మోటరోలా ఫోన్స్.. నాటి నుంచి నేటి వరకు

లెనోవో చేతుల్లోకి వెళ్లాక మోటరోలా స్మార్ట్‌ఫోన్‌ల స్వరూపమే మారిపోయింది.

|

ప్రపంచానికి మొబైల్ ఫోన్‌ను పరిచయం చేసి సరికొత్త విప్లవానికి నాందిపలికిన మోటరోలా అనేక ఒడిదుడుకుల తరువాత మరోసారి మార్కెట్లో తన సత్తాను చాటుతోంది.

 మోటరోలా ఫోన్స్.. నాటి నుంచి నేటి వరకు

Read More : ఎయిర్‌‌‌టెల్, వొడాఫోన్, ఐడియా.. లేటెస్ట్ ప్లాన్స్

2012లో మోటరోలా మొబిలిటీ విభాగాన్ని సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ $12.5బిలియన్‌లను వెచ్చించి సొంతం చేసుకుంది. ఆ తరువాత మోటరోలా మొబిలిటీ హ్యాండ్‌సెట్ విభాగాన్ని చైనాకు చెందిన ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ లెనోవోకు $2.91 బిలియన్‌‌లకు గూగుల్ విక్రయించింది. దీంతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మోటరోలా స్వరూపమే మారిపోయింది. మొబైల్ మార్కెట్లో చరిత్ర సృష్టించిన మోటరోలా ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

ఏప్రిల్ 3, 1973

ఏప్రిల్ 3, 1973

అది ఏప్రిల్ 3, 1973.. మోటరోలా ఇంజనీర్ మార్టీ కూపర్ సెల్‌ఫోన్ నుంచి మొట్టమొదటి పబ్లిక్ కాల్ చేసారు. ఆ కాల్ రైవల్ రిసెర్చ్ డిపార్ట్‌మెంట్ బెల్ ల్యాబ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జోయెల్ ఎంగెల్‌కు అందింది. అప్పుడు కూపర్ ఈ విధంగా స్పందించారు ‘జోయెల్, దిస్ ఈజీ మార్టీ, ఐయామ్ కాలింగ్ యూ ఫ్రం ఏ సెల్‌ఫోన్, ఏ రియల్ హ్యాండిల్డ్ పోర్టబుల్ సెల్‌ఫోన్' అంటూ సంభాషణలు సాగాయి. ప్రపంచపు మొట్టమొదటి సెల్‌ఫోన్‌గా ‘మోటరోలా డైనాటాక్ 8000 ఎక్స్' (Motorola DynaTAC 8000x) చరిత్రకెక్కింది.

Motorola DynaTAC phone

Motorola DynaTAC phone

ఇండియా చాలా కీలకం, రూ.10,000లోపే నోకియా ఆండ్రాయడ్ ఫోన్‌లు?ఇండియా చాలా కీలకం, రూ.10,000లోపే నోకియా ఆండ్రాయడ్ ఫోన్‌లు?

ప్రపంచపు మొట్టమొదటి కమర్షియల్ పోర్టబుల్ సెల్యులార్ ఫోన్‌గా మోటరోలా డైనాటాక్ ఫోన్ (Motorola DynaTAC phone) చరిత్రపుటల్లో నిలిచింది. ఈ ఫోన్ రూపకల్పనలో భాగంగా మోటరోలా ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ మేనేజర్ రూడీ క్రోలోప్ కీలక పాత్ర పోషించారు.

తొలి బ్రాండ్‌గా మోటరోలా

తొలి బ్రాండ్‌గా మోటరోలా

సెల్యులార్ ఉత్పత్తులను ప్రవేశపెట్టిన తొలి బ్రాండ్‌గా మోటరోలా చరిత్రలో నిలిచింది. మోటరోలా డైనా‌టాక్ సిరీస్ నుంచి విడుదలైన 2000, 4000, 6000 ఫ్యామిలీ, 8000 ఫ్యామిలీ ఫోన్ మోడల్స్ అప్పట్లో చరిత్ర సృష్టించాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

349 గ్రాములు బరువుతో..

