్ సామర్థ్యం 960 x 540పిక్సల్స్. ఫోన్ ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా.

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్, సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 స్పెసిఫికేషన్‌ల ముందు ఏమాత్రం నిలవలేక పోయింది.

 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 vs టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌లు: తేడాలు మీరే పరిశీలించండి?

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 vs టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌లు: తేడాలు మీరే పరిశీలించండి?

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 Vs హెచ్‌టీసీ వన్ (ఇ8)

హెచ్‌టీసీ వన్ (ఇ8) స్మార్ట్‌ఫోన్‌తో పోలిస్తే సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది. ఎక్స్‌పీరియా జెడ్3 ఫోన్ వేగవవంతమైన 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. వాటర్ రెసిస్టెంట్, డస్ట్ ప్రూఫ్ వంటి ఫీచర్లు ఎక్స్‌పీరియా జెడ్3ని మరింత బలోపేతం చేసాయి. ఈ సీజన్‌లో అధిక ముగింపు ఆండ్రాయిడ్ హ్యాండ్‌సెట్ సొంతం చేసుకోవాలనుకునే వారికి
సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 ఉత్తమ ఎంపిక అనటంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు.

 

<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/G85l8AjwWqg?list=UUhpms81A8ItnbXTHgJzx5pg" frameborder="0" allowfullscreen></iframe></center>

Best Mobiles in India

English summary
Sony Xperia Z3 vs Top 10 Rivals: The Difference Between the Best and the Rest. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X