షాక్.. పేలుతోన్న Vivo V5 ఫోన్‌లు..?

ఛార్జింగ్ పెట్టి ఉన్న వివో వీ5 స్మార్ట్‌ఫోన్ల నుంచి మంటలు వ్యాపించాయి.

|

స్మార్ట్‌ఫోన్‌లు సురక్షితంకాదని మరోసారి రుజువైంది. తాజాగా ఒకటే స్మార్ట్‌ఫోన్‌ మోడల్‌కు సంబంధించి ఒకేలా చోటు చేసుకుంటున్న రెండు సంఘటనలు సదరు బ్రాండ్ క్వాలిటీ పైనే సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.

Read More : లిమిటెడ్ ఆఫర్.. రూ.3,200కే 3జీబి ర్యామ్, 4000mAh బ్యాటరీ ఫోన్

మరో సంఘటనలో కూడా..

మరో సంఘటనలో కూడా..

హర్యానాలోని కర్నాల్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ సంఘటనలో భాగంగా ఛార్జింగ్ పెట్టి ఉన్న వివో వీ5 స్మార్ట్‌ఫోన్ నుంచి మంటలు వ్యాపించాయి.

మరో సంఘటనలో కూడా..

మరో సంఘటనలో కూడా..

మరో సంఘటనలో కూడా ఛార్జింగ్ పెట్టి ఉన్న వివో వీ5 స్మార్ట్‌ఫోన్ నుంచే మంటలు వ్యాపించటం విశేషం. ఈ సంఘటన ఓ మొబైల్ స్టోర్ లో చోటుచేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Source : techdroider.com

సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి..

సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి..

ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఈ ఘటన పై కంపెనీ ఇప్పటి వరకు స్పందించలేదు.

Source : techdroider.com

నవంబర్‌ 2016లో లాంచ్ అయ్యింది...
 

నవంబర్‌ 2016లో లాంచ్ అయ్యింది...

వివో వీ5 స్మార్ట్‌ఫోన్ భారత్‌లో 2016, నవంబర్‌లో లాంచ్ అయ్యింది. 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఈ ఫో‌న్‌కు ప్రధానమైన హైలైట్. మూన్ లైట్ గ్లో ఎల్ఈడి ఫ్లాష్, సోనీ ఐఎమ్ఎక్స్736 సెన్సార్, f/2.0 అపెర్చుర్, 5 పిక్సల్ లెన్స్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలో ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో 13 మెగా పిక్సల్ కెమెరాను ఏర్పాటు చేసారు.

 మెటల్ యునిబాడీ డిజైన్‌తో వస్తోన్న వివో వీ5 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు...

మెటల్ యునిబాడీ డిజైన్‌తో వస్తోన్న వివో వీ5 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు...

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 1920 x 1080పిక్సల్స్), 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆధారండి డిజైన్ చేసిన ఫన్‌టచ్ 2.5 ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెడ్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ MT6750 ప్రాసెసర్, మాలీ టీ860 జీపీయూ, 4జీ ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 3000 mAh బ్యాటరీ, వాటర్ రెసిస్టెంట్ బిల్డ్ క్వాలిటీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4జీ విత్ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ-కంపాస్, స్ప్లిట్ స్ర్కీన్ మల్టీ టాస్కింగ్, బెస్ట్ క్వాలిటీ ఆడియో కోసం హై-ఫై ఏకే4376 చిప్‌సెట్.

Best Mobiles in India

English summary
Vivo V5 Explodes In A Local Store, Photos Surface. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X