349 గ్రాములు బరువుతో..

349 గ్రాములు బరువు గల మైక్రోటాక్ వ్యక్తిగత సెల్యులార్ ఫోన్‌ను మోటరోలా 1989లో పరిచయం చేసింది. అప్పట్లో ఈ ఫ్లిప్‌ఫోన్ చిన్నదిగా ఇంకా తక్కువ బరవు కలిగినదిగా ఉండేది.

అల్ట్రా‌లైట్ క్లాసిక్‌గోల్డ్ ఎడిషన్ ఫ్లిప్‌ఫోన్

అల్ట్రా‌లైట్ క్లాసిక్‌గోల్డ్ ఎడిషన్ ఫ్లిప్‌ఫోన్

USSD మొబైల్ బ్యాంకింగ్ అంటే ఏంటి..? ఎలా చేస్తారు..?USSD మొబైల్ బ్యాంకింగ్ అంటే ఏంటి..? ఎలా చేస్తారు..?

మోటరోలా నుంచి విడుదలైన మరో మోడల్ మైక్రోటాక్ అల్ట్రా‌లైట్ క్లాసిక్‌గోల్డ్ ఎడిషన్ ఫ్లిప్‌ఫోన్, WWII నాటి హ్యాండీ-టాకీ మోడల్ SCR536 పోర్టబుల్ టూ-వే రేడియోను కలిగి ఉండేది. 1994లో మోటరోలా iDEN డిజిటల్ రేడియోను పరిచయం చేసింది. ఈ డివైజ్ ప్రపంచపు మొట్టమొదటి కమర్షియనల్ డిజిటల్ రేడియో సిస్టంగా గుర్తింపు పొందింది. 1994లో ప్రపంచ సెల్‌ఫోన్ మార్కెట్‌ను మోటరోలా శాసించింది. గార్టనర్ వెల్లడించిన వివరాల
మేరకు మోటరోలా ఆ సంవత్సరంలో 32.5 మార్కెట్ వాటాను సాధించింది.

వేరబుల్ సెల్యులార్ ఫోన్‌

వేరబుల్ సెల్యులార్ ఫోన్‌

1996లో మోటరోలా కంప్యూటర్ మోడెమ్‌లకు కనెక్ట్ చేసుకోదగిన స్టార్‌టాక్ వేరబుల్ సెల్యులార్ ఫోన్‌లను ఆవిష్కరించింది. మోటరోలా, టైమ్‌పోర్ట్ మోడల్ ఎల్7089 ట్రైబ్యాండ్ డిజిటల్ వైర్‌లెస్ ఫోన్‌ను 1999లో విడుదల చేసారు. ఈ ఫోన్‌ను జీఎస్ఎమ్ ప్రసార ప్రామాణికంలో వినియోగించారు.

నాలుగు డిజిటల్ వీ8160 సెల్యులార్ టెలీఫోన్‌లు

నాలుగు డిజిటల్ వీ8160 సెల్యులార్ టెలీఫోన్‌లు

AP PURSE, పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండిAP PURSE, పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి

మోటరోలా వీ సిరీస్ నుంచి నాలుగు డిజిటల్ వీ8160 సెల్యులార్ టెలీఫోన్‌లు విడుదలయ్యాయి. జూన్ 2000లో మోటరోలా, సిస్కో కంపెనీలు సంయుక్తంగా జీపీఆర్ఎస్ సెల్యులార్ నెట్‌వర్క్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఈ సర్వీసును మొట్టమొదటి జీపీఆర్ఎస్ సెల్యులార్ ఫోన్ మోటరోలా టైమ్‌పోర్ట్ పీ7389ఐ మోడల్ సెల్యులార్ ఫోన్‌లో వినియోగించారు. ఇంటర్నెట్ ఇంకా సంక్షిప్త సందేశాలను పంపుకునేందకు వీలుగా మోటరోలా కంపెనీ 2001లో మోటరోలా వీ60 డిజిటల్ ఫోన్‌ను పరిచయం చేసింది.

