30 ఎంపీ కెమెరా, 6జిబి ర్యామ్, శాంసంగ్‌ ఆశలన్నీఈ ఫోన్‌పైనే !

కసిగా దూసుకొస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్8, వివాదాలతో, వైఫల్యాలతో నిరాశలో కూరుకుపోయిన శాంసంగ్ ఈ ఫోన్ తో గట్టెక్కే అవకాశం

By Hazarath
|

శాంసంగ్ గెలాక్సి నోట్ 7 పేళుళ్లతో ఉలిక్కిపడిన శాంసంగ్ కంపెనీ ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా శాంసంగ్ ఎస్8 ని మార్కెట్లోకి తీసుకొస్తోంది. పోయిన చోటనే రాబట్టుకోవాలనే సిద్ధాతంతో శాంసంగ్ ఈ ఫోన్ తో తమపై ఉన్న వివాదాలన్నింటిని మరచిపోయేలా ఈ ఫోన్ ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చేందుకు భారీ కసరత్తునే చేస్తోంది. రానున్న ఈ ఫోన్ అదిరిపోయే ఫీచర్లతో వస్తున్నట్లు తెలుస్తోంది.

కసిగా దూసుకొస్తున్న గెలాక్సీ ఎస్8

ప్రాసెసర్

ప్రాసెసర్

రానున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ఫోన్ స్నాప్ డ్రాగన్ 830 ప్రాసెసర్ మీద రానున్నట్లు తెలుస్తోంది. అలాగే పాస్టెస్ట్ చిప్ సెట్ తో వస్తుందని సమాచారం.

కెమెరా

కెమెరా

రానున్న ఈ ఫోన్ లో 30 ఎంపీ రేర్ కెమెరా సెన్సార్‌ను పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. ఈ ఫోన్ దెబ్బకి ఐఫోన్ కూడా వెనక్కి వెళ్లే అవకాశం కూడా ఉందని సమాచారం.

స్క్రీన్

స్క్రీన్

బుల్ట్ ప్రాజెక్టర్ తో వస్తోంది. బిగ్ స్క్రీన్ మీద వీడియోలను చూసూ అనుభూతిని అందిస్తుందని కథనాల బట్టి తెలుస్తోంది.

బ్యాటరీ
 

బ్యాటరీ

బ్యాటరీని కూడా అత్యంత పవర్ పుల్ గా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. గెలాక్సీ నోట్ 7 పేళుళ్ల నేపథ్యంలో బ్యాటరీని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. 4200 mAh బ్యాటరీతో రానున్నట్లు సమాచారం. ఒకసారి ఛార్జింగ్ పెడితే మూడు రోజుల వరకు వస్తుందని అంచనా.

ర్యామ్

ర్యామ్

మల్టీ టాస్కింగ్ పవర్‌తో రానున్న ఈ ఫోన్ లో 6జిబి ర్యామ్ ఉన్నట్లు‌గా తెలుస్తోంది.

ముహర్తం

ముహర్తం

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఫోన్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మార్కెట్ లోకి రానున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియలో సమాచారం లీకయింది.

లాంచ్ కు సన్నాహాలు

లాంచ్ కు సన్నాహాలు

ఈ ఏడాది శాంసంగ్ గెలాక్సీ ఎస్ 7, ఎస్ 7 ఎడ్జ్ లాంచ్ అయిన విజయవంతమైన నేపథ్యంలో కంపెనీ అదే సీజన్ లో ఎస్ 8 లాంచ్ కు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Here are the top 5 features that we can expect on the brand new Samsung Galaxy S8 Read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X