రెండు ఫ్రంట్ కెమెరాలతో.. (Vivo V5 Plus రివ్యూ)

వివో వీ5 ప్లస్ (Vivo V5 Plus) పేరుతో లాంచ్ అయిన ఈ లేటెస్ట్ ఫోన్ యాక్షన్ ప్యాకుడ్ సెల్ఫీ కెమెరాలతో పాటు మిడ్ రేంజ్ స్పెసిఫికేషన్‌లతో ఊరించే ప్రయత్నం చేస్తుంది.

|

చైనా టెక్నాలజీ దిగ్గజం వివో (Vivo), మరో శక్తివంతమైన సెల్ఫీ కెమెరా ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. వివో వీ5 ప్లస్ (Vivo V5 Plus) పేరుతో లాంచ్ అయిన ఈ లేటెస్ట్ ఫోన్ యాక్షన్ ప్యాకుడ్ సెల్ఫీ కెమెరాలతో పాటు మిడ్ రేంజ్
స్పెసిఫికేషన్‌లతో ఊరించే ప్రయత్నం చేస్తుంది.

Read More : 1జీబి ధరకే 15జీబి 4జీ డేటా, మూడు నెలల పాటు

Vivo V5 మోడల్‌కు సక్సెసర్

Vivo V5 మోడల్‌కు సక్సెసర్

వివో వీ5 (Vivo V5) మోడల్‌కు సక్సెసర్ వర్షన్‌గా లాంచ్ అయిన వివో వీ5 ప్లస్ ధర రూ.27,980. ఫిబ్రవరి 1 నుంచి అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

ప్రీ-బుకింగ్స్ జనవరి 24 నుంచి ప్రారంభమవుతాయి. ప్రపంచపు మొట్టమొదటి డ్యుయల్ సెల్ఫీ కెమెరా సపోర్ట్‌తో లాంచ్ అయిన వీ5 ప్లస్ పనితీరును విశ్లేషించినట్లయితే...

Bokeh' ఎఫెక్ట్స్‌తో సెల్ఫీలు

Bokeh' ఎఫెక్ట్స్‌తో సెల్ఫీలు

ప్రత్యేకించి సెల్ఫీ ప్రేమికుల కోసం డిజైన్ చేయబడిన వీవో వీ5 ప్లస్ ఫోన్ ఇప్పటి వరకు మార్కెట్లో లాంచ్ అయిన బెస్ట్ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. ఇందుకు కారణం, ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన డ్యుయల్ సెల్ఫీ (20 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్) కెమెరా సెటప్. ఈ కెమెరా ద్వారా 'Bokeh' ఎఫెక్ట్స్‌తో సెల్ఫీలను చిత్రీకరించు కోవచ్చు. 'Bokeh' ఎఫెక్ట్స్‌తో అనేవి డీఎస్‌ఎల్ఆర్ కెమెరాల ద్వారానే సాధమ్యవుతాయి. ఈ మధ్య మార్కెట్లో లాంచ్ అయిన కొన్ని డ్యుయల్ కెమెరా సెటప్ ఫోన్‌లు మాత్రమే 'Bokeh'ఎఫెక్ట్స్‌ను చేరువ చేయగలుగుతున్నాయి.

Sony IMX376 ఇమేజ్ సెన్సార్‌
 

Sony IMX376 ఇమేజ్ సెన్సార్‌

ఈ ఫ్రంట్ డ్యుయల్ సెటప్ కెమెరాలో Sony IMX376 ఇమేజ్ సెన్సార్‌ను వివో ఉపయోగించుకుంది. ఈ రెండు కెమెరా సెన్సార్స్‌లో ఒక సెన్సార్ 'Bokeh'ఎఫెక్ట్స్‌‌ను సృష్టించేందుకు లోతైన సమాచారాన్ని క్యాప్చుర్ చేస్తుంది. ఈ కెమెరాల ద్వారా సెల్ఫీలు చిత్రకరించుకునే సమయంలో aperture విలువను f/0.95 నుంచి f/16 వరకు రియల్ టైమ్ లో కంట్రోల్ చేసుకోవచ్చు. మంచి వెళుతురు కండీషన్‌లలో ఈ కెమెరాలు మరింత వివరణాత్మకంగా పనిచేస్తున్నాయి. HDR mode, face beauty, front LED flash light వంటి అదనపు ఫీచర్లు ఈ డ్యుయల్ కెమెరా సెటప్‌కు మరింతగా దోహదపడే విధంగా వివో మలచింది.