3జీ సెల్యులార్ ఫోన్‌

3జీ సెల్యులార్ ఫోన్‌

మోటరోలా మొట్టమొదటి 3జీ సెల్యులార్ ఫోన్‌ ఏ830ను 2002లో పరిచయం చేసారు. 2004లో మోటరోలా మోటోరాజర్ వీ3 పేరుతో అత్యంత పలచని ఫోన్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ ప్రపంచవ్యాప్తంగా 110 మిలియన్ యూనిట్లు అమ్ముడుపోయింది.  2005లో మోటరోలా గుండ్రటి అంచులతో కూడిన మోటరోలా PEBL ఫోన్‌లు మార్కెట్లో విడుదలయ్యాయి. జూన్ 2006లో మోటరోలా ‘మోటో క్యూ' పేరుతో పలుచటి క్వర్టీ కీప్యాడ్ ఫోన్‌ను విడుదల చేసింది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మోటరోలా సొల్యూషన్స్, మోటరోలా మొబిలిటీ..

మోటరోలా సొల్యూషన్స్, మోటరోలా మొబిలిటీ..

రూ.144కే నెలంతా ఉచిత కాల్స్, ఇంటర్నెట్రూ.144కే నెలంతా ఉచిత కాల్స్, ఇంటర్నెట్

మింగ్ టచ్‌స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌ను మోటరోలా 2006లో ఆసియా మార్కెట్లో విడుదల చేసింది. మోటరోలా రాజర్2 2006లో విడుదలైంది. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ పై స్పందించే మొట్టమొదటి ‘మోటరోలా డ్రాయిడ్' ఫోన్‌ను మోటరోలా కంపెనీ 2009 అక్టోబర్‌లో విడుదల చేసింది. మోటరోలా తన మొట్టమొదటి డ్యుయల్ కోర్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘మోటరోలా ఆట్రిక్స్'ను 2011లో విడుదల చేసింది. ఈ సంవత్సరంలోనే మోటరోలా ఇంక్ రెండు భాగాలుగా చీలింది. మోటరోలా సొల్యూషన్స్, మోటరోలా మొబిలిటీ.

గూగల్ చేతికి మోటరోలా..

గూగల్ చేతికి మోటరోలా..

2012లో మోటరోలా మొబిలిటీ విభాగాన్ని $12.5 బిలియన్లకు కొనుగోలు చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. అదే రోజున మోటరోలా డెఫీటఫ్ ఫోన్ ను ఆవిష్కరింరచింది. ఆ తురవాత మోటరోలా కొత్త వర్షన్ రాజర్ స్మార్ట్‌ఫోన్‌ను గూగుల్ మార్కెట్లో విడుదల
చేసింది.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల శ్రేణిని విస్తరించుకునే క్రమంలో ..

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల శ్రేణిని విస్తరించుకునే క్రమంలో ..

మోటోలక్సీ, మోటరోలా డెఫీ వేరియంట్‌లలో రెండు ఆండ్రాయిడ్ 2.3 స్మార్ట్‌ఫోన్‌లను మోటరోలా నుంచి గూగుల్ పరిచయం చేసింది. మోటరోలా ‘డెఫీ ప్రో' పేరుతో పూర్తిస్థాయి క్వర్టీ కీప్యాడ్ ఇంకా టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లేతో కూడిన మొదటి లైఫ్‌ప్రూఫ్ ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ఆవిష్కరించింది.

