సామ్‌సంగ్‌ను తలదన్నే ఫోన్ వచ్చేసింది!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌ను సవాల్ చేస్తూ ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ షియోమీ సరికొత్త డ్యుయల్ ఎడ్జ్ కర్వుడ్ ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. సామ్‌సంగ్ ఫోన్‌తో పోల్చితే ధర కూడా చాలా తక్కువ.

|

చైనా ఫోన్‌ల కంపెనీ షియోమీ ఎట్టకేలకు తన 'Mi Note 2' ఫోన్‌ను చైనా రాజధాని బీజింగ్‌లో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక ఈవెంట్‌లో భాగంగా లాంచ్ చేసింది.

సామ్‌సంగ్‌ను తలదన్నే ఫోన్ వచ్చేసింది!

Read More : జియోను హడలెత్తిస్తున్న సమస్యలు ఇవే?

ముందు, వెనుకా 3డీ గ్లాస్ డిజైన్‌తో వచ్చిన ఈ ఫోన్ డ్యుయల్ ఎడ్జ్ కర్వుడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇదే తరహా డిస్‌ప్లే వ్యవస్థను సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, గెలాక్సీ ఎస్6 ఫోన్‌లలో మీరు చూడొచ్చు. గ్లాసియల్ సిల్వర్ ఇంకా పియానో బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

ఫ్లెక్సిబుల్ OLED డిస్‌ప్లే

ఫ్లెక్సిబుల్ OLED డిస్‌ప్లే

Mi Note 2 ఫోన్ 5.7 అంగుళాల డ్యుయల్ ఎడ్జ్ ఫ్లెక్సిబుల్ OLED డిస్‌ప్లేతో వస్తోంది.

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్

ఈ ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ రక్షణ కవచంలా నిలుస్తుంది. ఫోన్‌లో ఏర్పాటు చేసిన సన్‌లైట్ డిస్‌ప్లే ప్రో మోడ్ డైరెక్ట్ సన్‌లైట్‌లోనూ మీ రీడింగ్ క్వాలిటీని ఏ మాత్రం తగ్గించదు. అంతే కాకుండా మీ కళ్లకు ఎటువంటి ఒత్తిడి తగలకుండా చూస్తుంది. . 

క్వాల్కమ్ ప్రాసెసర్...

క్వాల్కమ్ ప్రాసెసర్...

Mi Note 2 ఫోన్ శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 821 క్వాడ్‌కోర్ చిప్‌సెట్‌తో వస్తోంది. ఫోన్ ప్రాసెసింగ్ చాలా వేగంగా ఉంటుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ర్యామ్, స్టోరేజ్
 

ర్యామ్, స్టోరేజ్

Mi Note 2 ఫోన్ రెండు రకాల ర్యామ్ అలానే రెండు రకాల స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ర్యామ్ వేరియంట్స్ వచ్చేసరికి (4జీబి, 6జీబి), స్టోరేజ్ వేరియంట్స్ వచ్చే సరికి (64జీబి, 128జీబి)

రేర్ కెమెరా విషయానికి వచ్చేసరికి

రేర్ కెమెరా విషయానికి వచ్చేసరికి

Mi Note 2 ఫోన్ 22.56 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. సోనీ ఐఎమ్ఎక్స్ 318 Exmor R సెన్సార్‌ను ఈ కెమెరాలో ఉపయోగించారు. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ ఆకట్టుకుంటుంది. ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లు ఈ కెమెరాలో ఉన్నాయి. హై క్వాలిటీ ఫోటోగ్రీఫిని ఈ కెమెరా ద్వారా ఆస్వాదించవచ్చు.

ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

Mi Note 2 ఫోన్ 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరాతో వస్తోంది. ఆటో ఫోకస్ ఫీచర్ ఆకట్టుకుంటుంది. గ్రూప్ సెల్ఫీ ఆప్టిమైజేషన్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను షియోమీ ఈ కెమెరాలో నిక్షిప్తం చేసింది. ఈ ఫీచర్ ద్వారా మల్టీపుల్ సెల్ఫీ షాట్‌లను చిత్రీకరించుకుని వాటిలో బెస్ట్ షాట్‌ను పిక్ చేసుకోవచ్చు.

ఫోన్ బ్యాటరీ

ఫోన్ బ్యాటరీ

Mi Note 2 ఫోన్ శక్తివంతమైన 4070 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. క్విక్ ఛార్జ్ 3.0 టెక్నాలజీ ద్వారా ఫోన్ వేగవంతంగా ఛార్జ్ అవుతుంది. బ్యాకప్ కూడా మార్కెట్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా ఉంటుంది.

కనెక్టువిటీ ఫీచర్లు

కనెక్టువిటీ ఫీచర్లు

Mi Note 2 ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే.. 4జీ ఎల్టీఈ విత్ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ సపోర్ట్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, వై-ఫై, బ్లుటూత్, శాప్ జీపీఎస్.

4జీ+ సపోర్ట్ కూడా...

4జీ+ సపోర్ట్ కూడా...

Mi Note 2 ఫోన్ 4జీ+ కనెక్టువిటీని కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే 600ఎంబీపీఎస్ వరకు ఇంటర్నెట్ వేగాన్ని అందుకోగలదు. అల్ట్రాసోనిక్ ఫింగర్ స్కానర్‌ను ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసారు. ఈ స్కానర్ క్వాల్కమ్ సెన్స్ ఐడీ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. 24-బిట్ హై-ఫై సౌండ్ వ్యవస్థను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

ధరలు..

ధరలు..

చైనా మార్కెట్లో మార్కెట్లో Mi Note 2 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర మన కరెన్సీ ప్రకారం రూ.28,000గా ఉంది. 6 జీబి ర్యామ్ + 128జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,000గా ఉంది. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది.

సామ్‌సంగ్ కంటే తక్కువ ధరకే

సామ్‌సంగ్ కంటే తక్కువ ధరకే

Mi Note 2 ఫోన్ తరహాలోనే డ్యుయల్ ఎడ్జ్ కర్వుడ్ డిస్‌ప్లేతో ఇప్పటికే మార్కెట్లో లభ్యమవుతోన్న సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ధర రూ.50,500గా ఉండటం విశేషం.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Xiaomi Mi Note 2 with dual-edge curved OLED display launched. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X