16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా

16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా

ఈ ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా మంచి లైటింగ్ కండీషన్ లలో అద్బుతమైన పనితీరును కనబరుస్తోంది. ఫోటోలను క్యాప్చుర్ చేసే సమయంలో కెమెరాను గరిష్టంగా జూమ్ చేసినప్పటికి దృశ్యాలు మాత్రం లైవ్లీగా కనిపిస్తున్నాయి. అయితే తక్కువ వెళుతరులో చిత్రీకరించిన ఫోటోలు మాత్రం అంతగా అట్రాక్టివ్‌గా ఉండవు.

వాటితో కంపేర్ చేసి చూస్తే..

వాటితో కంపేర్ చేసి చూస్తే..

వన్ ప్లస్ 3, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 7, కూల్‌ప్యాడ్ కూల్ 1 డ్యుయల్, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 7 కెమెరాలతో వివో వీ5 ప్లస్ కెమెరాను పోల్చిచూసినట్లయితే ఫోటోలకు సంబంధించిన లెవల్ ఆఫ్ డిటైలింగ్ ఆకట్టుకునే విధంగా ఉంది. మొత్తంగా చూసినట్లయితే, వీవో వీ5 ప్లస్ డీసెంట్ రేర్ కెమెరాతో పాటు బెస్ట్ క్వాలిటీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఫోన్ డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి...

ఫోన్ డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి...

వివో వీ5 ప్లస్ డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి, ఈ ఫోన్‌ను వెనుక నుంచి చూసినట్లయితే యాపిల్ ఐఫోన్ ఫీల్ కలుగుతుంది. ఈ మధ్య మార్కెట్లో లాంచ్ అవుతోన్న అన్ని చైనా ఫోన్‌లు ఇదే విధంగా డిజైన్ కాబడటం విశేషం. గుండ్రటి వొంపులు అలానే కార్నర్స్‌తో మరింత నాజూకుగా కనిపించే ఈ ఫోన్ చేతిలో సౌకర్యవంతంగా ఇమిడిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఫోన్‌ను సింగిల్‌హ్యాండ్‌తో కంఫర్టబుల్‌గా ఆపరేట్ చేయవచ్చు.

ఫుల్ హైడెఫినిషన్ స్ర్కీన్..

ఫుల్ హైడెఫినిషన్ స్ర్కీన్..

వివో వీ5 ప్లస్ 5.5 అంగుళాల ఫుల్ హైడెఫిపిషన్ స్ర్కీన్‌తో వస్తోంది. 1080 పిక్సల్ రిసల్యూషన్ కెపాసిటీతో వస్తోన్న ఈ డిస్‌ప్లే వైబ్రెంట్ కలర్స్‌ను ఆఫర్ చేస్తుంది. తక్కువ వెళుతురు కండీషన్స్‌లోనూ ఈ డిస్‌ప్లేను సులువుగా టాకిల్ చేయవచ్చు. కళ్లకు ఎటువంటి ఒత్తిడి కలగదు. డిస్‌ప్లే టచ్ రెస్పాన్స్ అద్భుతంగా ఉంటుంది. 2.5 కర్వుడ్ సేఫ్టీ గ్లాస్ డిస్‌ప్లేకు రక్షణ కవచంలా నిలుస్తుంది.

ప్రాసెసింగ్ ఇంకా మల్టీటాస్కింగ్

ప్రాసెసింగ్ ఇంకా మల్టీటాస్కింగ్

వీవో వీ5 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టా కోర్ చిప్‌తో కూడిన క్వాల్కమ్ Snapdragon 625 సీపీయూను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సీపీయూతో జత చేసిన 4జీబి ర్యామ్ వేగవంతమైన ప్రాసెసింగ్‌తో పాటు మల్టీటాస్కింగ్‌ను ఆఫర్ చేస్తుంది. వివో వీ5 ప్లస్ ఫోన్‌లో మల్టిపుల్ యాప్స్‌ను ఒకేసారి రన్ చేసుకోవచ్చు. అయితే, హెవీ గ్రాఫికల్ గేమ్స్ ఆడే సమయంలో పనితీరుపరంగా మైనర్ లోపాలు కనిపిస్తున్నాయి.