4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ సపోర్ట్  ఫోన్స్

4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ సపోర్ట్ ఫోన్స్

ఎయిర్‌టెల్ రూ.345 ప్లాన్, 5 లాభాలుఎయిర్‌టెల్ రూ.345 ప్లాన్, 5 లాభాలు

సెప్టంబర్ 6, 2012న వెరిజోన్ వైర్‌లెస్ ఇంకా మోటరోలా మొబిలిటీలు సంయుక్తంగా మూడు స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించాయి. వాటి పేర్లు డ్రాయిడ్ రాజర్ ఎమ్, డ్రాయిడ్ రాజర్ హెచ్‌డి, డ్రాయిడ్ రాజర్ మాక్స్ హైడెఫినిషన్. ఈ మోడల్స్ 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తాయి.

 

మోటరోలా రాజర్ ఐ స్మార్ట్‌ఫోన్‌..

మోటరోలా రాజర్ ఐ స్మార్ట్‌ఫోన్‌..

సెప్టంబర్ 18, 2012న మోటరోలా ప్రాసెసింగ్ చిప్‌ల తయారీ కంపెనీ ఇంటెల్‌తో జతకట్టి మోటరోలా రాజర్ ఐ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఆగష్టు 2013లో మోటో ఎక్స్ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మోటరోలా విడుదల చేసింది. మోటో జీ' పేరుతో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను మోటరోలా నవంబర్ 2013లో విడుదల చేసింది.

లెెనోవో చేతికి మోటరోలా..

లెెనోవో చేతికి మోటరోలా..

గూగుల్ తన మోటరోలా స్మార్ట్‌ఫోన్ వ్యాపారాన్ని లెనోవో కంపెనీకి $2.9 బిలియన్లకు విక్రయించింది. ఆ తరువాత మోటరోలా రూపురేఖలే మారిపోయాయి.

మోటో ఎక్స్ సిరీస్

మోటో ఎక్స్ సిరీస్

2013లో లాంచ్ అయిన మోటో ఎక్స్ సిరీస్ నుంచి మోటరోలా ఇప్పటి వరకు లాంచ్ చేసిన ఫోన్ లను పరిశీలించినట్లయితే..

మోటో ఎక్స్ మొదటి జనరేషన్ (2013)
మోటో ఎక్స్ రెండవ జనరేషన్ (2014)
మోటో ఎక్స్ స్టైల్
మోటో ఎక్స్ ఫోర్స్
మోటో ఎక్స్ ప్లే.

 

మోటో జీ సిరీస్

మోటో జీ సిరీస్

2013లో లాంచ్ అయిన మోటో జీ సిరీస్ నుంచి మోటరోలా ఇప్పటి వరకు లాంచ్ చేసిన ఫోన్ లను పరిశీలించినట్లయితే..

మోటో జీ మొదటి జనరేషన్ (2013)
మోటో జీ రెండవ జనరేషన్ (2014)
మోటో జీ మూడవ జనరేషన్ (2015)
మోటో జీ నాల్గవ జనరేషన్ (2016)

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మోటో ఇ సిరీస్

మోటో ఇ సిరీస్

2014లో లాంచ్ అయిన మోటో ఇ సిరీస్ నుంచి మోటరోలా ఇప్పటి వరకు లాంచ్ చేసిన ఫోన్‌లను పరిశీలించినట్లయితే..

మోటో ఇ మొదటి జనరేషన్ (2013)
మోటో ఇ రెండవ జనరేషన్ (2015)
మోటో ఇ3 పవర్ (2016)

 

మోటరోలా నుంచి ఇతర సిరీసుల్లో..

మోటరోలా నుంచి ఇతర సిరీసుల్లో..

మోటరోలా నుంచి ఇతర సిరీసుల్లో భారత్‌లో లాంచ్ అయిన ఫోన్‌లను పరిశీలించినట్లయితే...

మోటో టర్బో,
గూగుల్ నెక్సుస్ 6,
మోటో జెడ్ ప్లే,
మోటో జెడ్ ఫోర్స్

 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
The history of Motorola Phones From 1973 To 2016. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X