స్టోరేజ్ విభాగాన్ని పరిశీలించినట్లయితే..

స్టోరేజ్ విభాగాన్ని పరిశీలించినట్లయితే..

స్టోరేజ్ విభాగాన్ని పరిశీలించినట్లయితే వీవో వీ5 ప్లస్ 64జీబి జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో వస్తోంది. స్టోరేజ్ కెపాసిటీని పెంచుకునేందుకు ఈ ఫోన్‌లో మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ లేదు. ఇది కొంచం నిరుత్సాహపరిచే విషయం.

ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికి..

ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికి..

వీవో వీ5 ప్లస్ ఫోన్‌కు సంబంధించి ప్రాసెసింగ్, మల్టీటాస్కింగ్ ఇంకా స్టోరేజ్ విభాగాలు ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికి, ఇంచుమించుగా ఇదే ధర రేంజ్‌లో మార్కెట్లో లభ్యమవుతోన్న OnePlus 3T భారీ ర్యామ్ ఇంక్ స్టారేజ్ కెపాసిటీతో దూసుకుపోతోంది. మరోవైపు షియోమీ నుంచి Snapdragon 625 CPU, 4జీబి ర్యామ్ కాంభినేషన్‌లో లాంచ్ అయిన రెడ్మీ నోట్ 4 రూ.13,000 రేంజ్‌లో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్‌గా నిలిచింది.

సాఫ్టే‌వేర్ విషయానికి వచ్చేసరికి..

సాఫ్టే‌వేర్ విషయానికి వచ్చేసరికి..

సాఫ్టే‌వేర్ విషయానికి వచ్చేసరికి వీవో వీ5 ప్లస్, ఆండ్రాయిడ్ 6.0 మార్షమల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన Funtouch OS 3.0 ప్లాట్ ఫామ్ పై రన్ అవుతుంది. 4G LTE సపోర్ట్, ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఆధునిక ఫీచర్లను వీవో వీ5 ప్లస్ కలిగి ఉంది.

బ్యాటరీ కెపాసిటీ..

బ్యాటరీ కెపాసిటీ..

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి వీవో వీ5 ప్లస్ 3,160mAh డీసెంట్ బ్యాటరీ సపోర్ట్ తో వస్తోంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ద్వారా ఫోన్ బ్యాటరీని ఎప్పటికప్పుడు వేగవంతంగా ఛార్జ్ చేసుకోవచ్చు. వీవో వీ5 ప్లస్ కనెక్టువిటీ ఆప్ఫన్స్ (4జీ ఎల్టీఈ, డ్యుయల్ సిమ్, యూఎస్డీ ఆన్ ద గో, బ్లుటూత్, వై-ఫై, జీపీఎస్).

నచ్చేవేంటి.. నచ్చనివేంటి

నచ్చేవేంటి.. నచ్చనివేంటి

ఫోన్‌లో నచ్చే అంశాలు :

ఫుల్ హైడెఫినిషన్ డిస్‌‌ప్లే, లేటెస్ట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, బెస్ట్ సెల్ఫీ కెమెరా, మన్నికైన ఫోన్ పనితీరు

ఫోన్‌లో నచ్చని అంశాలు :

మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ లేదు, బ్యాక్ కెమెరా పనితీరు, ఆడియో క్వాలిటీ ఆకట్టుకునే విధంగా లేకపోవటం, బ్యాటరీ పనితీరు, ఎక్కువ ధర

ఫైనల్ పాయింట్ :

బెస్ట్ సెల్ఫీ కెమెరా ఫోన్ కోసం చూస్తున్న వారికి వివో వీ5 ప్లస్ బెస్ట్ ఛాయిస్.

 

Best Mobiles in India

English summary
Vivo V5 Plus review: Engineered to win the selfie war. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X